అన్వేషించండి

Who is Usha Chilukuri: ఉష చిలుకూరిది ఈ ఊరే, ఏపీ నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డ ఆమె తల్లిదండ్రులు

Usha Chilukuri Vance | అమెరికా ఉపాధ్యక్ష రేసులో నిలిచిన రిపబ్లికన్ అభ్యర్థి జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి వాన్స్. ఆమెకు తెలుగు మూలాలు ఉండటంతో ఉషా చిలుకూరి స్వస్థలంపై సెర్చ్ చేస్తున్నారు.

Who is Usha Chilukuri Vance: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి తెలుగు వారికి ఓ సంబంధం ఉంది. యూఎస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో అంచనాలు నిజమైతే ఓ తెలుగు మహిళ అగ్రరాజ్యంలో రెండో మహిళగా నిలుస్తారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా జె.డి.వాన్స్ పేరును అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. ఆ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి వాన్స్  (Usha Chilukuri Vance). వాన్స్ పేరును డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో భారత్‌లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉషా చిలుకూరి పేరు మార్మోగిపోతోంది. ఆమె ఎవరు ఏ ప్రాంతానికి చెందిన వారు, ఏ సామాజిక వర్గం అని సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు.

కృష్ణా జిల్లాకు చెందిన ఫ్యామిలీ.. 
ఉషా చిలుకూరి వాన్స్ తెలుగు మూలాలున్న మహిళ. ఆమె తండ్రి క్రిష్, తల్లి పేరు లక్ష్మీ. ఆమె పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన వారు. రెండు తరాల మందు వారి కుటుంబం హైదరాబాద్ కు వచ్చింది. ఆమె నానమ్మ, తాతయ్యలు కృష్ణా జిల్లాలోని పామర్రు నుంచి హైదరాబాద్ కు వచ్చి స్థిరపడ్డారు. అనంతరం కొన్నేళ్లకు ఉషా చిలుకూరి తల్లితండ్రులు హైదరాబాద్ నుంచి అమెరికాకు షిష్ట్ అయ్యారు. కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. ఉషా చిలుకూరి తండ్రి ఫిజీషియన్‌గా చేసి రిటైర్ అయ్యారు. రిపబ్లికన్ పార్టీ నుంచి అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించారు. దాంతో వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారని ప్రచారం జరిగింది. కానీ ఆమె బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు. కమ్మ, బ్రాహ్మణ సామాజిక వర్గాల్లో చిలుకూరి అని ఇంటిపేరు ఉండటం వల్ల అంతా కన్‌ఫ్యూజ్ అయ్యారు. దాదాపు ఐదు దశాబ్దాల కిందటే వారి కుటుంబం భారత్ నుంచి అమెరికాకు వెళ్లడంతో ఉషా చిలుకూరి స్వస్థలం, ఆమె ఏ సామాజిక వర్గం అనే విషయాలపై అంత త్వరగా ఎవరికీ తెలియలేదు.   

రిపబ్లికన్ నుంచి డోనాల్డ్ ట్రంప్‌ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. డోనాల్డ్ ట్రంప్ తనకు డిప్యూటీగా ౩9 ఏళ్ల జేడీ వాన్స్ పేరును ఇటీవల ప్రకటించారు. మిల్వాకీలో జరిగిన కార్యక్రమంలో వాన్స్ పేరును ట్రంప్ స్వయంగా అనౌన్స్ చేశారు. తనపై హత్యాయత్నం తర్వాత మొదటి కార్యక్రమంలోనే జేడీ వాన్స్ పేరును ప్రకటించగా, ఉషా అక్కడే ఉన్నారు. తొలిసారి సెనేటర్ అయిన జేడీ వాన్స్ పొలిటికల్ సపోర్ట్, ఆయన ధైర్యం ఉషా చిలుకూరి. భర్త జెడి వాన్ రాజకీయ అడుగులకు ఆమెనే కారణం. 

ఉషా కెరీర్ ఇలా సాగింది 
ఆమె తెలుగు మూలాలున్న అమెరికన్ కాగా, కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌డియాగోలోనే ఉషా చిలుకూరి పుట్టి పెరిగారు. ప్రఖ్యాత Yele  University లో 2010-13 లో లా పట్టా అందుకున్నారు. అక్కడే ఆమెకు జెడి వాన్స్ పరిచయం కాగా,  2014లో వివాహం చేసుకున్నారు. అనంతరం ఆమె లా అసోసియేట్‌గా ఉద్యోగం చేశారు. 2018లో కేంబ్రిడ్జ్ నుంచి ఎంఫిల్ చేసిన ఆమె సుప్రీంకోర్టులో లా క్లర్క్‌గా చేశారు. అక్కడ రిజైన్ చేశాక మళ్లీ పాత కంపెనీలోనే ఉద్యోగం చేస్తూ వచ్చారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా తన భర్త వాన్స్ పేరు అనౌన్స్ చేసిన వెంటనే ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. భర్తను అమెరికా ఉపాధ్యక్ష పదవిలో చూసేందుకు తన వంతు కృషి చేయడానికి రాజకీయాల బాట పడుతున్నారు.
Also Read: ఒక్క పుస్తకంతో భారీ సంపాదన - ట్రంప్ డిప్యూటీ జేడీ వాన్స్ ఆస్తులు, ఆదాయం వివరాలు ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Support From YSRCP: అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
Embed widget