అన్వేషించండి

YS Sharmila: కూటమి సర్కారుకు సిగ్గుచేటు, చంద్రబాబు నోరు విప్పాల్సిందే - షర్మిల డిమాండ్

AP News: ఏపీలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తారన్న ప్రచారం వేళ వైఎస్ షర్మిల స్పందించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

Telugu News: ఏపీలో కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేసి, వైద్య విద్యను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారా? అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఇప్పటికే అందని ద్రాక్షలా మారిన వైద్య విద్యను మార్చారని.. పేద విద్యార్థులకు మరింత దూరం చేసే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? అని నిలదీశారు. సోషల్ మీడియా వేదికగా షర్మిల స్పందించారు. 

గుజరాత్ పీపీపీ విధానంపై ఎందుకు అధ్యాయనం చేయాలని అనుకున్నారని షర్మిల అడిగారు. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు విప్పాలని అన్నారు. ఈ మేరకు షర్మిల ఎక్స్ ద్వారా స్పందించారు.

‘‘రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేసి, వైద్య విద్యను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారా ? ఇప్పటికే అందని ద్రాక్షలా మారిన వైద్య విద్యను పేద విద్యార్థులకు మరింత దూరం చేసే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా ? గుజరాత్ పీపీపీ విధానంపై ఎందుకు అధ్యాయనం చేయాలని అనుకున్నారు ? జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే నోరు విప్పాలి. 

ప్రైవేటీకరణ పై సమాధానం చెప్పాలి. కూటమి సర్కార్ లో భాగస్వామ్య పక్షంగా ఉండి, ఈ ఏడాది 5 కొత్త కాలేజీలైన పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పాడేరుల్లో వసతులను కల్పించలేమని,  నిర్వహించడం సాధ్యపడదని, అదనపు సీట్లు కూడా అవసరం లేదని మెడికల్ బోర్డు కి లేఖ రాయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.

ప్రభుత్వ రంగంలో అదనపు సీట్లు వస్తుంటే ఏ రాష్ట్రమైనా వద్ధనుకుంటుందా? ఇది కూటమి సర్కారుకు సిగ్గుచేటు. కొత్తగా 750 సీట్లు సమకూరక పోవడం మీ నిర్లక్ష్యం ఫలితమే. లక్షలు పోసి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న పిల్లల భవిష్యత్ ను అగమ్య గోచరంగా మార్చారు. విద్యార్థుల ఆశలను నీరు గార్చారు.మెడికల్ సీట్లకోసం పక్క రాష్ట్రాల బాట పట్టేలా చేస్తున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ విధానం పెట్టి YCP సర్కార్ మెడికల్ సీట్లను అమ్ముకుంటే... ఆ విధానాన్ని రద్దు చేస్తామని మాట ఇచ్చిన కూటమి సర్కార్..ఇప్పుడు అదే విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. కొత్త మెడికల్ కాలేజీల్లో వసతులను కల్పించి,ఈ ఏడాది నుంచే వాటిని ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది’’ అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలుదేవర చెన్నై ప్రెస్ మీట్లో జాన్వీ కపూర్ స్పీచ్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
One Nation One Election : జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం మరో అడుగు - రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు ఆమోదం - ఇక ఒక్క అడుగే
జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం మరో అడుగు - రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు ఆమోదం - ఇక ఒక్క అడుగే
Waqf Amendment Bill: వక్ఫ్‌ ఆస్తులపై వివాదం ఎందుకు, వక్ఫ్‌ అమెండ్‌మెంట్‌ -2024 లక్ష్యాలేంటి ?
వక్ఫ్‌ ఆస్తులపై వివాదం ఎందుకు, వక్ఫ్‌ అమెండ్‌మెంట్‌ -2024 లక్ష్యాలేంటి ?
Embed widget