Rains in AP: బలహీనపడ్డ అల్పపీడనం - ఏపీకి వర్షసూచన, ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులు - ఐఎండీ
ఋతుపవన ద్రోణి రాయ్‌పూర్, మాణ్డలా, బికనీర్, కళింగపట్నం అక్కడి నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 2 .1 కిలోమీటర్లు ఎత్తులో విస్తరించింది.
వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ తీరాల వద్ధ గల అల్పపీడన ప్రాంతం ఈరోజు బలహీనపడిందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఏమైనప్పటికి దాని అనుబంధ ఉపరితల అవర్తనం దక్షిణ అంతర్గత ఒడిశా, సరిహద్దు ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఎత్తుతో నైరుతి వైపు వంగి ఉంటుంది. ఋతుపవన ద్రోణి ఈ రోజు, రాయ్‌పూర్, మాణ్డలా, బికనీర్, కళింగపట్నం అక్కడి నుంచి ఆగ్నేయ దిశగా వాయువ్య & పరిసర ప్రాంతాలు అనగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 2 .1 కిలోమీటర్లు ఎత్తులో విస్తరించింది.
అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టం నుండి 3.1 కి.మీ. ఎత్తు వరకు ఏర్పడి వాయువ్య & ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం అనగా దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్ర ప్రాంతంపై గల అల్ప పీడన ప్రాంతంతో కలసిన ఉపరితల అవర్తనం నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా ఆగ్నేయ ఉత్తర ప్రదేశ్ వరకు కొనసాగి ఈరోజు బలహీన పడింది.
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం
ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాల చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటరువేగముతో వీయవచ్చు
రేపు (సెప్టెంబరు 6)
తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలో మీటరు వేగముతో వీయవచ్చును.
ఎల్లుండి (సెప్టెంబరు 7)
తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.