Anna canteen: విశాఖ అన్న క్యాంటీన్‌లో సినీ ప్రముఖుల భోజనం - ఫీడ్ బ్యాక్ ఏమిటంటే ?
Vizag News: విశాఖ అన్న క్యాంటీన్ లో సినీ ప్రముఖులు భోజనం చేశారు. ప్రభుత్వం పేదల ఆకలి తీర్చే మంచి ప్రయత్నం చేస్తోందని ప్రశంసించారు.

Film celebrities had lunch in Visakha Anna canteen: ఆంధ్రప్రదేశ్ లో అన్న క్యాంటీన్లు పేదవాడి కడుపు నింపుతున్నాయి. ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నారు. చిరుద్యోగులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు.. నిరుపేదలు ఇక్కడ కడుపు నింపుకుంటున్నారు. పేద ప్రజల నుంచి వీటికి మంచి ఆదరణ లభిస్తోంది. అప్పుడప్పుడు ఇక్కడ భోజనాన్ని ప్రముఖులు కూడా రుచి చూస్తూంటారు.
తాజాగా విశాఖ రామా టాకీస్ అంబేద్కర్ భవనం వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లో డాన్స్ మాస్టర్ ప్రముఖ దర్శకుడు రణం చిత్రం ద్వారా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న అమ్మ రాజశేఖర్ తో పాటుగా జబర్దస్త్ కమెడియన్ నటుడు ముక్కు అవినాష్, తల చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న నటుడు రాగిణి రాజ్ లు అన్నా క్యాంటీన్లో మధ్యాహ్నం భోజనం చేశారు ముందుగా క్యూలో నిలబడి టోకెన్ తీసుకొని అనంతరం సామాన్య ప్రజలతో కలిసి అన్న క్యాంటీన్లో ఆహారం తీసుకున్నారు.
తన కుమారుడు రాగిణి రాజ్ హీరోగా పరిచయం అవుతున్న "తల" చిత్రం ప్రమోషన్ లో భాగంగా విశాఖపట్నం విచ్చేసామని మధ్యాహ్నం ఆకలి గా వేస్తున్న నేపథ్యంలో విశాఖలోని రామా టాకీస్ రోడ్డులో ప్రయాణంలో అన్నా క్యాంటీన్ వద్ద అన్నం తినేందుకు రావడం సంతోషంగా ఉందని దర్శకుడు అమ్మ రాజశేఖర్ అన్నారు. రు ప్రభుత్వం పేదల కోసం క్వాలిటీ ఫుడ్ అందించడం ఎంతో శుభ పరిణామం అన్నారు. పేదవారి కోసం ప్రభుత్వం నాణ్యమైన ఆహారాన్ని అందిస్తుందని ఈరోజు దర్శకుడు అమ్మ రాజశేఖర్ ద్వారా అన్న క్యాంటీన్ రుచి చూడగలిగానని సామాన్య ప్రజలతో కలిసి భోజనం చేయడం తాను జీవితంలో మర్చిపోలేననని హీరోగా పరిచయం అవుతున్న రాగిణి రాజ్ అన్నారు. ఆకలి సమయంలో అన్నా క్యాంటీన్లో అన్నం తినడం ఎంతో ఆనందాన్నిచ్చిందని ప్రభుత్వం మంచి ఆహారాన్ని పేదలకి అందించడం గర్వించదగ్గ విషయం అన్నారు.
ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి తమ టీం తరఫున ధన్యవాదాలు తెలిపారు. 22018లో టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. అయితే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. తాము అధికారంలోకి వస్తే వెంటనే అన్న క్యాంటీన్లను పెడతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ మేరకు వందల్లో అన్నా క్యాంటీన్లు పెట్టింది. పలు చోట్ల కొత్తవి పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. చాలా మంది పారిశ్రామిక వేత్తలు అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇస్తున్నారు. అలాగే తమ పుట్టిన రోజు నాడు పేదలకు అన్నం పెట్టించాలనుకునేవారు ఒక రోజు అన్న క్యాంటీన్ విరాళం కూడా భరించే అవకాశాలు కల్పిస్తున్నారు. విరాళం ఇచ్చిన వారి పేర్లు డిస్ ప్లే చేస్తారు.
Also Read: టైగర్ అని ఎలివేషన్ ఇచ్చిన ఫ్యాన్స్ - గాలి తీసేసిన జగన్ - ఇలా అయితే ఎలా అన్నా ?





















