అన్వేషించండి

Roja Comments: ఆంధ్ర దిష్టిబొమ్మ చంద్రబాబు ఫోటో వేయాలా.? : ఆడుదాం ఆంధ్రా ఫైనల్ పోటీల ప్రారంభంలో మంత్రి రోజా

Minister Roja Comments In Vizag: చంద్రబాబునాయుడుపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. ఆడదాం ఆంధ్ర కిట్లపై సీఎం జగన్ ఫోటో కాకుండా ఆంధ్ర దిష్టిబొమ్మ చంద్రబాబు ఫోటో వేయాల అని ఆమె ప్రశ్నించారు.

Adudam Andhra News: విశాఖలో ఆడుదాం ఆంధ్రా తుది పోటీలను విశాఖలోని రైల్వే స్టేడియంలో శుక్రవారం ఉదయం పర్యాటక, క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. ఈ నెల 9 నుంచి 13 వరకు ఫైనల్ పోటీలు జరగనున్నాయి. ఫైనల్ పోటీలను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన మంత్రి రోజా ప్రతిపక్షాలు, వారికి సహకరించే మీడియాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆడుదాం ఆంధ్రా కిట్‌లపై సీఎం ఫోటో వేస్తే తప్పేంటి? అని ప్రశ్నించిన మంత్రి రోజా.. ఆంధ్రా దిష్టిబొమ్మ చంద్రబాబు ఫోటో వేయాలా? అని పేర్కొన్నారు. పచ్చ మీడియా కడుపు మంటతో రగిలిపోతోంద‌ని మంత్రి రోజా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 2024 ఎన్నికల తర్వాత నాన్ లోకల్‌ పొలిటీషియన్‌లు చంద్రబాబు, పవన్,  లోకేష్, షర్మిల తెలంగాణా  పారిపోవడం ఖాయమని, జగన్‌మోహన్‌రెడ్డి సింహంలా మ్యానిఫెస్టోతో సిద్దంగా వుంటే, ప్రతి పక్ష పార్టీలు  ఇంకా సిద్దంగా లేరని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో వార్ వన్ సైడ్‌ అని, మళ్లీ జగన్‌ సీఎం కావడం ఖాయమ‌ని ఆమె ధీమా వ్య‌క్తం చేశారు. 

షర్మిలపైనా రోజా తీవ్ర ఆగ్రహం

షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒకసారి గమనించాలని, వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డిని జైలు పాలు చేసిన పార్టీతో చేతులు కలిపి అన్యాయం చేశారని ఆరోపించారు. షర్మిలకి తాను ఒక సలహా ఇస్తున్నానని, ఇప్పుడు తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి నుంచి మనకి రావాల్సిన ఆరు వేల కోట్లు, ఉమ్మడి ఆంధ్ర హయాంలో ఏపీకి రావాల్సిన లక్ష 80 కోట్ల ఆస్తులు రాబ‌ట్టాలన్నారు. టూర్ లు పెట్టి ప్రచారం చేస్తున్నారని, తెలంగాణలో పోరాటం చేస్తా అని చెప్పి కాంగ్రెస్ లో విలీనం ఎందుకు చేసిందో షర్మిల చెప్పాలని మంత్రి రోజా డిమాండు చేశారు. ఏపీలో ఏమి లబ్ది పొందడానికి కాంగ్రెస్ తరుపున ప్రచారం చేస్తున్నారో షర్మిల చెప్పాలని, వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే కాంగ్రెస్ మీద ఉమ్మేసి ఉండే వాళ్ళు అని చెప్పిన షర్మిల.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని కాంగ్రెస్ లో మళ్ళీ జాయిన్ అయ్యారో చెప్పాలని మంత్రి నిల‌దీశారు. గట్స్‌ ఉన్న నాయకుడు వైయ‌స్ జ‌గ‌న్‌ అని, చంద్రబాబు, లోకేశ్‌, టీడీపీని జాకీలు పెట్టి లేపినా జాకీలు విరిగిపోతున్నాయన్నారు. బాబు తమ చిత్తూరు జిల్లాలో పుట్టడం సిగ్గుచేటు అని మంత్రి దుయ్య‌బ‌ట్టారు. అధికారంలోకి రావాలన్న కాంక్షతోనే కాంగ్రెస్‌తో ఒకసారి, బీజేపీతో ఇంకోసారి పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పొలిటికల్‌గా రోజురోజుకు చంద్ర‌బాబు దిగజారిపోతున్నారని ఎద్దేవా చేశారు. 

ఆడుదాం ఆంధ్రతో యువతకు మేలు

గ్రామీణస్థాయి నుంచి యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా ప్రారంభించిన మెగా టోర్నీ ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో పోటీల‌ను నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. నాలుగు దశల్లో నిర్వహించిన క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్‌ పోటీలకు విశేష స్పందన వచ్చిందని, జిల్లా స్థాయిలో సత్తా చాటిన జట్లతో రాష్ట్ర స్థాయి పోటీలను ఈ నెల 13 వరకు ఫైన‌ల్ పోటీలు నిర్వ‌హించ‌నున్నట్టు తెలిపారు. ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్ కు 260 జట్లతో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నరని, ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు మహా సంగ్రామం జరగనుందని,13న ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి జగన్‌ హాజరుకానున్నారని తెలిపారు. ఈ క్రీడల్లో విజేతలకు దాదాపు రూ.12 కోట్ల బహుమతులుగా ఇస్తున్నామని పేర్కొన్నారు. ఆమెతో పాటు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Chandra Babu About Mega DSC 2025: మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget