MP GVL On BRS : ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పి రాష్ట్రంలో అడుగుపెట్టాలి, కేసీఆర్ పై ఎంపీ జీవీఎల్ ఫైర్
MP GVL On BRS : కేసీఆర్ ముందు ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పి రాష్ట్రంలో అడుగుపెట్టాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. కేసీఆర్ ఏపీకి చేసిన ద్రోహాన్ని ఆంధ్రులు మరిచిపోరన్నారు.
MP GVL On BRS : తెలంగాణ సీఎం కేసీఆర్ ముందు ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పి ఏపీలో అడుగు పెట్టాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. విశాఖలో మాట్లాడిన ఆయన... ఆంధ్రులను కుక్కలు అని తిట్టిన కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని ఏపీలో పోటీ చేస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ను ఏపీ ప్రజలు ఆదరించరన్నారు. లేని బలాన్ని ఉన్నట్టు కేసీఆర్ చూపిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ తెలంగాణలో కూడా ఓడిపోతారన్నారు. పోలవరం వద్దని కోర్టులో పిటీషన్ వేసిన కేసీఆర్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ తాము కడతామని ఎలా చెబుతారన్నారు. ముందు కోర్టుకు క్షమాపణ చెప్పి ఆ పిటీషన్ వెనక్కి తీసుకోవాలన్నారు. కేసీఆర్ ఏపీకి చేసిన ద్రోహాన్ని ఆంధ్రులు మరిచిపోరన్నారు. ఏపీ పాలకులకు బీఆర్ఎస్ కు మద్దతు తెలుపుతారేమో కానీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు.
ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం సరికాదు
"ర్యాలీలు, రోడ్ షోలు చేసేటప్పుడు పార్టీలు స్వీయ నియంత్రణ పాటించాలి. అంతేగాని ప్రభుత్వాలు నిషేధాలు విధించడం ప్రజాస్వామ్య విధానం కాదు. బీఆర్ఎస్ పార్టీ ఒక దుర్మార్గపు పార్టీ. ఆంధ్ర రాష్ట్ర ప్రజల అవసరాలు తుంగలోకి తొక్కారు. ఆంధ్రలో ప్రాజెక్ట్ లకు కేసీఆర్ అడ్డుపడ్డారు. ఆంధ్ర వారిని తరిమి తరిమి కొడతాను అన్న కేసీఆర్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆంధ్రలోకి వచ్చారు. ఆంధ్ర పాలకులు అవసరమా అని అడిగారు. ఇప్పుడు ఆంధ్ర నుంచి నాయకులు బీఆర్ఎస్ కి తీసుకున్నారు. ఏపీలో అడుగుపెట్టే ముందు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. విభజన సమస్యల పరిష్కారానికి 29 సమావేశాలు పెట్టినా పరిష్కరించలేదు. బీఆర్ఎస్ పార్టీ పని
అయిపోయింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు అవుతుంది. బీఆర్ఎస్ పేరుతో ఆంధ్రలో అడుగుపెట్టే ముందు కేసీఆర్ మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పాలి."- జీవీఎల్
ర్యాలీలపై నిషేధం సబబే
"ఏపీ పాలకులు, నాయకులు కేసీఆర్ కు మడుగులు ఒత్తుతున్నారేమో కానీ ప్రజలకు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. కేసీఆర్ క్షమాపణ చెప్పి ఏపీలో అడుగుపెట్టాలి. పోలవరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మిస్తారని చెబుతున్నారు. తెలంగాణ మంత్రులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. మరి సుప్రీంకోర్టులో పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పిటీషన్లు ఎందుకు వేశారు. పోలవరం ఎత్తు తగ్గించాలని సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లాలి. ఏపీకి న్యాయబద్ధంగా రావాల్సిన అన్ని ఇచ్చి, సుప్రీంలో పిటిషన్ వెనక్కి తీసుకుని, రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ సమ్మతమే లేఖలు ఇచ్చి ఏపీలో అడుగుపెట్టండి. గతంలో మీరు మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పి ఓట్లు అడగండి. ఈసారి ఏపీ ప్రజలు తెలంగాణలో బీఆర్ఎస్ కు బుద్ధి చెబుతారు. కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనలతో ఏపీ ప్రభుత్వం రోడ్ షోలు, ర్యాలీలపై నిషేధం విధించింది సబబే. కొన్ని రోజులైనా ఈ నిర్ణయాన్ని అమలుచేయాలి. సభలు పెట్టుకోవడం రాజకీయ పార్టీల హక్కు కానీ ప్రజలకు ఇబ్బందులు లేకుండా సభలు పెట్టుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రతిపక్షాలను ఇబ్బందులు పెట్టేందుకు ఈ ఆంక్షలు విధిస్తే వ్యతిరేకిస్తాం"- జీవీఎల్