Amarnath Cloudburst: అమర్‌నాథ్ వర్ష బీభత్సంలో చిక్కుకున్న బెజవాడ వాసులు- క్షేమంగా ఉన్నట్టు వీడియో విడుదల
బెజవాడ వాసులు అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన బెజవాడ వాసులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆందోళన చెందుతున్న బంధువులకు క్షేమంగా ఉన్నట్టు వీడియో సమాచారం పంపించారు.
అమర్‌నాథ్ యాత్ర చాలా సవాళ్లతో కూడుతున్న యాత్ర. ఆ దేవుడిపై భక్తితో అన్ని హర్డిల్స్‌ను దాటుకొని మంచు శివలింగాన్ని దర్శించకోవడానికి దేశ నలుమూలల నుంచి కోట్ల మంది భక్తులు వెళ్తుంటారు. అలా వెళ్లిన వారికి కొన్ని సార్లు ప్రకృతి భయపెడుతుంటుంది. అయినా భక్తులు వెనక్కి తగ్గడం లేదు. ఏటా ఇక్కడకు వచ్చే భక్తు సంఖ్య పెరుగుతూనే ఉంది. అలా వెళ్లిన ఓ బెజవాడ ఫ్యామిలీ శుక్రవారం జరిగిన ప్రమాదంలో చిక్కుకుంది.
విజయవాడ నుంచి అమర్‌నాథ్ యాత్రకు వెళ్ళిన శంకర్ కుటుంబం వర్ష బీభత్సం నుంచి తృటిలో తప్పించుకుంది. రాత్రి వేళల్లో ప్రయాణం వద్దని నిర్ణయించుకోవడంతో సురక్షితంగా బయపడిందా ఫ్యామిలీ. చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రస్తుతం తాము ఉన్న క్యాంప్‌లో ఆర్మీ అన్ని సేవలు అందిస్తుందని శంకర్ చెప్పారు. సైనికుల సేవలను కొనియాడారు. నిన్న మధ్యాహ్నం వరకు వాతావరణం బాగానే ఉందని ఉన్న ఫళగా వాతావరణం మారిపోయిందని ఆయన వివరించారు. విపరీతంగా వర్షాలు కురిశాయని పంచగంగ వద్ద నీటి ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగి చాలా మంది గల్లంతయ్యారని ఆయన చెప్పారు.
వర్షంలో కూడా ఆర్మీ రంగంలోకి దిగి సేవలను అందించారని, వారి సేవలను చూస్తే కాళ్లకు దణ్ణం పెట్టాలి అనిపించిందని శంకర్ భావోద్వేగానికి గురయ్యారు. పంచనదుల నుంచి వచ్చిన నీటి ఉద్దృతి పెరగటంతో టెంట్‌లలో ఉన్న వారందరూ కొట్టుకుపోయారని శంకర్ తెలిపారు. ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా సహకయ చర్యలను అధికారులు పర్యవేక్షిస్తున్నారని అన్నారు.
ఎపీ సర్కార్ ఆరా....
అమర్‌నాథ్ యాత్రలో కుండపోత వాన, ఆకస్మాత్తుగా వరదలు రావటంతో భక్తుల సమాచారంపై తీవ్ర స్దాయిలో ఆందోళన వ్యక్తం అవుతుంది. అమర్‌నాథ్ యాత్రలో కుండపోత వాన, ఆకస్మాత్తుగా వరదలు వచ్చాయన్న సమాచారం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన యాత్రికుల భద్రతకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలన్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎంఓ అధికారులు దిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్‌తో మాట్లాడారు. అడిషనల్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న హిమాంశు కౌసిక్‌ను వెంటనే శ్రీనగర్‌కు పంపించారు. యాత్రికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నెంబర్లు కూడా విడుదల చేసింది.
అమర్ నాథ్ యాత్ర హెల్ప్ లైన్ నంబర్లు:
NDRF - 011- 23438252,011- 23438253,
KASHMIR - 0194- 2496240,
SHRINE BOARD - 0194 -2313149,
PAHALGAM - 9596779039, 9797796217, 01936243233, 01936243018,
ANANTHNAG -9596777669, 9419051940, 01932225870, 01932222870
ఈ నెంబర్లకు తెలుగు వారు ఫోన్ లు చేసి తమ కుటుంబం సభ్యుల సమాచారం తెలుసుకోవచ్చిన ప్రభుత్వం వెల్లడించింది.