News
News
X

ఏపీలో తీసుకున్న చర్యలు ఇతర్రాష్ట్రాల్లో తీసుకుంటే గంజాయి నియంత్రించవచ్చు: ఏపీ డీజీపీ

ఏపీ మాదిరిగా ఇతర రాష్ట్రాల్లో కూడా గంజాయిని నియంత్రించేందుకు ఆయా ప్రభుత్వాలు చర్యలు చేపట్టినట్లయితే రానున్న 3-4సంవత్సరాల్లో గంజాయి అక్రమ రవాణను పూర్తిగా నియంత్రించవచ్చునన్నారు ఏపీ డీజీపీ.

FOLLOW US: 
 

లోన్ యాప్ వేధింపులతో ఆత్మహత్యలకు పాల్పడకుండా బాధితులు ధైర్యంగా ఉండాలని ఎపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. లోన్ యాప్ ల వేధింపులపై కఠినంగా వ్యవహరిస్తామని, బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు. ఇలాంటి కేసులను పరిష్కరించి, బాధితులకు అండగా ఉండాలని జిల్లాల వారీగా ఉన్న పోలీసు అధికారులకు కూడా డీజీపీ ఆదేశాలు ఇచ్చారు. విజయనగరం జిల్లాలో పర్యటించిన ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి... పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

విజయనగరం జిల్లాలో నమోదైన వివిధ కేసులను సమీక్షించామని, చాలా వరకు నేరాల సంఖ్య గణనీయంగా
తగ్గాయని డీజీపీ తెలిపారు. మహిళలపై జరుగుతున్న నేరాలను నిరోధించేందుకు దిశ యాప్ పట్ల ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. మహిళలు తమ మొబైల్స్‌లో దిశ యాప్ ను డౌన్లోడు చేసుకొని, రిజిస్ట్రేషను చేసుకొనే విధంగా చర్యలు చేపట్టామన్నారు.

నాటు సారా పై డీజీపీ ఏమన్నారంటే...

నాటుసారా తయారు చేస్తున్న గ్రామాలను గుర్తించి, నాటుసారా తయారు చేస్తున్న వ్యక్తులు శాశ్వతంగా సారా వ్యాపారాలకు స్వస్తి పలికి, వేరే వృత్తులతో పునరావాసం కల్పించేందుకు గ్రామ స్ధాయిలోనే సర్వేలు నిర్వహించనున్నట్లు డీజీపీ తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించామన్నారు. ప్రభుత్వం కూడా గ్రామాల్లో నాటుసారా
నిర్మూలనే లక్ష్యంగా బిసి, ఎస్సీ కార్పోరేషను, వివిధ స్కీములతో 3,400 కుటుంబాలకు పునరావాసం కల్పించిందన్నారు. అవినీతిని నిర్మూలించేందుకు ప్రభుత్వం రూపొందించిన 14400 మొబైల్ యాప్ సేవలను ప్రజలు
సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ యాప్ కు వచ్చిన ఫిర్యాదులపై ఇప్పటికే 58 కేసులు నమోదు చేసామన్నారు.
లోను యాప్ ల మోసాలను నియంత్రించేందుకు పోలీసుశాఖ ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు
చర్యలు చేపడుతున్నదన్నారు.

News Reels

లోన్ యాప్ లపై కఠినంగా వ్యవహరిస్తాం..
లోను యాప్ ల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని, అవగాహన లేకుండా వారు అడిగే వాటన్నింటికి అనుమతులు ఇవ్వొద్దని డీజీపీ సూచించారు. రుణాలు తీసుకొనే క్రమంలో యాప్ నిర్వాహకులు అడిగిన వాటన్నింటికి అనుమతులు ఇవ్వడంతో మన ఫోటోలు, లొకేషను, కాంటాక్ట్ నంబర్లు తదితర డేటా అంతా వారి చేతుల్లోకి వెళ్ళి పోతుందన్నారు. ఇలా పొందిన డేటాతో వారు రుణగ్రహీతల ఫోటోలను మార్ఫింగ్ చేసి, బెదిరింపులకు పాల్పడుతూ, అధిక వడ్డీలతో మంజూరు చేసిన రుణాలు వసూలు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తూ, వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. 

బ్యాంకు అధికారులు కూడా అనధికార వ్యక్తులు బ్యాంకు ఖాతాలు తెరిచే సమయంలోను అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు చేసే ఖాతాలపై నిఘా పెట్టాలన్నారు. రుణ యాప్ల వేధింపులు కారణంగా ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, సకాలంలో ఫిర్యాదు చేస్తే, వారిపై చర్యలు చేపడతామన్నారు.

గంజాయి పై డీజీపీ ఏమన్నారంటే...
గంజాయి నిర్మూలనకు పోలీసుశాఖ సమర్ధవంతంగా చర్యలు చేపట్టిందన్నారు. పోలీసుశాఖ చేపట్టిన చర్యలు ఫలితంగా చాలా వరకు ఏజన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు లేకుండా నియంత్రించామన్నారు. గిరిజనులు గంజాయికి బదులుగా వేరే పంటలతో లబ్ధి పొందే విధంగా ఉచితంగా విత్తనాలను పంపిణీ చేస్తున్నామన్నారు. గంజాయి అక్రమ రవాణను నియంత్రించేందుకు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, ఆకస్మికంగా వాహన, లాడ్జి తనిఖీలు చేపడుతున్నామని, అనుమానితులను అదుపులోకి తీసుకొని, వివరాలను రాబడుతున్నామన్నారు. 

మన రాష్ట్రం మాదిరిగా ఇతర రాష్ట్రాల్లో కూడా గంజాయిని నియంత్రించేందుకు ఆయా ప్రభుత్వాలు చర్యలు చేపట్టినట్లయితే రానున్న 3-4సంవత్సరాల్లో గంజాయి అక్రమ రవాణను పూర్తిగా నియంత్రించవచ్చునన్నారు. మావోయిస్టు కార్యకలాపాలు ఎఓబిలో ఉన్నాయని, వారి చర్యలను నియంత్రించేందుకు ఎప్పటిలాగే పోలీసుశాఖ చర్యలు కొనసాగిస్తుందన్నారు. 

జిల్లాల పునర్విభజనతో ఏర్పడిన ఇబ్బందులను ఇప్పటికే చాలా వరకు పరిష్కరించామన్నారు. సిబ్బంది, వాహనాలు, మౌళిక వసతుల కల్పన వంటి అంశాల్లో చాలా వరకు సమస్యలు లేకుండా పరిష్కరించామన్నారు. పోలీసు నియామకాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం కొన్ని అంశాలను పరిశీలిస్తుందని, త్వరలో దీనిపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని రాష్ట్ర డిజిపి కే.వి. రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

Published at : 15 Nov 2022 07:22 AM (IST) Tags: ANDHRA PRADESH AP DGP Loan APPs

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ మెయిన్ గేట్ వద్ద ఉద్రిక్తత

Breaking News Live Telugu Updates: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ మెయిన్ గేట్ వద్ద ఉద్రిక్తత

AP News Developments Today: రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లలో అధికారుల బిజీ బిజీ - కీలక నేతలంతా నేడు విజయవాడలోనే

AP News Developments Today: రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లలో అధికారుల బిజీ బిజీ - కీలక నేతలంతా నేడు విజయవాడలోనే

Viral News: గురివింద మొక్క నాగుపాము కంటే డేంజర్ అంటే నమ్ముతారా!

Viral News: గురివింద మొక్క నాగుపాము కంటే డేంజర్ అంటే నమ్ముతారా!

Weather Latest Update: ఏపీకి వాయు గండం- పొంచి ఉన్న తుపాను ముప్పు!

Weather Latest Update: ఏపీకి వాయు గండం- పొంచి ఉన్న తుపాను ముప్పు!

MP GVL Narsimharao : ఏప్రిల్ నాటికి ఏపీలో 5G సేవలు, విశాఖ నుంచి మూడు వందే భారత్ ట్రైన్స్ - ఎంపీ జీవీఎల్

MP GVL Narsimharao : ఏప్రిల్ నాటికి ఏపీలో 5G సేవలు, విశాఖ నుంచి మూడు వందే భారత్ ట్రైన్స్ - ఎంపీ జీవీఎల్

టాప్ స్టోరీస్

పది రూపాయలు ఇచ్చి ఆ పని చేస్తున్నారు- బాలినేని కుమారుడిపై టీడీపీ సెటైర్లు

పది రూపాయలు ఇచ్చి ఆ పని చేస్తున్నారు- బాలినేని కుమారుడిపై టీడీపీ సెటైర్లు

LIC WhatsApp Services: ఇకపై వాట్సాప్‌ ద్వారా ఎల్‌ఐసీ సేవలు - ఇంట్లోంచే అందుకోండిలా!

LIC WhatsApp Services: ఇకపై వాట్సాప్‌ ద్వారా ఎల్‌ఐసీ సేవలు - ఇంట్లోంచే అందుకోండిలా!

Neuberg Diagnostics IPO: భారీ ఐపీవో బాటలో న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్, డబ్బులు రెడీగా పెట్టుకోండి

Neuberg Diagnostics IPO: భారీ ఐపీవో బాటలో న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్, డబ్బులు రెడీగా పెట్టుకోండి

Kids: శీతాకాలంలో పిల్లలకు చెవి ఇన్ఫెక్షన్లు - నొప్పి అని చెబితే నిర్లక్ష్యం వద్దు

Kids: శీతాకాలంలో పిల్లలకు చెవి ఇన్ఫెక్షన్లు - నొప్పి అని చెబితే నిర్లక్ష్యం వద్దు