By: ABP Desam, Satyaprasad Bandaru | Updated at : 22 Apr 2023 06:57 PM (IST)
బీజేపీ నేత విష్ణుకుమార్ రెడ్డి
Vishnu Kumar Raju : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఎన్ఎస్జీ కమాండర్ కు గాయాలయ్యాయి. మంత్రి ఆదిమూలపు సురేష్ డైరెక్షన్ లో ఈ దాడి జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ టీ షర్ట్ విప్పి సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందించారు. మీరు బట్టలు విప్పడం కాదు 2024లో ప్రజలే మీ బట్టలు విప్పి పరిస్థితి వస్తుందంటూ హెచ్చరించారు. చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ల దాడికి పాల్పడడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. మంత్రి హోదాలో ఉన్న ఆదిమూలపు సురేష్ బట్టలు విప్పి సవాల్ విసరడం సిగ్గుచేటు అని విమర్శించారు.
ఇంకో మంత్రి ప్యాంట్ విప్పుతారేమో?
వచ్చే ఎన్నికల్లో నూటికి నూరు శాతం వైసీపీ ఓటమి తథ్యమని విష్ణుకుమార్ రాజు చెప్పారు. సీఎం జగన్ మెప్పు పొందడానికే కొందరు మంత్రులు ఇలా ప్రవర్తిస్తున్నారన్నారు. ఇవాళ ఈ మంత్రి టీ షర్ట్ విప్పితే, రేపు ఇంకో మంత్రి ప్యాంట్ విప్పుతారని, మరోసారి ఇంకో మంత్రి బట్టలన్నీ విప్పుతారని సెటైర్లు వేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ జోక్యం చేసుకోవాలని కోరారు. లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉందో చెప్పాలంటే తానే ఉదాహరణ అని చెప్పుకొచ్చిన విష్ణుకుమార్ రాజు.. తాను ఒకప్పుడు రోలెక్స్ వాచ్ వాడేవాడినని, ఇప్పుడు నార్మల్ వాచ్ స్థాయికి దిగిపోయానంటూ విమర్శలు చేశారు.
టీ షర్ట్ విప్పి మంత్రి సురేష్ సవాల్
ప్రకాశం జిల్లా యర్రగొండుపాలెంలో శుక్రవారం రాత్రి హైటెన్షన్ వాతావరణం కనిపించింది. ఓవైపు చంద్రబాబు టూర్ అదే టైంలో ఆయనకు వ్యతిరేకంగా మంత్రి ఆదిమూలపు సురేష్ నిరసన చేపట్టారు. ఓవైపు రాళ్లవర్షం మరోవైపు పోలీసులు లాఠీఛార్జ్‌తో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సవాళ్లు ప్రతిసవాళ్లతో ప్రకాశం జిల్లా ఒక్కసారిగా హీట్ ఎక్కింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలతో ఆయన టూర్‌ను అడ్డుకునేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్ సీన్‌లోకి రావడంతో ప్రశాంతంగా ఉన్న సిట్చుయేషన్ ఒక్కసారిగా వైల్డ్‌గా మారిపోయింది. దళితులకు క్షమాపణ చేప్పిన తర్వాత తన నియోజకవర్గంలో పర్యటించాలని ఆదిమూలపు సురేష్ తమ పార్టీ కార్యకర్తలతో చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఆదిమూలపు సురేష్ పిలుపుతో భారీగా పార్టీ శ్రేణులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. నల్ల జెండాలు, బెలూన్లు పట్టుకొని టీడీపీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా బ్లాక్ టీషర్టుతో నిరసన కార్యక్రమాల్లో పాల్గొని సీన్ హీట్ పెంచారు.
ఉదయం నుంచి సాయంత్ర వరకు అక్కడే ఉన్న వైసీపీ శ్రేణులు చంద్రబాబు వచ్చే టైంలో కూడా నినాదాలు చేశారు. అటుగా వెళ్తున్న టీడీపీ కార్యకర్తలు కూడా వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్‌కు, ఆదిమూలపు సురేష్‌కు వ్యతిరేకంగా నినాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగానే ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆవేశకావేశాలతో కర్రలు, రాళ్లతో ఇరు వర్గాలు దాడులు చేసుకున్నాయి. ఈ దాడుల్లో చంద్రబాబు భద్రతా సిబ్బంది కూడా గాయాలు అయ్యాయి. ఒకానొక దశలో మంత్రి ఆదిమూలపు సురేష్ షర్ట్ విప్పి రండిరా చూసుకుందాం అంటూ టీడీపీ లీడర్లకు సవాల్ చేశారు.
డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన ఘనుడు సీఎం జగన్, చార్జ్ షీట్ రిలీజ్ చేసిన తెలుగు మహిళలు
Guntur Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - 8 మంది మృతి, 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్
AP Contract Employees: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, పర్మినెంట్ చేయాలని నిర్ణయం
AP Minister Peddireddy: ఎనీ టైం బ్యాగ్ వెండింగ్ మిషన్ ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి, పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ
Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన
YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు
Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు
Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ
Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?