Divvela Madhuri: దువ్వాడ వాణి ఆరోపణలు బాధించాయి, నా చావుకు ఆమెనే కారణం- రోడ్డు ప్రమాదంపై మాధురి కామెంట్స్
Duvvada Srinivas Family Dispute | దువ్వాడ వాణి ఆరోపణలతో తాను మనస్తాపానికి లోనయ్యానని, అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు రోడ్డు ప్రమాదం అనంతరం వైసీపీ నేత దివ్వెల మాధురి తెలిపారు.
Divvela Madhuri Sensational Comments on Duvvada Vani | పలాస: గత మూడు రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) ఫ్యామిలీ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ఏపీ ఎన్నికల అనంతరం తన భర్త దువ్వాడ శ్రీనివాస్, వైసీపీ నాయకురాలు దివ్వెల మాధురితో కలిసి ఉంటున్నారని టెక్కలి జడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి ఆరోపించారు. తన భర్త, మాధురితో కలిసి తనకు, తన పిల్లలకు అన్యాయం చేస్తున్నారని.. మాధురి పిల్లలకు డీఎన్ఏ టెస్టులు చేపించాలని సైతం డిమాండ్ చేయడం కలకలం రేపింది. దువ్వాడ వాణి ఆరోపణలతో మనస్తాపం చెందిన దివ్వెల మాధురి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు తెలిపారు. తన చావుకు కచ్చితంగా దువ్వాడ వాణినే కారణం అవుతుందని, ఆమె చనిపోతే వాణిపై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి నుంచి మాధురి కోరారు.
రోడ్డు ప్రమాదానికి గురైన మాధురి కారు
గత కొన్ని రోజులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధురి కారు లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమెను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అది అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదం కాదని, తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు మాధురి షాకింగ్ న్యూస్ చెప్పారు. వాణి మాటలు తనను తీవ్రంగా బాధించాయని, తనపై, తన పిల్లలపై దువ్వాడ శ్రీనివాస్ భార్య దారుణమైన ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను ప్రాణాలు తీసుకోవాలని భావించినట్లు వెల్లడించారు. ఆసుపత్రిలో డాక్టర్లు చికిత్స చేస్తుంటే, అందుకు దివ్వెల మాధురి నిరాకరించారు. సూసైడ్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే హైవేపై వేగంగా వెళ్తుంటే, ప్రమాదవశాత్తూ మరో కారును ఢీకొట్టి తన కారు బోల్తా పడినట్లు చెప్పారు. కానీ అటుగా వెళ్తున్న కొందరు తనను రక్షించారంటూ మాధురి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నా చావుకు కారణం దువ్వాడ వాణి !
‘దువ్వాడ వాణి గత రెండు రోజులుగా నాపై దారుణమైన ఆరోపణలు చేస్తున్నారు. ఆమె చేస్తున్న ఆరోపణలు, కామెంట్లతో ఆత్మహత్య చేసుకోవాలని ఫిక్సయ్యాను. అందులో భాగంగానే వెళ్తుంటే రోడ్డు ప్రమాదం జరిగింది. నా చావుకు కచ్చితంగా దువ్వాడ వాణినే కారణం అవుతుంది. నేను చనిపోతే పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. దువ్వాడ శ్రీనివాస్ తో పార్టీ పరంగా తనకు సంబంధమని, వ్యక్తిగత రిలేషన్ లేదు. కానీ దువ్వాడ వాణి నాకు, శ్రీనివాస్ కు అక్రమ సంబంధం అంటగట్టాలని చూస్తోంది. నాపై ఉన్న ధ్వేషాన్ని ఆఖరికి నా కుమార్తెలపై సైతం చూపుతోంది.
చిన్నపిల్లలు అని కూడా చూడకుండా నాలుగేళ్లు, ఎనిమిదేళ్ల పిల్లలకు డీఎన్ఏ టెస్టులు చేపించాలని వాణి డిమాండ్ చేస్తోంది. దువ్వాడ వాణి మాటల కారణంగా ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నాను. ఈ సమస్య నుంచి పోలీసులు తనకు సహాయం చేసి సమస్య పరిష్కారం చేయాలని’ దివ్వెల మాధురి కోరారు.
Also Read: Divvela Madhuri: దువ్వాడ ఫ్యామిలీ గొడవలో మరో ట్విస్ట్, టోల్‌గేట్ వద్ద మాధురి కారు బోల్తా