News
News
X

Minister Botsa On Pawan : పవన్ వల్ల కాపులకు ఒరిగిందేంలేదు, కులం గురించి చెప్పుకోడానికి సిగ్గెందుకు- మంత్రి బొత్స

Minister Botsa On Pawan : పవన్ కల్యాణ్ ను చూస్తే జాలేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కులం గురించి చెప్పుకోడానికి సిగ్గేమిటని ప్రశ్నించారు.

FOLLOW US: 
Share:

Minister Botsa On Pawan : పవన్ కల్యాణ్ వల్ల కాపులకు ఒరిగిందేంలేదని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖపట్నం వైఎస్సార్సీపీ కార్యాయలంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తరాలుగా వస్తున్న కులం గురించి చెప్పుకోవడానికి సిగ్గేమిటని పవన్ కల్యాణ్ ను ప్రశ్నిచారు. తాను మంత్రిగా ఉంటే తనవాళ్లు చెడిపోయింది ఏంటి? మిగతా వాళ్లున్నప్పుడు బాగు పడిందేంటో పవన్‌ కల్యాణ్‌ చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఉనికి కోసమే పవన్ పాట్లు అని ఆరోపించారు. కులం లేదనే పవన్, గంటకోమారు కులాల కుంపటి పెడతారని విమర్శించారు. నీ కులాన్ని చెప్పుకోడానికి నీకు సిగ్గెందుకు పవన్‌ కల్యాణ్‌ అంటూ బొత్స నిలదీశారు. 

అప్పుడు పవన్ ఏంచేశారు? 
 
"తెలంగాణాలో గతంలో 26 బీసీ కులాలు తొలగించారు. అప్పుడు మేము పోరాటం చేశాం. కానీ మీరేం చేశారు?. చంద్రబాబుతో కలిసి ఉన్నా, మీరు కనీసం ప్రశ్నించలేదు. ఆనాడు న్యాయ పోరాటానికి కూడా మేము సిద్ధమయ్యాం. కేంద్రంలో బీజేపీని కూడా మీరు ప్రశ్నించలేకపోయారు?.  బీసీల కోసం చంద్రబాబు ఏం చేయలేదు. అందుకే ఆయన పవన్‌ కల్యాణ్‌తో మాట్లాడిస్తున్నారు. చంద్రబాబు చెప్పిందే పవన్‌ కల్యాణ్‌ చేస్తున్నారు. మా ప్రభుత్వంపై బురద చల్లడమే వారిద్దరి అజెండా.  బీసీలు బ్యాక్‌ బోన్‌ క్లాస్‌ అని జగన్‌ చెప్పారు. అందుకే వారి కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి ఒక్కటి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. అన్ని వర్గాలకు జగన్‌ ఎంతో మేలు చేస్తున్నారు. మేనిఫెస్టోలో దాదాపు 99 శాతం హామీలు అమలు చేశాం. అందుకే మొత్తం 175 స్థానాల్లో గెలుస్తాం" - మంత్రి బొత్స సత్యనారాయణ 

విశాఖ రాజధానికి అడ్డుకునేందుకే 

విశాఖ రాజధానిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు నిరంతరం ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. అలా చాలా మంది దుష్టులు, దుర్మార్గులు రాష్ట్రంలో ఉన్నారన్నారు. రాక్షసుల్లా వారు యజ్ఞ భంగం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అయినా అన్నింటినీ ఛేదిస్తామని, రాజధాని తెచ్చుకుంటామన్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచీ అధికారంలో ఉన్నా, లేకపోయినా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోడానికి జగన్‌ కృషి చేశారన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రజలకి ఇచ్చిన వాగ్ధానాలను నెరవేరుస్తున్నారని చెప్పారు. అదే సెలబ్రిటీ పార్టీ నాయకుడైన పవన్‌ కల్యాణ్‌ మూడ్‌ వచ్చినప్పుడు ఏదో ఒక అంశంపై మాట్లాడతారని ఎద్దేవా చేశారు. క్షుణ్ణంగా పరిశీలించకుండా, నోటికి ఏది వస్తే అది మాట్లాడతారని విమర్శించారు. రాష్ట్రంలో నేనూ ఉన్నాను అని చెప్పుకోవడం కోసం మళ్లీ వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. పక్క రాష్ట్రంలో 26 బీసీ కులాలను జాబితా నుంచి తొలగిస్తే బొత్స ఏం చేస్తున్నారని ఆయన అడుగుతున్నారని, నాయకత్వం వహిస్తున్న వారు, రాజకీయాల్లో ఏదో సాధిద్దాం అనేవారు క్షుణ్ణంగా అవగాహన చేసుకుని మాట్లాడాలన్నారు. 

ఎందుకు ప్రశ్నించలేకపోయారు?

"2014లో విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 26 బీసీ కులాలను బీసీ జాబితా నుంచి తీసేశారు.  అప్పుడు మేం అధికారంలో లేకపోయినా ఆ ప్రభుత్వాన్ని తప్పు అని ప్రశ్నించాం. ఆ అంశంపై మేం న్యాయస్థానానికి వెళ్లడానికి కూడా ప్రయత్నాలు చేశాం. మా సంగతి సరే.. నువ్వేం చేశావ్‌?. 2014లో మీరు బీజేపీతో కలిసి ఎన్నికల్లోకి వెళ్లారు కదా?.  అటు కేంద్రంలో మోదీ వత్తాసు పలికారు. ఇటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో జతకట్టి వెళ్లారు కదా? మీ అదృష్టమో లేక దురదృష్టమో రెండు పార్టీలు అధికారంలోకి వచ్చాయి. మరి మీరు ఆ 26 కులాల అంశంపై ఎన్నిసార్లు మాట్లాడారు?. తెలంగాణ ప్రభుత్వ తప్పుడు నిర్ణయంపై మీరు చేసిన పోరాటం ఏమిటి?.  అప్పుడు చంద్రబాబుతో కలిసి మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? కేంద్రంలో బీజేపీని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు?" - మంత్రి బొత్స 

పవన్‌ను చూస్తే జాలేస్తోంది

పవన్‌ ని చూస్తుంటే ఒక్కో సారి జాలి వేస్తుంటుందని మంత్రి బొత్స అన్నారు. రాష్ట్రంలో 2 లక్షల కోట్ల డీబీటీలో ఇస్తే దానిలో 50 శాతం బీసీల కోసమే ఖర్చు చేసిన ప్రభుత్వం వైసీపీదన్నారు. లెక్కలతో సహా చెప్పడానికి మేం సిద్ధమన్నారు. నిజానికి చంద్రబాబు బీసీలకు ఏమీ చేయలేదని విమర్శించారు. అందుకే పవన్‌ కల్యాణ్‌తో మాట్లాడిస్తున్నారేమో అనిపిస్తోందన్నారు. నిన్న గాక మొన్న 18 ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటిస్తే అందులో 11 మంది బీసీలే ఉన్నారన్నారు. రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ అయినా గతంలో అలా టికెట్లు ఇచ్చిందా? అని ప్రశ్నించారు. చివరకు కాంగ్రెస్‌ పార్టీ కూడా ఆ పని చేయలేకపోయిందన్నారు. రాజ్యసభలో బీసీలకు ఇచ్చిన సీట్లు లెక్కలోకి రావా? అని నిలదీశారు. బీసీలను ఈ ప్రభుత్వం కాపాడలేక పోయిందని చెప్పాలనుకుంటే ఇంతకు ముందు ప్రభుత్వం ఏ రకంగా కాపాడిందో బేరీజు వేసి చెప్పాల్సిందన్నారు. 

 

Published at : 12 Mar 2023 05:23 PM (IST) Tags: AP News Visakha News Pawan Kalyan Kapu Minister Botsa BCs

సంబంధిత కథనాలు

పేర్ని నాని, వసంత కృష్ణ ప్రసాద్ అంతలా తిట్టుకున్నారా? అసలేం జరిగింది?

పేర్ని నాని, వసంత కృష్ణ ప్రసాద్ అంతలా తిట్టుకున్నారా? అసలేం జరిగింది?

High Court Judges Transfer : హైకోర్టు జడ్జిల బదిలీకి రాష్ట్రపతి ఆమోదం- ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరు జడ్జిలు ట్రాన్స్ ఫర్

High Court Judges Transfer : హైకోర్టు జడ్జిల బదిలీకి రాష్ట్రపతి ఆమోదం- ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరు జడ్జిలు ట్రాన్స్ ఫర్

TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !

TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !

Polavaram : పోలవరం మొదటి దశలో 41.15 మీటర్ల మేరకే నీటి నిల్వ - తేల్చి చెప్పిన కేంద్రం !

Polavaram : పోలవరం మొదటి దశలో 41.15 మీటర్ల మేరకే నీటి నిల్వ - తేల్చి చెప్పిన కేంద్రం !

Tirumala Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్-ఆర్జిత సేవా, అంగప్రదక్షిణం టికెట్లు విడుదల

Tirumala Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్-ఆర్జిత సేవా, అంగప్రదక్షిణం టికెట్లు విడుదల

టాప్ స్టోరీస్

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ పూర్తి- సాయంత్రం నాలుగు తర్వాత లెక్కింపు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ పూర్తి- సాయంత్రం నాలుగు తర్వాత లెక్కింపు

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్- సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్-  సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

Kushi Release Date : సెప్టెంబర్‌లో 'ఖుషి' ఖుషీగా - విజయ్ దేవరకొండ, సమంత సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

Kushi Release Date : సెప్టెంబర్‌లో 'ఖుషి' ఖుషీగా - విజయ్ దేవరకొండ, సమంత సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

Chiranjeevi - Brahmanandam : బ్రహ్మికి చిరు, చరణ్ సత్కారం - స్టార్స్‌ను మెప్పిస్తున్న 'రంగమార్తాండ'

Chiranjeevi - Brahmanandam : బ్రహ్మికి చిరు, చరణ్ సత్కారం - స్టార్స్‌ను మెప్పిస్తున్న 'రంగమార్తాండ'