News
News
వీడియోలు ఆటలు
X

సమ్మర్ లో కశ్మీర్ వెళ్లాలి అనుకుంటున్నారా ? ఇదిగో ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ 

ఫ్లైట్ లో  కశ్మీర్ టూర్ ప్యాకేజీ అనౌన్స్ చేసిన IRCTC 

విశాఖ నుంచి కశ్మీర్ కు 6 రోజుల టూర్ 

ఏప్రిల్ 14 న వైజాగ్ నుంచి ప్రారంభమై 19 న వైజాగ్ లోనే ముగియనున్న టూర్ 

FOLLOW US: 
Share:

 సమ్మర్ వచ్చేసింది .  రకరకాల టూర్ ప్యాకేజీ లు అనౌన్స్ అవుతున్నాయి. సెలవుల్లో సరదాగా విహార ప్రాంతాలకు వెళ్లే వాళ్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి హాలిడే ట్రిప్స్ కి ఎక్కువగా టూరిస్టులు వెళుతున్నట్టు రికార్డ్స్ చెబుతున్నాయి . వీటిని దృష్టిలో పెట్టుకొని IRCTC సమ్మర్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. 

వైజాగ్ టూ కశ్మీర్ టూర్

 స్మార్ట్ సిటీ వైజాగ్ నుంచి భూతల స్వర్గం కశ్మీర్ కు 6 రోజులు ( 6 పగళ్లు - 5 రాత్రులు ) టూర్ ను హెవెన్ ఆన్ ఎర్త్ పేరు మీద అనౌన్స్ చేసింది ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సంస్థ (IRCTC ). ఏప్రిల్ 14న వైజాగ్ లో ప్రారంభమయ్యే ఈ టూర్ 19 వ తేదీన వైజాగ్ లో ముగుస్తుంది . ఇండిగో ఎయిర్ లైన్స్ ఎకానమీ క్లాస్ లో ఈ ప్రయాణం సాగుతుంది. రాత్రివేళల్లో 3 స్టార్ హోటళ్లలో స్టే ఉంటుంది . విశాఖ లో ఎయిర్ పోర్ట్ పికప్ ,డ్రాపింగ్ ,సైట్ సీయింగ్ ,ఉదయం బ్రేక్ ఫాస్ట్ ,నైట్ డిన్నర్ ,ఏసీ వాహనాల్లో సైట్ సీయింగ్ అంతా ప్యాకేజీ లోనే భాగం అని IRCTC ప్రతినిధులు చెబుతున్నారు . 

టూర్ లో కవరయ్యే ప్రాంతాలు ఇవే

కశ్మీర్ టూర్ లో గుల్మార్గా లో గొండోలా పాయింట్ , సోనామార్గ్ లో గ్లాసియర్ , పెహల్గామ్ లోని మినీ స్విట్జర్లాండ్ , కుంకుమ పువ్వు తోటలు , చారిత్రిక  అవంతి పుర నిర్మాణ శిధిలాలు , శ్రీనగర్ లోని డాల్ లేక్ లో పడవ రైడ్ , మొఘల్ గార్డెన్స్ , షాలిమార్ గార్డెన్స్, పారిమహల్ లాంటి టూరిస్ట్ ప్రాంతాలన్నీ కవర్ అవుతాయి అని IRCTC చెబుతోంది . 

ప్యాకేజీ ధరలు ఎంతంటే ?

ఈ 6 రోజుల కాశ్మీర్ టూర్ కి ( సింగిల్ ఆక్యుపెన్సీ ) అయితే  రూ62, 660 , డబుల్ ఆక్యుపెన్సీ అయితే రూ,47,480, ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.46,555 (GST ,ఇతర టాక్స్ లు సహా ) ఛార్జ్ ఫిక్స్ చేశారు.

ఎవరిని సంప్రదించాలి ?

 ఈ టూర్ కి సంబంధించిన ఇతర వివరాల కోసం వైజాగ్ రైల్వే స్టేషన్ లో మెయిన్ గేట్ వద్ద ఉన్న IRCTC కౌంటర్ లో గానీ , లేదా  వారి ప్రతినిధులను సంప్రదించవచ్చు అని IRCTC అధికారి చంద్రమోహన్ అంటున్నారు.  

Published at : 24 Mar 2023 08:14 PM (IST) Tags: IRCTC Vizag Kashmir tour Summer Tour

సంబంధిత కథనాలు

Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?

Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

ఒడిశా రైలు ప్రమాదం ఘటనపై ఏపీ మంత్రుల సమావేశం, కీలక అంశాలపై చర్చ

ఒడిశా రైలు ప్రమాదం ఘటనపై ఏపీ మంత్రుల సమావేశం, కీలక అంశాలపై చర్చ

Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?

Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ -  వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?

Odisha Train Accident: "క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తాం, అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేస్తాం"

Odisha Train Accident:

టాప్ స్టోరీస్

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?

Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?