APSRTC: వైజాగ్ నుంచి ఆ ప్రాంతాలకు త్వరలో మరిన్ని బస్సు సర్వీసులు
APSRTC: వైజాగ్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల ఇబ్బందులు త్వరలో తీరనున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ అద్దె బస్సులకు టెండర్లు ఆహ్వానించి, కొత్త బస్సులు తీసుకురానుంది.
Rented buses from Visakhapatnam : స్మార్ట్ సిటీగా క్రమంగా మారుతున్న విశాఖపట్నం నుంచి ప్రతిరోజూ దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ ఉంది. అయితే వారి అవసరాలకు తగ్గట్టు బస్సుల సంఖ్య లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితులు గమనించి, వైజాగ్ రీజియన్ కు 83 అద్దె బస్సులు నడపడానికి పర్మిషన్ రావడంతో ఈ నెలాఖరు కల్లా టెండర్లు పిలువబోతున్నట్టు సంబంధిత అధికారులు చెబుతున్నారు .
అక్టోబర్ కల్లా రోడ్లపైకి
ఈ అద్దె బస్సుల కోసం టెండర్ల ను ఆల్రెడీ ఆహ్వానించారు. ఈ ప్రక్రియ మొత్తం ముగిశాక.. అద్దె బస్సుల ఓనర్లకు మూడు నెలల గడువు ఇవ్వనున్నారు. ఈ బస్సులను ఏపీఎస్ ఆర్టీసీ ప్రమాణాలకు అనుగుణంగా రెడీ చేసి ప్రయాణీకులకు అందుబాటులోనికి తీసుకువస్తారు. ఈ బస్సులలో 39 మెట్రో ఎక్స్ ప్రెస్‌లు, 12 పల్లె వెలుగు, సిటీ బస్సులు, 8 సూపర్ లగ్జరీ, 8 ఎక్స్ ప్రెస్, 7 అల్ట్రా డీలక్స్ ఉన్నాయి. వీటిలో పల్లె వెలుగు బస్సులను అనకాపల్లి - నర్సీపట్నం రూట్, అనకాపల్లి - విజయనగరం, నర్సీపట్నం - చోడవరంల మధ్య నడుపుతారు. సూపర్ లగ్జరీ బస్సులను విశాఖ నుండి అమలాపురం - కాకినాడల మధ్య నడుపుతామని అధికారులు చెబుతున్నారు. అలాగే అల్ట్రా డీలక్స్ బస్సులు విశాఖ నుండి రాజమండ్రి, పాలకొండ, ఇచ్చాపురం మధ్య సేవలు అందిస్తాయని తెలిపారు.
Also Read: Rains in AP Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - ఏపీలో వాతావరణం ఇలా
చాలినన్ని బస్సులు లేక ప్రయాణికుల అవస్థలు :
విశాఖ నగరం వేగంగా విస్తరిస్తూ ఉండడంతో రోజూ ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు పనుల మీద వచ్చి వెళ్లే వారి సంఖ్య బాగా పెరిగింది. అయితే ప్రయాణికులు తగిన సేవలు అందించే బస్సులు లేక వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విశాఖ నుంచి కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, పాలకొండ, ఇచ్చాపురం, సోంపేట, మందస వంటి ప్రాంతాలకు మరిన్ని బస్సులు నడపాలనే డిమాండ్ పెద్ద ఎత్తున ఉంది. బస్సుల కొరత ఎక్కువగా ఉండడంతో ఈ రూట్లలో డిమాండ్ కు తగిన స్థాయిలో సర్వీసులను నడపలేకపోతుంది ఆర్టీసీ. ఇప్పుడు కొత్తగా రోడ్డెక్కనున్న అద్దె బస్సు సర్వీసులతో ఆ కొరత చాలా వరకూ తీరుతుందని అధికారులు వివరించారు.
Also Read: AP Inter Hall Tickets: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టిక్కెట్లు వచ్చేశాయ్.. ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి!