Jabardasth Show: మొన్నటిదాకా జబర్దస్త్‌లో లేడీ గెటప్ స్పెషలిస్టు! ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ - ఆ ఛాన్స్ ఎలా వచ్చిందో తెలుసా?
ఇటీవల ఏపీ ప్రభుత్వం 1998 డీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని కాంట్రాక్టు బేస్డ్ ప్రభుత్వ పాఠశాలల్లో నియమించింది. దీంతో గణపతి ఊహించని విధంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని ఒడిసి పట్టుకున్నారు.
అదే జీవితం అనుకున్న ఆయనకు జాక్ పాటు తగిలింది. మీరు చదువుతున్నది నిజమే. ఇదేదో సీన్ కోసం నటించే నటనకాదు. నిజంగా ప్రభుత్వ పాఠశాలలో మాస్టార్ అయ్యారు. బుల్లి తెరకు తాత్కాలికంగా వీడ్కోలు పలికి.. ఇప్పుడు విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావాలనే తన చిరకాల కోరికను ఎట్టకేలకు నెరవేర్చుకున్నారు.
ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎంతోమంది టాలెంట్ ఉన్నవారికి వేదికగా మారిన జబర్దస్త్ చాలా మందికి ఉన్నత జీవితాన్ని అందించింది. అలాంటి వారిలో సుధీర్, రష్మీ, హైపర్ ఆది, శ్రీను, చమ్మక్ చంద్ర, వేణు ఇలా ఎంతోమంది జబర్దస్త్ ద్వారా పాపులారిటీ దక్కించుకొని ఆ తర్వాత సినిమాల్లో మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకొని చాలామంది సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంటే మరికొంతమంది తమ కలలను సాకారం చేసి ఆ వైపుగా అడుగులు వేస్తున్నారు.
ఈ విధంగానే ఒకప్పుడు లేడీ గెటప్‌లతో ప్రేక్షకులను అలరించిన జబర్దస్త్ గణపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన కామెడీ పంచ్ లతో పిల్లలను, పెద్దలను అలరించిన గణపతి ఇప్పుడు పిల్లలకు పాఠాలు చెబుతుండడంతో అక్కడ ఫుల్ జోస్ నింపుతున్నారని తాము రోజు స్కూల్ కు వస్తున్నామని సరదాపడుతున్నారు. రోజూ టీవీల్లో కనిపించే మాస్టారుకు ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో బల్లి తెర నుంచి బడికి వచ్చేశారంటూ సరదాపడుతున్నారు. తన 25 సంవత్సరాల కలను ఇటీవల సాకారం చేసుకున్నానంటూ ఆ మాస్టరు గణపతి ఎమోషనల్ అయ్యారు. ఆయనకు చిన్నప్పటి నుంచి టీచర్ అవ్వాలని కోరిక చాలా పదిలంగా ఉండేదట.
B.Ed చేసిన గణపతి ఒకవైపు పరీక్షలకు ప్రిపేర్ అవుతూనే మరొకవైపు ఎన్నో పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు. ఇటీవల ఏపీ ప్రభుత్వం 1998 డీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని కాంట్రాక్టు బేస్డ్ ప్రభుత్వ పాఠశాలల్లో నియమించింది. ఈ నేపథ్యంలోనే గత నెల 15వ తేదీన దీనికి సంబంధించిన జీవో కూడా ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. ఇక అందులో భాగంగానే 1998 డీఎస్సీ బ్యాచ్ అయిన గణపతి ఊహించని విధంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని ఒడిసి పట్టుకున్నారు.
ఇక 1998 డీఎస్సీకి ఎంపికైన గణపతి శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం సంత కొత్తవలస గ్రామంలో ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. ఇన్నాళ్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడాలన్న తన కోరిక నెరవేరిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు తన ఈ 25 ఏళ్ల కోరిక ఏపీ సీఎం జగన్ వల్లే సాధ్యమైంది అంటూ గణపతి సంతోషం వ్యక్తం చేశారు.