By: ABP Desam | Updated at : 27 Jul 2022 10:20 PM (IST)
ఏపీ ఇంటర్ సప్లిమెంట్ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఇంటర్ జనరల్, ఒకేషనల్ విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్ధులు తమ పాత హాల్‌టికెట్ నెంబర్, లేదా ఆధార్ కార్డు నెంబర్, పుట్టిన తేదీ వివరాలు లేదా పేరు నమోదుచేసి హాల్‌టికెట్ పొందవచ్చు. ఏపీలో ఆగస్టు 3 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
Download Supplementary Hall Tickets 2022
ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 1,456 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలో మొత్తం 2,41,591 (54 శాతం) మంది ఉత్తీర్ణత సాధించగా.. సెకండ్ ఇయర్‌లో శాతం 2,58,449 (61 శాతం) మంది పాస్ అయ్యారు. పరీక్షల్లో ఫెయిలైన వారికి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు ఇదే..:
ఈ ఏడాది ఆగస్టు 3 నుంచి 12 వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు తొలిసెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్ కింద పరీక్షలు జరుగనున్నాయి.
మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్:
సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్:
ప్రాక్టికల్ పరీక్షలు ఎప్పుడంటే?
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను ఆగస్టు 17 నుంచి 22 వరకు నిర్వహించనున్నారు. అదేవిధంగా ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్ పరీక్షను ఆగస్టు 24న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను ఆగస్టు 26న నిర్వహిస్తారు. ఆయాతేదీల్లో ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు పరీక్షల నిర్వహణ ఉంటుంది.
AP ECET: సెప్టెంబరు 25 నుంచి ఈసెట్ ఫార్మసీ కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
NEET-MDS: నీట్ ఎండీఎస్ కన్వీనర్, మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్
KNRUHS: ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటా సీట్లు, సెప్టెంబరు 24 వరకు వెబ్ఆప్షన్లకు అవకాశం
TOSS Exams: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూలు విడుదల - పరీక్షల టైమ్ టేబుల్ ఇదే!
Paper Pens: ఏపీలో వెరైటీగా పేపర్ పెన్నులు -ఈ పెన్నులు మొలకెత్తుతాయి కూడా
ఒకేసారి 9 వందేభారత్ ఎక్స్ప్రెస్లకు ప్రధాని పచ్చజెండా, తెలుగు రాష్ట్రాలకు రెండు రైళ్లు
BRS Candidates : సమయానికే ఎన్నికలు - అభ్యర్థులూ రెడీ ! బీఆర్ఎస్లో సందడేది ?
Chandrababu Arrest: వచ్చేవారం నుంచి యువగళం కొనసాగింపు, టెలీకాన్ఫరెన్స్లో నారా లోకేశ్ స్పష్టత
Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు
/body>