అన్వేషించండి

ABP Desam 2nd Anniversary: ఊరికి చేసిన ఉపకారానికి సైకత శిల్పి కృతజ్ఞత - ఏబీపీ దేశం సైకత శిల్పం..!

ABP Desam 2nd Anniversary Special Sand Art : ఊరికి ఉపకారం చేసిన విషయాన్ని గుర్తు పెట్టుకుని ఏబీపీ దేశానికి ప్రత్యేక సందర్భంలో కృతజ్ఞతలు తెలిపారు శ్రీకాకుళానికి చెందిన సైకత శిల్పి హరికృష్ణ.

ABP Desam 2nd Anniversary Special Sand Art : ఇతరులు తమకు చేసిన మంచిని మరిచిపోయే వారు కొందరు ఉన్నా, తమకు జరిగిన మేలును గుర్తించుకుని కృతజ్ఞత తెలిపిన సందర్భాలు అనేకం మనకు కనిపిస్తుంటాయి. ఊరికి ఉపకారం చేసిన విషయాన్ని గుర్తు పెట్టుకుని ఏబీపీ దేశానికి ప్రత్యేక సందర్భంలో కృతజ్ఞతలు తెలిపారు శ్రీకాకుళానికి చెందిన సైకత శిల్పి హరికృష్ణ. నేడు (జులై 30న) ఏబీపీ దేశం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఛానల్ లోగోతో అద్భుతంగా సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఆముదావలస నియోజకవర్గంలో ఏడాది కిందట ఆదిమానవుల గుహపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది ఏబీపీ దేశం. ఊరికి చారిత్రక గుర్తింపు తీసుకువచ్చేలా కథనాన్ని ప్రచురించిన ఏబీపీ దేశంపై ప్రత్యేక సందర్భంలో అభిమానాన్ని చాటుకున్నారు ఆయన. ఏబీపీ దేశం ఇలానే మరెన్నో ప్రజా ఉపయోగకరమైన కథనాలను చేయటంతో పాటు మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అభినందించారు.

శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు చెందిన సైకత శిల్పి గేదెల హరికృష్ణ మాట్లాడుతూ.. గత 13 ఏళ్లుగా తాను Sand Artistగా చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు ఈవెంట్లలో తన పనితనాన్ని చూపి ఈ ఆర్ట్ ను మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఏబీపీ దేశం మీడియా సంగమేశ్వర ఆలయం దగ్గర ఆదిమానవులు నివసించే స్థావరాలు ఉన్నాయని గతంలో కథనాలు ప్రచురించారు. ఈరోజు రెండో వార్షికోత్సవం జరుపుకుంటున్న ఆ మీడియాకు అభినందనలు తెలుపుతూ.. తమ ప్రాంతాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ సైకతశిల్పం ద్వారా కృతజ్ఞత తెలిపారు. 

 

సాయం చేసిన వ్యక్తులను ఎప్పటికీ మరిచిపోకూడదని, అలాగే ఓ ప్రాంతానికి సంబంధించిన ప్రాచీన, ముఖ్యమైన విషయాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసిన ఏబీపీ దేశం మీడియా మరిన్ని విజయాలు సాధించాలని సైకత శిల్పి హరికృష్ణ ఆకాంక్షించారు. నేడు రెండు వసంతాలు పూర్తి చేసుకుని మూడో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కొన్ని గంటల పాటు శ్రమించి ఏబీపీ దేశం సైకత శిల్పం రూపొందించారు. తమ ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేకతలతో పాటు మరిన్ని చారిత్రక విషయాలు వెలుగులోకి తేవాలని ఆకాంక్షించారు. 

తొలి డిజిటల్ AI న్యూస్ యాంకర్ AIRA ను ఆవిష్కరించిన ABP NETWORK
ఇండియాలోని ప్రముఖ న్యూస్ సంస్థల్లో ఒకటైన ABP Network.. తమ తొలి అర్టిఫిషియల్ యాంకర్ 'ఐరా (AIRA)' ను ప్రవేశపెట్టింది. నెట్‌వర్క్‌లోని తెలుగు డిజిటల్ ఛానల్  ఏబీపీ దేశం రెండో వార్షికోత్సవం సందర్భంగా  ఐరా అనే ఏఐ యాంకర్‌ ను తీసుకొచ్చారు. ABP Desam తెలుగు డిజిటల్ ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే.
AIRA సాంప్రదాయ, ఆధునికతల కలబోత. విజ్ఞానానికి, నైపుణ్యానికి ప్రతీక. ఇక నుంచి ABP Desam ద్వారా వినూత్నమైన వార్తాంశాలను నిత్య నూతనంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు ఐరా అందిస్తుంది. ఇన్నేళ్లలో ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీ అడ్వాన్స్ అవుతూ వచ్చింది. ఈ మార్పులకు తగ్గట్టుగానే న్యూస్ ప్రజెంటేషన్‌లో మార్పులు తీసుకొచ్చింది ABP నెట్‌వర్క్. ఇప్పుడంతా డిజిటల్ జర్నలిజం ట్రెండ్ కొనసాగుతోంది. 
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
Rains: అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
Tirumala News: తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Embed widget