Rsuhikonda News: రుషి కొండని వైసీపీ వాళ్లు రేప్ చేస్తున్నారు- సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
CPI Narayana AP Tour: విశాఖలో వివాదాలకు కేంద్ర బిందువైన రుషి కొండను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సందర్శంచారు. అక్కడ కట్టడాలను పరిశీలించారు.
CPI Narayana AP Tour: రుషి కొండ అత్యాచారానికి గురి అవుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కోర్టు పర్మిషన్‌తో వివాదాస్పదన ప్రాంతాన్ని సందర్శించిన ఆయన.. ప్రభుత్వం, వైసీపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్మిషన్లు ఉన్నప్పటికీ అక్కడ నిర్మాణాలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు.
విశాఖలో వివాదాలకు కేంద్ర బిందువైన రుషి కొండను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సందర్శంచారు. అక్కడ కట్టడాలను పరిశీలించారు. కోర్టు ఆదేశాలతో ఆయన్ని లోపలికి అనుమతించారు. ఆయన ఒక్కడినే కట్టడాలు చూసేందుకు అనుమతి ఇచ్చారు.
భారీ పోలీసు బందోబస్తు మధ్య ఉన్న రుషి కొండను నారాయణ ఒక్కరే సందర్శించారు. రుషి కొండ వెళ్లి అక్కడ నిర్మాణాలు పరిశీలించేందుకు ఆయనకు ఆగస్టు 20న కోర్టు అనుమతి ఇచ్చింది. ఇన్ని రోజులు అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ మధ్య దీనిపై కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ వేశారు నారాయణ. దీంతో హడావుడిగా అధికారులు ఆయన రుషికొండ వెళ్లేందుకు ఓకే చెప్పారు.
భారీగా కార్యకర్తలు, పార్టీ లీడర్లతో వచ్చిన నారాయణ.. రుషి కొండకు వెళ్లేందుకు యత్నించారు. మార్గ మధ్యలోనే అందర్నీ ఆపేసిన పోలీసులు ఒక్క నారాయణను మాత్రమే రుషి కొండపైకి తీసుకెళ్లారు. అక్కడ జరుగుతున్న నిర్మాణాలు చూసి వచ్చిన నారాయణ తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
రుషి కొండపై నిర్మాణాలు 50 శాతం పూర్తి అయ్యాయని.. ఇంకా 50 శాతం అవ్వాల్సి ఉందని తెలిపారు. సహజ సిద్ధమైన రుషికొండ కొండ అనవసరంగా తవ్వేస్తున్నారని ఆరోపించారు నారాయణ. మళ్ళీ ఇలాంటి ప్రకృతి వనరు వస్తుందా అని ప్రశ్నించారు. ఎన్నికొట్లు పెట్టినా మళ్ళీ అలాంటి ఒరిజినలిటి వస్తుందా అని నిలదీశారు. ప్రస్తుతం టెంకాయ మీద పిలక మాధీరిగా రుషి కొండ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రేప్ చేస్తే ఎంత ఘోరంగా ఉంటుందో.. దాని కంటే ఘోరంగా ప్రకృతిని వైసీపీ వాళ్లు రేప్ చేస్తున్నారని తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు.
ప్రకృతికి విరుద్దంగా రుషి కొండను తవ్వేస్తునన పాపం వైఎస్‌ఆర్‌సీపీవాళ్లకు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు నారాయణ. కొండపై జరుగుతున్న నిర్మాణానికి ఇంతవరకు ఎందుకు రహస్యంగా ఉంచారని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కూడా బయట నుంచి పరిశీలించి వెళ్ళారన్నారు. గోప్యంగా ఉంచడం వల్లనే ఎన్నో రహస్యాలు బయటపడ్డాయని గుర్తు చేశారు. నిర్మాణం కట్టడం నిజమే కానీ కొండని త్రవ్వడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. డార్మేటరి రూమ్స్ ఇలా మొత్తం 50 ఎకరాల్లో అనేక రకాలుగా నిర్మాణాలు చేపట్టారని తెలిపారు.
నిర్మాల కారణంగా చుట్టు పక్క ప్రాంతాలు వాటర్ కాలుష్యకారమంగా మారుతున్నా వైఎస్సార్సీపీ వాళ్లకు ఏం పట్టదన్నారు నారాయణ. పర్మిషన్ వచ్చాకే నిర్మిస్తున్నాం అని చెప్తున్నారని... మిడిమిడి జ్ఞానంతో మంత్రులు అనేక రకాలుగా మాట్లాడుతున్నారని వివరించారు. కాబట్టే ఇలా ఆ ప్రాంతం సమస్యలతో వివాదాల కేంద్రంగా మారిందన్నారు.
విశాఖలోని రుషికొండ వైపు వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు దిగ్బంధించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ రుషికొండ పర్యటనకు బయల్దేరిన క్రమంలో పోలీసులు ఈ ఆంక్షలు విధించారు. ఎక్కడికక్కడే చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనదారులను నిలిపి వేశారు. కోర్టు అనుమతి మేరకు నారాయణ ఒక్కరినే రుషికొండ పర్యటనకు అనుమతించారు. రుషికొండ పర్యటనకు వెళ్తున్న నారాయణ వాహనాన్ని గీతం యూనివర్సిటీ జంక్షన్ లో పోలీసులు ఆపారు. వాహనంలోని మిగిలిన వారిని దించిన తర్వాతే అనుమతించారు. నారాయణతోపాటు వాహనంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఇతర నేతలు ఉన్నారు. దీంతో నారాయణ మినహా మిగిలిన వారు దిగిపోవాలని పోలీసులు సూచించారు.