అన్వేషించండి

Visakha Year Ender : విశాఖ చరిత్రలో మర్చిపోలేని ఏడాది, 2022లో ముఖ్య ఘటనలివే!

Visakha Year Ender : 2022లో విశాఖలో పెనుమార్పులు జరిగాయి. అటు రాజకీయంగా, భౌగోళికంగా పూర్తిగా మారిపోయింది విశాఖ. ఈ ఏడాది ముఖ్య ఘటనలివే.

Visakha Year Ender : 2022 విశాఖ చరిత్రలో మర్చిపోలేని ఏడాది. అంతకుముందు ఉమ్మడి ఏపీ లోనూ, విభజన తరువాత ఏపీలోనూ అతిపెద్ద జిల్లాలలో ఒకటిగా పేరుబడ్డ విశాఖ జిల్లా సీఎం జగన్ ఆదేశాలతో జరిగిన జిల్లాల పునర్విభజనలో అతి చిన్న జిల్లాగా మారిపోయింది. కేవలం 928 చ. కి. మీ విస్తీర్ణంతో అసలు గ్రామీణ ప్రాంతమే లేని జిల్లాగా మిగిలిపోయింది. 18.13 లక్షల జనాభాతో విశాఖ జిల్లా మొత్తం ఒక అర్బన్ ప్రాంతంగా మిగిలిపోతే, పాత విశాఖ జిల్లాలోని రూరల్ ప్రాంతాలతో అనకాపల్లి జిల్లా, అటవీ ప్రాంతంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఏర్పడ్డాయి. తొమ్మిదిన్నర లక్షల జనాభాతో అల్లూరి జిల్లా అతి తక్కువ జనాభా కలిగిన జిల్లాగా ఏర్పడింది. 

విశాఖలో అంతర్గత సమస్యలతో వైసీపీ 
 
రాష్ట్రం మొత్తం మీద తిరుగులేని మెజార్టీతో ఉన్న వైసీపీ విశాఖలో మాత్రం పవర్ స్ట్రగుల్ మధ్య నలిగిపోతోంది. ఇక్కడ మొదటి నుంచి ఎంపీ విజయసాయి రెడ్డిదే ప్రధాన పాత్ర. అయితే ఈ ఏడాది దస్ పల్లా భూముల వ్యవహారంలోనూ, రిషికొండ తవ్వకాల అంశంలోనూ వైసీపీ కీలక నేతల మధ్య ఈగో వార్ బలంగా నడిచింది. ఏకంగా మరో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, విజయ సాయిరెడ్డిల  మధ్య నడిచిన రియల్ ఎస్టేట్ వార్ పార్టీని దెబ్బతీసిందని అంటున్నారు సొంతపార్టీ నేతలు. ఆ తరువాత ఉత్తరాంధ్ర వ్యవహారాల కోసం టీటీడీ ఛైర్మన్  వైవీ సుబ్బారెడ్డికి అదనపు బాధ్యతలు అప్పజెబుతూ ఆయన్ను విశాఖకు పంపింది వైసీపీ అధిష్టానం. విజయసాయిరెడ్డిని పార్టీ అనుబంధ విభాగాల ఇంఛార్జ్ హోదాతో అమరావతికి బదిలీ చేసింది. మరోవైపు రాష్ట్రమంతటా తిరుగులేని ఆధిక్యంలో ఉన్న వైసీపీకి 2019 ఎన్నికల్లో విశాఖ మాత్రం కలిసి రాలేదు. స్టేట్ వైడ్ గా దెబ్బతిన్న టీడీపీ ఇక్కడ మాత్రం బలంగా నిలిచింది. అయితే టీడీపీ నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ వైసీపీకి మద్దతు తెలపగా, టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైఖరి ఇంకా ఎవరికీ అంతుబట్టడం లేదు.  ఇక విశాఖను పాలనా రాజధాని చేసేందుకు వైసీపీ అన్ని రకాల చర్యలూ చేపడుతోంది. ప్రజల్లో దీనిపై అవగాహన పెంచేందుకు చేపట్టిన విశాఖ గర్జన కు హోరు వానలోనూ పర్వాలేదనిపించేలా జనం వచ్చారు.  

విశాఖలో బలంగా ఉన్న టీడీపీ :
 
స్టేట్ మొత్తం ఎలా ఉన్నా విశాఖలో మాత్రం టీడీపీ బలంగానే ఉంది. చంద్రబాబు ఈ ఏడాది విశాఖలో చేపట్టిన పర్యటనలు, యాత్రలూ, మినీ మహానాడులూ సక్సెస్ అయినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జైత్రయాత్ర విశాఖ నుంచే మొదలు అని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే అమరావతి నుంచి ఉత్తరాంధ్ర వరకూ అమరావతే రాజధాని అంటూ చేపట్టిన యాత్రను రాజధాని రైతులు, టీడీపీ నేతలు ఉత్తరాంధ్ర వరకూ కొనసాగించలేకపోయారు.  

జనసేనకు కొత్త ఊపు 
 
2022లో జనసేనకు విశాఖ కలిసి వచ్చింది అనే చెప్పాలి. రెండు నెలల క్రితం విశాఖలో జనవాణి కార్యక్రమం నిర్వహించేందుకు పవన్ నగరానికి వచ్చిన నేపథ్యంలో ఆయన అభిమానులకు, వైసీపీ నేతలకు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో నెలకొన్న ఘర్షణ, అనంతరం పవన్ పై పోలీసుల ఆంక్షలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనానికి దారితీసాయి. ఈ సంఘటన తర్వాత అధికార వైసీపీతో ఢీ  అంటే ఢీ  అంటున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.  ఈ ఘటన నేపథ్యంలోనే టీడీపీ, జనసేనల మధ్య మళ్ళీ పాత స్నేహాలు చిగురిస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.  ఏదేమైనా జనసేనలో కొత్త ఊపును 2022 సంవత్సరం తెస్తే దానికి వేదికగా విశాఖ నిలిచింది. 

విశాఖ నుంచి మళ్లీ పోటీ చేస్తా  : జేడీ లక్ష్మీ నారాయణ 
 
గతంలో జనసేన నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిన సీబీఐ మాజీ  జేడీ లక్ష్మీ నారాయణ  మరోసారి విశాఖ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. 

విశాఖలో ఘనంగా ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ -మిలాన్ కార్యక్రమాలు 
 
విశాఖలో ఈ ఏడాది అత్యంత ఘనంగా ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ జరిగింది. ప్రతీ రాష్ట్రపతి పదవీకాలంలో ఒకసారి మాత్రమే జరిగే ఫ్లీట్ రివ్యూను మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ హయాంలో విశాఖ వేదికగా జరిపారు. అలాగే ఇతర దేశాలతో కలిపి నౌకాదళం చేపట్టిన మిలన్ కార్యక్రమం కూడా ఈ ఏడాది విశాఖలో కన్నులపండుగగా జరిగింది. ఈ నెలలోనే నేవీ డే కూడా విశాఖ వాసులను అలరించింది. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా జరగని నేవీ డే  ఈఏడాది జరగడంతో దానిని చూడడానికి జనం పెద్ద ఎత్తున ఆర్కే బీచ్ కు పోటెత్తారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Pushpa 2 Censor: పుష్పరాజ్ రక్తపాతానికి సెన్సార్ కత్తెర... అల్లు అర్జున్ 'పుష్ప 2'లో డిలీట్ చేసిన సీన్స్ లిస్ట్ ఇదిగో
పుష్పరాజ్ రక్తపాతానికి సెన్సార్ కత్తెర... అల్లు అర్జున్ 'పుష్ప 2'లో డిలీట్ చేసిన సీన్స్ లిస్ట్ ఇదిగో
Crime News: 'ఓరి నాయనో.. పోలీస్ డ్రోన్లు వచ్చేస్తున్నాయ్' - పొలాల్లో పరుగులు పెట్టిన మందుబాబులు
'ఓరి నాయనో.. పోలీస్ డ్రోన్లు వచ్చేస్తున్నాయ్' - పొలాల్లో పరుగులు పెట్టిన మందుబాబులు
Embed widget