By: ABP Desam | Updated at : 30 Jan 2022 08:52 PM (IST)
ఆందోళన బాటలో ఉద్యోగులు
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల ఉద్యమంపై కన్నెర్రజేస్తుంది. పీఆర్సీ సాధనా సమితి పేరుతో ఉద్యోగులు చేస్తున్న ఉద్యమం ప్రారంభమై చాలా రోజులు కావడం..ఉద్యోగ సంఘాలు వచ్చేనెల 7 నుంచి సమ్మెకు వెళ్ళడానికి సిద్ధం అవుతుండడం లాంటివి ప్రభుత్వ ప్రతిష్ట ఇబ్బందిగా మారుతుండడంపై ఉద్యోగులను దారికి తేవడానికి కొత్త వ్యూహాలు రచిస్తుంది ఏపీ సర్కార్ .
విఫలమైన మంత్రుల కమిటీ చర్చల వ్యూహం
కేవలం 23శాతం పీఆర్సీ , HRA తగ్గింపు లాంటి అంశాలపై ఉద్యోగులకు నచ్చజెప్పడానికంటూ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. అయితే కొత్త పీఆర్సీ జీవోలను రద్దు చెయ్యకుండా చర్చలకు వచ్చేది లేదని పీఆర్సీ సాధనా సమితి చెప్పడంతో ఆ వ్యూహం పని చెయ్యలేదు. అదే సమయంలో కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు రెడీ చెయ్యాలంటూ ట్రెజరీ శాఖను ఆదేశించగా వారు సైతం ఉద్యోగుల నిరసనకు మద్దతు ప్రకటించారు. సాటి ఉద్యోగుల వైపే తాముంటామని సంపూర్ణ మద్దతు ప్రకటించారు .
ట్రెజరీ ఉద్యోగులపై ప్రభుత్వం కన్నెర్ర
జనవరి నెల జీతాలను ప్రాసెస్ చేయాలని, విధులకు హాజరు కాకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని మళ్లీ మళ్లీ ఆదేశాలు ఇస్తున్నప్పటికీ ట్రెజరీ ఉద్యోగులు మాత్రం నిన్నటివరకూ మెట్టు దిగలేదు. ఈ పరిణామాల మధ్య అనూహ్యంగా ట్రెజరీ ఉద్యోగులు, డీడీవోలు విధులకు హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆదివారం సెలవురోజు అయినప్పటికీ- వారు విధులకు హాజరయ్యారు. వేతనల ప్రాసెసింగ్‌ను మొదలుపెట్టారు. జిల్లా కేంద్రాల్లో ట్రెజరీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు, ఇతర సిబ్బంది విధులకు హాజరయ్యారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన పింఛన్ మొత్తాన్ని ఇదివరకే ప్రాసెస్ చేశారు. మూడు శాఖల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, ఆ ఉద్యోగులకు కూడా జీతాలు చెల్లించేలా ప్రాసెసింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. న్యాయస్థానాలు, పోలీస్ శాఖల్లో పనిచేస్తోన్న ఉద్యోగుల జీతాలను చెల్లించేలా ట్రెజరీ సిబ్బంది తమ ప్రాసెసింగ్‌ను కొనసాగిస్తున్నట్లు వారు చెబుతున్నారు. మున్సిపల్ ఉద్యోగుల వేతనాలను కూడా చెల్లించేలా చర్యలు తీసుకున్నారు . దీనికోసం 50 శాతం మంది ట్రెజరీ ఉద్యోగులు హాజరయ్యారు. దీనితో ఉద్యోగుల ఐక్యత చీలిక ప్రారంభమైందా అన్న అనుమానాలు మొదలయ్యాయి .
ఒక్కసారిగా బయటపడిన ఆర్టీసీ ఉద్యోగుల్లో చీలిక
ఉద్యోగ సంఘాల డిమాండ్ పీఆర్సీ పైనా ? HRA పైనా అంటున్న ప్రభుత్వం ?
ఉద్యోగ సంఘాలు నిజానికి ప్రభుత్వం పీఆర్సీ విషయంలో 23 శాతం ఫిట్మెంట్ ప్రకటించినప్పుడు స్వాగతించాయి. తరువాత HRA తగ్గించినప్పుడు మాత్రమే తమ ఉద్యమాన్ని ఉద్దృతం చేసిన మాట వాస్తవం. అయితే పీఆర్సీ సాధనా సమితి డిమాండ్ చేస్తున్న ప్రాథమిక అంశాల్లో HRA కన్నా పీఆర్సీకే ప్రాధాన్యత ఇస్తున్నారు . కిందిస్థాయి ఉద్యోగులకు HRA కన్నా పీఆర్సీపైనే ఆందోళన ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ఎక్కువగా ఎక్కువ పీఆర్సీ నే డిమాండ్ చేస్తున్నాయి. దానితో ఉద్యమం మొదలైన HRA తగ్గింపు అంశం కన్నా పీఆర్సీపై దృష్టి వెళ్ళింది. ఇది అవకాశంగా తీసుకునే ప్రభుత్వ కమిటీలు ఉద్యోగ సంఘాలను విమర్శిస్తున్నాయి .
అకస్మాత్తుగా HRA పెంచిన ప్రభుత్వం -విజయవాడ ఉద్యోగులకే అంటూ మెలిక :
ఉద్యోగ సంఘాలను చీల్చడానికి ఏ అవకాశం వచ్చినా వదులుకోకుండా వ్యూహం పన్నుతున్న ప్రభుత్వం తాజాగా విభజన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి పనిచేస్తున్న ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏను 8 శాతం నుంచి 16 శాతంకు పెంచుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్ఓడీ అధికారుల సిఫార్సుల మేరకు హెచ్ఆర్ఏను ప్రభుత్వం సవరించింది. ఇది ఉద్యోగుల ఉద్యమానికి పెద్ద దెబ్బ అని ప్రభుత్వం భావిస్తుంది. అయితే దీనిపై అప్పుడే అంచనాకు రాలేమని విశ్లేషకులు అంటున్నారు.
ఉద్యమ కార్యాచరణపై తగ్గేదే లేదు :పీఆర్సీ సాధనా సమితి
అయితే ఉద్యోగ సంఘాల వాదన మరోలా ఉంది. తమ ఐక్యతను దెబ్బతీయడానికి ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తున్న మాట వాస్తవమే అని అయితే తమ పోరాటం మాత్రం ముందుకే వెళుతుంది తప్ప భయపడేది లేదని వారు అంటున్నారు. తాము తలపెట్టిన చలో విజయవాడ మొదలుకొని 7వ తేదీ నుంచి ప్రకటించిన సమ్మె వరకూ తమ కార్యాచరణ అమలై తీరుతుంది అంటున్నారు వారు. వీటన్నటి నేపథ్యంలో ఉద్యోగ సంఘాలను చీల్చాలన్న ప్రభుత్వ వ్యూహం పని చేస్తుందా లేక పీఆర్సీపై తాడో-పేడో తేల్చుకోవాలనుకుంటున్న ఉద్యోగ సంఘాల పట్టుదల ఫలిస్తుందా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే .. !
APSRTC Bus Theft: ఆర్టీసీ బస్సునే కొట్టేసిన దుండగుడు, కంగారుపడ్డ డ్రైవర్ - ఇంతలో ఊహించని ట్విస్ట్!
ABP Desam Anniversary: ఏబీపీ దేశం తొలి వార్షికోత్సవం- మొదటి అడుగుతోనే మరింత ముందుకు
Srikakulam News: ఆ భ్రమలోనే పవన్ కళ్యాణ్, నాతో 3 కి.మీ. నడిచే సత్తా ఉందా? - మంత్రి ధర్మాన
Aarogyasri For Prisoners: ఖైదీలకూ ఆరోగ్యశ్రీ! మానవతా దృక్పథంతో ఏపీ సర్కారు నిర్ణయం
Rains in AP Telangana: వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం - నేడు ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, IMD రెడ్ అలర్ట్
Dangerous Job: ప్రపంచంలో ప్రమాదకరమైన ఉద్యోగం ఇదే, ఈ పని చేసిన వారు 50 ఏళ్లు బతకడం చాలా కష్టం
Maharashtra Cabinet Expansion: ఎట్టకేలకు 'మహా' కేబినెట్ విస్తరణ- 18 మందికి చోటు, మహిళలకు నో ఛాన్స్!
Happy Rakhi Pournami 2022: రక్షా బంధన్ శుభముహూర్తం ఎప్పుడు, రాఖీ ఏ టైమ్ లో కట్టాలి!
Munugodu ByElections : చలో మునుగోడు ! తెలంగాణ రాజకీయం అంతా ఇక అక్కడే