Sinhachalam Tragedy: సింహాచలంలో భక్తుల మృతిపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. అండగా ఉంటామన్న పవన్ కళ్యాణ్
simhachalam chandanotsavam 2025 సింహాచంలో అప్పన్న స్వామి నిజరూప దర్శనం కోసం వచ్చిన భక్తులు గోడకూలి పడటంతో మృతిచెందారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అమరావతి విశాఖ జిల్లా సింహాచలంలో చందనోత్సవం సమయంలో విషాదం చోటుచేసుకుంది. క్యూలైన్లలో భక్లుపై గోడ కూలి ఏడుగురు చనిపోగా, మరికొందరు భక్తులు గాయపడ్డారు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందడం నన్ను కలచి వేసింది. భారీ వర్షాల కారణంగా గోడ కూలడం తో జరిగిన ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అక్కడి పరిస్థితి పై జిల్లా కలెక్టర్, ఎస్పీ తో మాట్లాడాను. గాయపడిన వారికి చికిత్స…
— N Chandrababu Naidu (@ncbn) April 30, 2025
సింహాచలంలో గోడ కూలడంతో క్యూ లైన్లో ఉన్న ఎనిమిది మంది భక్తులు మృతి చెందడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సింహాద్రి అప్పన్న చందనోత్సవ సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. విశాఖపట్నం జిల్లా అధికారులను అడిగి ఘటన వివరాలు తెలుసుకున్నాను. భారీ వర్షాల కారణంగా గోడ కూలిందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లాలోని సింహాచలం ఆలయం వద్ద గోడ కూలి భక్తులు మరణించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తుల మృతి తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చనిపోయిన భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఆంధ్ర ప్రదేశ్ లోని
— Revanth Reddy (@revanth_anumula) April 30, 2025
సింహాచలం ఆలయం వద్ద గోడ కూలి
భక్తులు మరణించిన ఘటన
తీవ్ర ఆవేదనను కలిగించింది.
వారి కుటుంబ సభ్యులకు
నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ…
మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని…
భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
తీవ్రంగా బాధిస్తోందన్న కేటీఆర్
చందనోత్సవం సందర్భంగా సింహాచలం ఆలయంలో గోడ కూలి భక్తులు చనిపోవడం తనను తీవ్రంగా బాధిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సంఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను అన్నారు.






















