News
News
వీడియోలు ఆటలు
X

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సీఎం జగన్‌ శంకుస్థాపన

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు.

FOLLOW US: 
Share:

2,203 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,592 కోట్ల వ్యయంతో భోగాపురంలో నిర్మించతలపెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఇక్కడ నుంచి మూడేళ్లలో తొలి విమానం నడిచేలా నిర్మాణ సంస్థ జీఎంఆర్‌ ప్లాన్ చేస్తోంది. ఒకేసారి ఇరవైకి పైగా విమానాలు దిగేలా ఈ ఎయిర్‌పోర్టును తీర్చిదిద్దనున్నారు. మూడు దశల్లో దీన్ని పూర్తి చేయనుంది. మొదటి దశలో 60 లక్షళ మంది, రెండో దశలో 1.20 కోట్ల మంది, మూడో దశలో 1.80 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించేలా నిర్మించనున్నారు.

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు కల నెరవేరబోతోంది. గతంలో చంద్రబాబు ఓసారి శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టుకు ఇవాళ జగన్ మరోసారి శంకుస్థాపన చేశారు. ఎలాంటి అనుమతులు పొందకుండానే గత ప్రభుత్వం ఎన్నికల కోసం శంకుస్థాపన చేసిందని జగన్ సర్కారు ఆరోపిస్తోంది. ఇప్పుడు మాత్రం అన్ని అనుమతులు పొందిన తర్వాత పనులు ప్రారంభించబోతున్నట్టు చెబుతోంది. 

రూ. 4,592 కోట్ల వ్యయంతో నిర్మించనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర రూపు రేఖలు మారిపోనున్నాయని ప్రభుత్వం చెబుతోంది. 2,203 ఎకరాల విస్తీర్ణంలో 36 నెలల్లో నిర్మాణం పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థ జీఎంఆర్‌ ప్రణాళికలు రచిస్తోంది. ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణించేందుకు వీలు మొదటి దశ పూర్తి చేయనుంది. క్రమంగా దాన్ని కోటీ 80 లక్షల ప్రయాణికులు ప్రయాణించేలా విమానాశ్రయ స్థాయిని పెంచబోతున్నారు. దీన్ని మూడు దశల్లో నిర్మించబోతున్నట్టు సీఎం ప్రకటించారు. 

న్యాయవివాదాలను పరిష్కరించి భూసేకరణ, టెండర్ ప్రక్రియను త్వరితగతిని పూర్తి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొచ్చి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత శంకుస్థాపన చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పీపీపీ విధానంలో ఈ విమానాశ్రయ నిర్మాణ బాధ్యతను జీఎంఆర్‌ గ్రూపు సొంతు చేసుకుంది. ఈ మేరకు ఏపీ ఎయిర్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో ఒప్పందం చేసుకుంది. 

విశాఖ నుంచి, శ్రీకాకుళం  నుంచి వచ్చే ప్రయాణికులకు అనువుగా ఉండేలా అత్యాధునిక రహదారులను నిర్మిస్తున్నారు. వారంతా నేరుగా విమానాశ్రయంలోకి చేరుకునేలా ఈ నిర్మాణం ఉండబోతోంది. అంతర్జాతీయ ఎగ్జిమ్‌ గేట్‌వే ఏర్పాటుకు వీలుగా కార్గో టెర్మినల్, లాజిస్టిక్స్‌ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయబోతున్నారు. తొలి దశలో 5,000 చ.మీ విస్తీర్ణంలో దేశీయ, అంతర్జాతీయ కార్గో టెర్మినల్‌ డెవలప్ చేస్తారు. 
విశాఖ భోగాపురం మధ్య 6,300 కోట్లతో 55 కిలోమీటర్ల మేర ఆరు లైన్ల రహదారి నిర్మించనున్నారు. దీనికి త్వరలోనే శంకుస్థాపన చేయబోతున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. దీనికి ఇరువైపులా కూడా సర్వీస్ రోడ్డు ఉంటుంది. 

ఈ సందర్భంగా మాట్లాడిన జగన్ టీడీపీపై పరోక్ష విమర్శలు చేశారు. భోగాపురంపై టీడీపీ హయాంలోనే ప్రక్రియ పూర్తై ఉంటే పనులు ఎందుకు సాగలేదని ప్రశ్నించారు జగన్. కోర్టుల్లో కేసులను పరిష్కరించుకుంటూ వచ్చామన్నారు. భూసేకరణ పూర్తి చేశామన్నారు. అన్ని అనుమతులు తీసుకొచ్చామని తెలిపారు. టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి ఈ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. ఇవన్నీ కాకుండానే ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు మాత్రమే టెంకాయ కొట్టి వెళ్లిపోయారని చంద్రబాబును ఎద్దేవా చేశారు. మళ్లీ ఏ మాత్రం సిగ్గులేకుండా గతంలోనే శంకుస్థాపన చేశామని చెప్పుకోవడం దారుణమైన రాజకీయాలు ప్రపంచంలోనే ఎక్కడా ఉండబోవన్నారు. 

Published at : 03 May 2023 10:57 AM (IST) Tags: Bhogapuram Airport ABP Desam Jagan Vizianagaram breaking news

సంబంధిత కథనాలు

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

Weather Latest Update: సండే మండే, రెండు రోజులు అసలు బయటకు వెళ్లొద్దు- సూరన్నతో కాస్త జాగ్రత్త

Weather Latest Update: సండే మండే, రెండు రోజులు అసలు బయటకు వెళ్లొద్దు- సూరన్నతో కాస్త జాగ్రత్త

NTR Centenary Celebrations: రంగమేదైనా ఆయనే హీరో-శకపురుషుని కథనాల సమాహారం

NTR Centenary Celebrations: రంగమేదైనా ఆయనే హీరో-శకపురుషుని కథనాల సమాహారం

పాతపట్నం ఎమ్మెల్యేకి వరుస చేదు అనుభవాలు - మొన్న పార్టీ క్యాడర్, నేడు ప్రజలు ఫైర్!

పాతపట్నం ఎమ్మెల్యేకి వరుస చేదు అనుభవాలు - మొన్న పార్టీ క్యాడర్, నేడు ప్రజలు ఫైర్!

Breaking News Live Telugu Updates: మూడు గంటలకు కేసీఆర్, కేజ్రీవాల్, భగవంత్‌ సింగ్ మాన్‌ ప్రెస్‌మీట్

Breaking News Live Telugu Updates: మూడు గంటలకు కేసీఆర్, కేజ్రీవాల్, భగవంత్‌ సింగ్ మాన్‌ ప్రెస్‌మీట్

టాప్ స్టోరీస్

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!