Gudivada Amarnath: పవన్ ఒంట్లో ‘కమ్మ’ని పసుపు రక్తం, నారా నరాలే - మంత్రి గుడివాడ ఎద్దేవా
జనసేన పార్టీ పేరు మార్చి చంద్రసేన పెట్టుకుంటే బెటర్ అని గుడివాడ అమర్ నాథ్ ఎద్దేవా చేశారు.
పవన్ కల్యాణ్ ఒంట్లో ప్రవహిస్తున్నది ‘కమ్మ’ని పసుపు రక్తం అని ఏపీ ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ కు ఉన్నవి ఉక్కు నరాలు కాదని, నారా వారి నరాలు అని హేళన చేశారు. విశాఖపట్నంలో గుడివాడ అమర్ నాథ్ మీడియా సమాశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న మాటలు రాజకీయ వ్యభిచారిలా ఉన్నాయని ఆక్షేపించారు. పవన్ ప్రసంగం అంతా ఆంబోతు రంకెలేసినట్టుగా ఉందని.. పవన్ పార్టీకి ఓ విధానం గానీ ఎజెండా గానీ ఏమీ లేవని అన్నారు. పవన్ ఓ రాజకీయ వ్యభిచారి అని అన్నారు. కాపుల మీద పవన్‌కు పేటెంట్ ఉన్నట్టుగా మాట్లాడుతున్నారని.. పవన్‌లా సన్యాసి రాజకీయం చేసే కుటుంబం తమది కాదని అన్నారు. తమ తండ్రి, తాత, తాను ఎమ్మెల్యేలుగా పని చేశామని గుర్తు చేశారు.
జనసేన పార్టీ పేరు మార్చి చంద్రసేన పెట్టుకుంటే బెటర్ అని గుడివాడ అమర్ నాథ్ ఎద్దేవా చేశారు. అన్ని సినిమాల డైలాగులు ఓకే సినిమాలో చెప్తే ఎలా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పేరు తెలియక పోవచ్చని.. కనీసం నీ భార్య పిల్లలు పేర్లు చెప్పగలవా? అని ఎద్దేవా చేశారు.
‘‘సంక్రాంతి పండుగకు ముందు చంద్రబాబు ఇంటికి వెళ్లి సంక్రాంతి మామూళ్లు తీసుకొని వచ్చి మాట్లాడుతున్నావు. ఈ రాష్ట్రంలో ఎక్కువ కాలం పాలించిన టీడీపీ గురించి ఎందుకు మాట్లాడలేదు ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్. నేను డబ్బులు తీసుకోలేదు.. ప్యాకేజీకి, అమ్ముడు పోలేదని, సింహాద్రి అప్పన్న మీద, నీ తల్లి మీద లేదా అన్నయ్య మీద ఒట్టేసి చెప్పగలవా? వెనకాల వస్తున్న వాళ్ళందరూ సైనికులు అంటున్నావు. కానీ గొర్రెల మందిని అంతా తీసుకెళ్లి చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నావు. పవన్ కళ్యాణ్‌కు సందర్భం వచ్చినప్పుడు మాత్రం కాపులు కావాలా.. కాపుల కోసం ఏం చేసావ్? 2014లో పార్టీ పెట్టినప్పుడే చంద్రబాబును పెళ్లి చేసుకున్నావు. ఇంతకీ భార్య నువ్వా ఆయన చెప్పాలి. సినిమాలో హీరో కావచ్చు.. రాజకీయాల్లో మాత్రం నువ్వు విలన్’’ అంటూ గుడివాడ అమర్ నాథ్ తీవ్రస్థాయిలో పవన్ కల్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీ- 20 సదస్సు విశాఖలో
మార్చి 28 ,29 తేదీల్లో G - 20 సదస్సు విశాఖ వేదికగా సదస్సు నిర్వహిస్తున్నట్లు వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. 45 దేశాలు, 250 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.