News
News
వీడియోలు ఆటలు
X

AP Skill Development: 'స్కిల్' డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి అమర్నాథ్

AP Skill Development Scam Case: చంద్రబాబు నాయుడు 371 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని, ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.

FOLLOW US: 
Share:

AP Skill Development Scam Case: 
- తమతో ఒప్పందమే జరగలేదన్న 'సీమెన్స్'
- రూ.371 కోట్లు షెల్ కంపెనీలకు తరలించిన చంద్రబాబు
- కీలక పత్రాలన్నీ మాయం చేసిన చంద్రబాబు
- ఈ కుంభకోణంలో నారా లోకేష్ కూడా పాత్రధారే
- ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడి
విశాఖపట్నం: యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించే (AP Skill Development) ముసుగులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 371 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని, ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ జైలుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. 
స్థానిక సర్క్యూట్ హౌస్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. యువతకు నైపుణ్యాభివృద్ధిని కల్పిస్తామన్న సాకు చూపి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు తన జేబులో వేసుకున్నాడని ఆరోపించారు. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, ఆయా పరిశ్రమలలో పనిచేసే యువతకు అవసరమైన నైపుణ్యాన్ని కల్పించనున్నామని అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మాయ మాటలు చెప్పి సీమెన్స్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రకటించారని అన్నారు. ఇందుకోసం 6 క్లస్టర్లని ఏర్పాటు చేస్తున్నట్లు, ఒక్కో క్లస్టర్ కు 560 కోట్ల రూపాయల చొప్పున సుమారు 3,300 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నామని చంద్రబాబు ప్రకటించారని అమర్నాథ్ చెప్పారు. ఇందులో 10 శాతం అంటే సుమారు 370 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే మిగిలిన 90 శాతం మొత్తాన్ని సీమెన్స్ సంస్థ ఏర్పాటు చేస్తుందని చంద్రబాబు క్యాబినెట్లో ప్రకటించి ఈ స్కామ్ ని ముందుకు తీసుకువెళ్లాలని మంత్రి అమర్నాథ్ ఆరోపించారు. 

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో సింగపూర్ కు చెందిన స్కిల్లర్, ఇన్ వెబ్ సొల్యూషన్స్ వంటి ఆరు షెల్ కంపెనీలను చూపించి 371.25 కోట్ల రూపాయలను ఆయా కంపెనీలకు చంద్రబాబు అండ్ కో తరలించారని చెప్పారు. ఇందులో స్కిల్లర్ కంపెనీ పేర 185 కోట్ల రూపాయలు బదిలాయించారని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు నేరుగా ఈ కంపెనీలకు చేర్పించిన చంద్రబాబు దీనికి సంబంధించిన కీలక పత్రాలను మాయం చేశారని మంత్రి అమర్నాథ్ వివరించారు. చంద్రబాబు అక్రమ మార్గంలో చేర్చిన ఈ మొత్తానికి సంబంధించిన లావాదేవీల వ్యవహారం చంద్రబాబు సృష్టించిన ఒక సెల్ కంపెనీ చేసిన మెసేజ్ ద్వారా వెలుగు చూసిందని, దీంతో తీగలాగితే దొంగ కదిలినట్లు చంద్రబాబు బాగోతం బట్టబయలు అయిందన్నారు. 

ప్రభుత్వంలో ఉన్నాం కదా.. తమకేమీ జరగదని చంద్రబాబు భావించారని కానీ దర్యాప్తు సంస్థలు బాబు వ్యవహారాన్ని ఒకటి ఒకటిగా బయటికి తీస్తున్నాయని మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఇప్పటికే 10 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచిన విషయాన్ని మంత్రి అమర్నాథ్ గుర్తు చేశారు. బాబు ప్రభుత్వంతో సీమెన్స్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందా లేదా అన్న విషయమై దర్యాప్తు సంస్థలు ఆరా తీయగా, అటువంటి ఒప్పందం ఏమి తాము కుదిర్చుకోలేదని సీమెన్స్ యాజమాన్యం 2021 మార్చిలోనే లిఖితపూర్వకంగా తెలియజేసిందని ఆయన వివరించారు. దీనికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వంతో సీమెన్స్ సంస్థలోని ఒక అధికారి ఈ ఒప్పంద పత్రాలపై సంతకం చేసినట్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రకటించిందని, తీరా ఆ వ్యక్తి సీమెన్స్ సంస్థకు రాజీనామా చేసి వెళ్లిపోయాడని, ఆ సంతకాలు కూడా ఫోర్జరీ అని తేలినట్లు మంత్రి అమర్నాథ్ చెప్పారు.
స్టాంపు పేపర్ల కుంభకోణంలో చంద్రబాబు హస్తం!
ఏలేరు నుంచి హైటెక్ సిటీ టు అమరావతి వరకు చంద్రబాబు అనేక కుంభకోణాలకు పాల్పడ్డారని, చివరకు స్టాంపు పేపర్ల కుంభకోణంలో కూడా చంద్రబాబు నాయుడు హస్తం ఉందని తేలిందని ఆయన అన్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు, ఆ పని చేయకుండా యువతను అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు బుక్కాడని అమర్నాథ్ అన్నారు. యువతకు ఉన్న అవకాశాలను కాలరాయటమే కాకుండా, వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాడని, దీన్ని రాష్ట్రంలోని ప్రజలు, ముఖ్యంగా యువకులు గమనించాలని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత స్కిట్ డెవలప్మెంట్ లో యువతకు శిక్షణ ఇచ్చేందుకు 192 హబ్ లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటికే 90 వేల మందికి శిక్షణ ఇప్పించామని ఇందులో 72.5 శాతం మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించామని మంత్రి అమర్నాథ్ తెలిపారు. దీనిని 90% వరకు తీసుకువెళ్లడానికి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అని చెప్పారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని సమీక్షిస్తాం
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల ఓటమికి గల కారణాలను సమీక్షిస్తామని మంత్రి అమర్నాథ్ చెప్పారు. తమ ప్రభుత్వం ఈ సెక్టారును ఎందుకు మెప్పించలేక పోయిందన్న కారణాలపై కూడా చర్చిస్తామని చెప్పారు. భారత్, కెన్యా దేశాల మధ్య పలుసార్లు క్రికెట్ మ్యాచ్ లు జరిగాయి. వీటిలో తరచూ భారత్ జట్టు విజయం సాధించింది. ఎప్పుడో ఒకసారి కెన్యా చేతిలో భారత్ ఓడిపోతే భారత్ జట్టు బలమైనది కాదని చెప్పలేము. అలాగే వరుస విజయాలను తమ ఖాతాలో వేసుకుంటున్న వైసిపి, ఈ ఒక ఎన్నికలో ఓడినంత మాత్రాన బలహీన పడిందనుకోవటం అవివేకమని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. 2024లో జరిగే సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Published at : 21 Mar 2023 05:26 PM (IST) Tags: YS Jagan AP News AP Skill development Scam Gudivada Amarnath Chandrababu  YSRCP

సంబంధిత కథనాలు

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

Weather Latest Update: సండే మండే, రెండు రోజులు అసలు బయటకు వెళ్లొద్దు- సూరన్నతో కాస్త జాగ్రత్త

Weather Latest Update: సండే మండే, రెండు రోజులు అసలు బయటకు వెళ్లొద్దు- సూరన్నతో కాస్త జాగ్రత్త

NTR Centenary Celebrations: రంగమేదైనా ఆయనే హీరో-శకపురుషుని కథనాల సమాహారం

NTR Centenary Celebrations: రంగమేదైనా ఆయనే హీరో-శకపురుషుని కథనాల సమాహారం

పాతపట్నం ఎమ్మెల్యేకి వరుస చేదు అనుభవాలు - మొన్న పార్టీ క్యాడర్, నేడు ప్రజలు ఫైర్!

పాతపట్నం ఎమ్మెల్యేకి వరుస చేదు అనుభవాలు - మొన్న పార్టీ క్యాడర్, నేడు ప్రజలు ఫైర్!

Breaking News Live Telugu Updates: మూడు గంటలకు కేసీఆర్, కేజ్రీవాల్, భగవంత్‌ సింగ్ మాన్‌ ప్రెస్‌మీట్

Breaking News Live Telugu Updates: మూడు గంటలకు కేసీఆర్, కేజ్రీవాల్, భగవంత్‌ సింగ్ మాన్‌ ప్రెస్‌మీట్

టాప్ స్టోరీస్

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!