YS Jagan: 'జూన్ 4న వెన్నుపోటు దినం'-కూటమి సర్కారుపై జగన్ ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇదే!
YS Jagan: చంద్రబాబు సర్కారు ఏడాది పాలనపై వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ఏడాదిలో చేసిందేమీ లేదని అప్పులు చేసి తన జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు.

YS Jagan: చంద్రబాబు సర్కారు పూర్తిగా కుంభకోణాల్లో కూరుకుపోయిందని ఆరోపించారు వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాజధాని అమరావతి నుంచి ఇసుక వరకు అన్నింటిలో స్కామ్‌లు నడిపిస్తున్నారని అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జగన్... చంద్రబాబు ఏడాది పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు. అవినీతి, స్కాములు, దోపిడీ, అప్పులు, రెడ్‌బుక్ రాజ్యాంగం, బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు.
సంపద సృష్టిస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు విపరీతంగా దోపిడీకి పాల్పడుతున్నారని జగన్ విమర్శలు చేశారు. పాలనలోకి వచ్చి ఏడాది అయినా సంపద సృష్టించకోపోవడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి పడిపోయిందన్నారు. సంక్షేమం పూర్తిగా ఆగిపోయిందని వెల్లడించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేవలం ప్రకటనలు, మోసాలు, ప్రత్యర్థులపై ఆరోపణలతోనే కాలం గడిపారని మండిపడ్డారు.
చంద్రబాబు పాలనలోకి వచ్చిన తర్వాత ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా పడిపోయిందన్నారు జగన్. రాష్ట్ర ఆదాయం కూడా భారీగా పడిపోయిందని గుర్తు చేశారు. అప్పులు చేసి ప్రజలకు మేలు చేసి, రాష్ట్ర ఆదాయం పెంచాల్సిన వ్యక్తి తన జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. కరోనా హయాంలో కూడా సంక్షేమానికి లోటు లేకుండా చూశామని ఆదాయం పడిపోకుండా చేశామన్నారు. తమ ఐదేళ్ల పాలనలో 3,32,671 లక్షల కోట్లు అప్పు చేస్తే ఏడాదిలోనే చంద్రబాబు 1,37,546 లక్షల కోట్లు అప్పులు చేశారని గుర్తు చేశారు.
'జూన్ 4న వెన్నుపోటు దినం' ప్రజలంతా పాల్గొనాలని జన్ పిలుపు
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న వేళ ఆందోళన చేపట్టేందుకు వైసీపీ సిద్ధమైంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన జూన్ 4న వెన్నుపాటు దినంగా జరుపుతున్నట్టు జగన్ ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పిన ఆయన... కుంభకోణాలతో ప్రజల ధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. అందుకే కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు జూన్4న వెన్నుపాటు దినంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆ రోజు జిల్లా, మండలంలోని అధికారులకు వినతి పత్రాలు ఇస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్‌తో ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు పేర్కొన్నారు.
పార్టీ నడపడానికి ఇబ్బంది పడుతున్నాను: జగన్
మీడియా సమావేశంలో జగన్ చేసిన ఓ కామెంట్ ఆసక్తిగా మారింది. లిక్కర్ స్కామ్ కేసులో డబ్బులు చేతులు మారుతూ చివరికి జగన్ వద్దకే చేరానే ఆరోపణలు విపిస్తున్నాయని జాతీయ మీడియా ప్రశ్నించింది. దీనికి సమాధానంగా జగన్ మాట్లాడుతూ... ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయో తనకు చెప్పాలని అన్నారు. డబ్బుల్లేక పార్టీ నడపడానికి ఇబ్బంది పడుతున్నాని చెప్పుకొచ్చారు. అందుకే ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయో చెప్పడని మీడియాకు రిక్వస్ట్ చేశారు.
మోదీ, అమిత్‌షాను కూడా అరెస్టు చేసేయొచ్చు: జగన్
లిక్కర్ స్కామ్‌పై మాట్లాడుతూ రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమిత్‌షా, మోదీపై కూడా కేసులు పెట్టొచ్చని అన్నారు. ఎవరో ఒకర్ని లొంగదీసుకొని స్టేట్మెంట్ కేసులు పెట్టి అరెస్టు చేసేయొచ్చని చెప్పుకొచ్చారు. లిక్కర్ స్కామ్‌పై మాట్లాడుతూ రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమిత్‌షా, మోదీపై కూడా కేసులు పెట్టొచ్చని అన్నారు. ఎవరో ఒకర్ని లొంగదీసుకొని స్టేట్మెంట్ కేసులు పెట్టి అరెస్టు చేసేయొచ్చని చెప్పుకొచ్చారు. అసలు అలాంటి స్టేట్మెంట్‌లు ఇచ్చే వాళ్ల క్రెడిబిలిటీ ఏంటని ప్రశ్నించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కేసీ రెడ్డి టీడీపీ ఎంపీ కేశినేని చిన్నితో వ్యాపారాలు చేస్తున్నారని వివరించారు. ఆ వ్యక్తి తప్పడు స్టేట్మెంట్ ఇచ్చేందుకు అంగీకరించలేదని నిందితుడిగా చేర్చి ఇప్పండి పెడుతున్నారని అన్నారు. తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చేందుకు అంగీకరించినందునే వాసుదేవరెడ్డి బయట ఉన్నారని చెప్పుకొచ్చారు.
ఇలా కేసులు బుక్ చేసుకుంటూ వెళ్లే ఎవరిపైనైనా కేసులు పెట్టి లోపల వేసేయొచ్చని అన్నారు. కానీ ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా చూపించలేకపోతున్నారని అన్నారు. సీఎంవో సంతకాలు చేసినట్టు ఒక్కటైనా ఆధారం ఉందా అని ప్రశ్నించారు. ఇప్పుడు అరెస్టు చేసిన వారు నేరుగా కేసులో ఉన్నట్టు ఒక్క ఆధారమైనా ఉందా అని నిలదీశారు. వైసీపీ పోరాటాల నుంచి పుట్టిందని ఇలాంటి తప్పుడు కేసులు, జైల్లు కొత్తకాదని అభిప్రాయపడ్డారు.





















