అన్వేషించండి

YS Jagan Vizag Visit: మంగళవారం విశాఖకు సీఎం జగన్- పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు - పూర్తి షెడ్యూల్ ఇలా

AP CM Jagan Vizag Visit: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. సాగర నగరం విశాఖలో పలు కీలక కార్యక్రమాలకు జగన్ శ్రీకారం చుట్టనున్నారు.

 AP CM Jagan Vizag Visit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. సాగర నగరం విశాఖలో పలు కీలక కార్యక్రమాలకు జగన్ శ్రీకారం చుట్టనున్నారు.

విశాఖలో సీఎం రూట్ ఇదే...
విశాఖపట్నంలో ఆగస్టు 1న ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి, పలు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారు.  

 వైజాగ్‌ ఫేజ్‌ 1లో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణానికి కె. రహేజ కార్ప్‌ గ్రూప్‌ రూ. 600 కోట్ల పెట్టుబడి పెడుతుంది. ఆరు లక్షల చదరపు అడుగులలో మాల్ నిర్మాణం చేయనున్నారు. 4 లక్షల చదరపు అడుగుల పార్కింగ్‌ ప్రాంతంతో పాటుగా, 2026 లో పూర్తి చేసేలా ప్రణాళికను రూపొందిస్తున్నారు. 250 జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌ స్టోర్స్, మల్టిప్లెక్స్‌లు, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సెంటర్, ఫుడ్‌ కోర్టు, టెర్రస్‌ గార్డెన్, షాపింగ్‌ స్పేస్, ప్రత్యక్షంగా, పరోక్షంగా 8000 మందికి ఉపాధి కల్పించనున్నారు. 

- ఫేజ్‌ 2లో దాదాపు 3000 మంది ఉద్యోగులకు సరిపడేలా 2.5 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్, 2027 నాటికి సిద్దమయ్యేలా ప్రణాళిక రచించారు. 
- ఫేజ్‌ 3లో 200 గదులతో 4/5 స్టార్‌ హోటల్, 2029 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా లక్ష్యం ప్లాన్ చేశారు. అన్నీ కూడా గ్రీన్‌ బిల్డింగ్‌ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణాలు జరుగుతాయని తెలిపారు. 

ఆంధ్ర యూనివర్శిటీ కేంద్రంగా ప్రారంభోత్సవాలు.... 
ఆంధ్ర యూనివర్శిటీ లో సీఎం వైఎస్‌ జగన్‌ పలు ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు. ఏ హబ్‌ (ఆంధ్ర యూనివర్శిటీ స్టార్టప్‌ అండ్‌ టెక్నాలజీ ఇంక్యుబేషన్‌ హబ్‌) ను రూ. 21 కోట్ల వ్యయంతో 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. 2025 నాటికి 2 లక్షల చదరపు అడుగులతో దేశంలోనే అతి పెద్ద మల్టి డిసిప్లేనరీ ఇంక్యుబేషన్, ఇన్నోవేషన్‌ ఎకోసిస్టమ్‌లో ఒకటిగా ఉండాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు. ఇందులో భాగంగా మల్టీ సెక్టార్‌ బేస్‌డ్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్స్, అనెక్స్‌ సెంటర్స్, ప్రొటొటైపింగ్‌–మేకర్స్‌ ల్యాబ్, స్టూడెంట్‌ ఐడియేషన్‌ సెంటర్స్‌ ఏర్పాటు కానున్నాయి.  ఎలిమెంట్‌ ( ఆంధ్ర యూనివర్శిటీ ఫార్మా ఇంక్యుబేషన్‌ మరియు బయోలాజికల్‌ మానిటరింగ్‌ హబ్‌)  ఫార్మా, బయోటెక్, జెనోమిక్స్‌ ఇంక్యుబేషన్, టెస్టింగ్‌ ల్యాబ్‌ కోసం రూ. 44 కోట్ల వ్యయంతో 55,000 అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. డ్రగ్, ఫార్మా రీసెర్చ్‌లో ఆవిష్కరణలు, స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి నిర్మించారు. గ్లోబల్‌ కమ్యూనిటీ కోసం చౌకైన మందులను ఉత్పత్తి చేసేందుకు అవసరమయ్యేలా రీసెర్చ్‌ ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు.  

ఆల్గారిథమ్‌ (ఆంధ్ర యూనివర్శిటీ డిజిటల్‌ జోన్‌ మరియు స్మార్ట్‌ క్లాస్‌ రూమ్స్‌ కాంప్లెక్స్‌) రూ. 35 కోట్ల వ్యయంతో 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో 250 సీటింగ్‌ కెపాసిటీ ఉన్న రెండు ఆధునిక సెమినార్‌ హాల్స్ , 15 స్మార్ట్‌ క్లాస్‌ రూమ్స్, 500 కంప్యూటర్‌ సిస్టమ్స్‌తో శిక్షణ ఇవ్వనున్నారు. ఆన్‌లైన్‌ టెస్టింగ్‌ ప్రయోజనాల కోసం నిర్మించిన భవనం,లో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ అవసరాలు తీర్చడం, ఆటోమేషన్, రోబోటిక్స్, డ్రోన్‌ అసెంబ్లీ, స్మార్ట్‌ క్లాస్‌రూమ్స్‌ దీని ప్రత్యేకతలగా చెబుతున్నారు.  ఏయూ– ఎస్‌ఐబీ (ఆంధ్ర యూనివర్శిటీ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌)  ఇది ఐఐఎం విశాఖపట్నంతో ఎంవోయూ కింద రూ. 18 కోట్ల వ్యయంతో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ అండ్‌ అనలటిక్స్‌లో ప్రత్యేక బ్యాచిలర్, మాస్టర్‌ ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. 50 శాతం అంతర్జాతీయ విద్యార్ధులకు ఇందులో ప్రవేశం కల్పిస్తారు. 

ఏయూ– అవంతి (ఆంధ్ర యూనివర్శిటీ అవంతి ఆక్వాకల్చర్‌ స్కిల్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ హబ్‌) ఇది అవంతి ఫౌండేషన్‌ ఎంవోయూతో రూ. 11 కోట్ల వ్యయంతో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన భవనం. మెరైన్‌ ఫార్మింగ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్‌లలో నైపుణ్య శిక్షణ, ఆక్వాకల్చర్, రొయ్యల పెంపకంలో వనరులను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లుగా ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget