అన్వేషించండి

Srikakulam Crime News: టీడీపీ నేత హత్యకు కుట్ర, బిహార్ సుపారీ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

Andhra Pradesh News | పలాస-కాశిబుగ్గ పోలీసులు సుపారిగ్యాంగ్ ను అరెస్ట్ చేసారు. పలాస-కాశిబుగ్గ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బడ్డ నాగరాజును హత్య చేసేందుకు కుట్ర పన్నిన కేసును చాకచక్యంగా ఛేదించారు.

మొత్తం ఏడుగురు సభ్యులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రెండు పిస్టల్స్, ఒక తపంచా , నాలుగు మ్యాగ్ జైన్లు,15 బుల్లెట్లు, మూడు మోటార్ సైకిళ్ళు, ఒక కారు, 9 మెబైల్ ఫోన్లు, బట్టలు ఇతరత్ర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శనివారం కాశిబుగ్గ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హత్యకి కుట్ర పన్నిన కేసు వివరాలను శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి వెల్లడించారు.

టీడీపీ నేత హత్యకు బిహార్ నుంచి గ్యాంగ్

పలాస- కాశిబుగ్గ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా ఉన్న బడ్డ నాగరాజును హత్య చేసేందుకు స్థానికులు బిహార్ గ్యాంగ్ కి సుపారి ఇచ్చారన్నారు. తెలుగుదేశం పార్టీలో నాగరాజు ఎమ్మెల్యే గౌతు శిరీష కి నమ్మకమైన వ్యక్తిగా విధేయుడుగా పనిచేస్తున్నారన్నారు. 2019- 24 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బడ్డ నాగరాజుని రాజకీయంగా, వ్యాపారపరంగా ఇబ్బందులకి గురిచేయడంతో పాటు కేసులు పెట్టించి రౌడీషీట్ ను కూడా ఓపెన్ చేసినట్లుగా పేర్కొన్నారు.


Srikakulam Crime News: టీడీపీ నేత హత్యకు కుట్ర, బిహార్ సుపారీ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

ఎదుగుదలకు అడ్డుగా ఉన్నాడని హత్యకు ప్లాన్

2024లో తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత నాగరాజుకి పార్టీ సముచిత స్థానం కల్పించారు. అటు రాజకీయంగా, వ్యాపార రంగంలోను నాగరాజు దూసుకుపోతున్నా రని తెలిపారు. బడ్డ నాగరాజు తమ వ్యాపారాలకు, రాజకీయ ఎదుగుదలకి అడ్డవస్తున్నారన్న ఉద్దేశ్యంతో చిన్నబాడంకి చెందిన కొందరు ఆయనను నేరుగా ఎదుర్కొనలేక అంతమొందించాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ముద్దాయిలందరూ కలసి సమావేశం ఏర్పాటు చేసుకుని నాగరాజును సుపారి గ్యాంగ్ ద్వారా హత్య చేయించాలని ప్రణాళిక వేసుకున్నారన్నారు. తలో లక్ష రూపాయలు వేసుకోవాలని అనుకున్నారని పేర్కొన్నారు. హనుమంతు బాబురావు అనే వ్యక్తికి పరిచయం ఉన్న బీహార్ గ్యాంగ్ కి చెందిన అలోక్ అను వ్యక్తి ద్వారా ఇతర సభ్యులు ఇక్భాల్ , చోటు, అమీర్,నిరంజన్ పాశ్వాన్ లతో రూ10 లక్షలకి కిరాయి కుదుర్చుకున్నారన్నారు.

బీహార్ నుంచి వారిని గత నెల 10 విశాఖపట్నం రప్పించి అక్కడ నుంచి శ్రీకాకుళం జిల్లాకి తీసుకువచ్చి గత నెల 30 వరకూ ఉంచారన్నారు. ఆ రోజున కాశిబుగ్గలో రూ 2 లక్షలు అడ్వాన్స్ గా కూర్మాపు ధర్మారావు, అంపోలు శ్రీనివాసరావుల వద్ద తీసుకుని రెక్కీ చేసి వెళ్ళిపోయారన్నారు. తర్వాత ఈ నెల 10న ఇక్బాల్, అమీర్, నిరంజన్ పాశ్వాన్ లు పలాస వచ్చి కోసంగిపురం వద్ద గల రౌతు చంద్రశేఖర్ రూంలో ఉన్నారన్నారు. చంద్రశేఖర్ వారికి కావాలసిన ఏర్పాట్లు చూసుకున్నారన్నారు. బీహార్ గ్యాంగ్కి పొన్నాడ కృష్ణారావు రూ 2.50 లక్షల పంపించగా వాటితో 2 పిస్టల్స్ ,1 తపంచా,45 రౌండ్స్ బుల్లెట్లను తెచ్చుకున్నారన్నారు. రెండు ఫేక్ నెంబర్ ప్లేట్లు పెట్టిన మోటార్ సైకిళ్ళను, ఒక అద్దెకి తీసుకున్నమోటార్ సైకిల్ ను అందజేసారన్నారు. ఈ నెల 13న గ్యాంగు నాగరాజును చిన్నబాడం, కాశిబుగ్గ మద్యలో చంపడానికి ప్రయత్నించి విఫలమయ్యారన్నారు. ఈ నెల 20న అంపోలు శ్రీనివాసరావ్ ,ఇక్బాల్ లు ఒక బైక్ పైన, రౌతు చంద్రశేఖర్, అమీర్లు ఒక బైక్ పైన నాగరాజును చంపడానికి వెళ్తుండగా పోలీసులకి పట్టుబడినట్లుగా ఎస్పీ పేర్కొన్నారు.

17 మందిలో ఏడుగురు అరెస్ట్

కోసంగిపురం జంక్షన్ వద్ద గల రూంలో మిగిలిన ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. బడ్డ నాగరాజు హత్యకి కుట్ర పన్నిన కేసులో మొత్తం 17 మంది ప్రమేయం ఉండగా వారిలో ఏడుగుర్ని అరెస్ట్ చేసినట్లుగా ఎస్పీ తెలియజేసారు. అరెస్ట్ అయిన వారిలో చిన్నబాడంకి చెందిన అంపోలు శ్రీనివాసరావు, బీహార్ రాష్ట్రానికి చెందిన ఇక్బాల్ రాజాఖాన్, ఎండి అమీర్, మందస మండలం జిల్లుండ గ్రామానికి చెందిన రౌతు చంద్రశేఖర్ చిన్నబాడంకి చెందిన కూర్మాపు ధర్మారావు, బీహారికి చెందిన నిరంజన్ కుమార్ పాశ్వన్, చిన్నబాడంకి చెందిన కోట శ్రీనివాసరావులను అరెస్ట్ చేసినట్లుగా పేర్కొన్నారు. అలాగే వారి వద్ద నుంచి రెండు పిస్టల్స్, ఒక తపంచా, నాలుగు మ్యాగ్ జైన్లు,15 బుల్లెట్లు, మూడు మోటార్ సైకిళ్ళు, ఒక కారు, 9 మెబైల్ ఫోన్లు , బట్టలు ఇతరత్ర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈ కేసులో 10 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని ఎస్పీ తెలిపారు.

ప్రశాంతంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి ఘటనలు ఒక్కసారిగా ప్రజలను ఉలిక్కిపడే విధంగా చేస్తుంది. అయితే పోలీసులు మాత్రం ఇలాంటి ఘటనలు ఏవైనా సరే భయపడాల్సిన అవసరం లేదు అని చెబుతున్నారు మీకు ఎవరిమీదైనా అనుమానం ఉంటే వెంటనే మా సిబ్బందికి సమాచారం ఇవ్వండి. జిల్లాలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదని ఇవి వింటుంటేనే భయమేస్తుంది అని స్థానికంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులోకి ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతాలనే కి ఎక్కువగా ఉంటాయి ఏ ప్రాంతం నుంచి ఎవరు వచ్చి ఇలాంటివి చేస్తారని భయం అనేది మాలో వెంటాడుతుందని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి.

పోలీసు అధికారులను ప్రశంసించిన ఎస్పీ

బడ్డ నాగరాజు హత్యకి కుట్ర పన్నిన కేసును చేధించిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి అభినందించారు. కాశిబుగ్గ డిఎస్పీ ఎం. వెంకట అప్పారావు, టెక్కలి డిఎస్పీ మూర్తిల పర్యవేక్షణలో ప్రతిభ కనబరచి కేసు చేధించిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించి ప్రశంసించారు

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
UPSC Civils Interview: సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ షెడ్యూలు విడుదల - తేదీలు, సమయం ఇవే
సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ షెడ్యూలు విడుదల - తేదీలు, సమయం ఇవే
Bajaj Chetak 35: కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?
కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Smartphones Under Rs 15000: రూ.15 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?
రూ.15 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?
Embed widget