Vijayawada: బెజవాడలో బుల్లెట్ బండి మెకానిక్‌కు భలే క్రేజ్ - బైక్ ఆయన చేతికి ఇచ్చారంటే బేఫికర్, సక్సెస్ స్టోరీ
Vijayawada Bullet Bike Mechanic: వయసుతో సంబందం లేకుండా అందరికి బుల్లెట్ బైక్ క్రేజీ వెహికల్ గా మారిపోయింది. వెయ్యికి పైగా మెకానిక్‌లకు ట్రైనింగ్ ఇచ్చిన మెకానిక్ రామకృష్ణ సక్సెస్ స్టోరీ మీకోసం..
Vijayawada Bullet Bike Mechanic Special Story: బుల్లెట్ బైక్... ఈ పేరు చెబితే చాలు, నేటి యువతకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. రీసెంట్ గా బెల్లెట్ వాహనం వినియోగించే వారి సంఖ్య మరింత పెరిగింది. వయసుతో సంబందం లేకుండా అందరికి బుల్లెట్ క్రేజీ వెహికల్ గా మారిపోయింది. అయితే కొన్ని దశాబ్దాల నుంచి నేటి వరకు బుల్లెట్ ను మాత్రమే రిపేరింగ్ చేస్తూ దాని పైనే ఆధారపడి జీవించటంతో పాటుగా వెయ్యికి పైగా మెకానిక్ లకు శిక్షణ ఇచ్చిన బుల్లెట్ బైట్ మెకానిక్ సక్సెస్ స్టోరీని ఏబీపీ దేశం (ABP Desam Special Story) మీ ముందుకు తీసుకొచ్చింది.
పూరి గుడిసెలో రిపేర్..
విజయవాడకి సెంటర్ గా ఉండే ఎలూరు లాకులు వద్ద గల ఒక సాదారణ పూరి గడిసెలో మెకానిక్ రామకృష్ణ కేవలం బుల్లెట్ బండిని మాత్రమే రిపేర్ చేస్తారు. దాదాపు 5 దశాబ్దాల కిందటి నుండి నేటి వరకు ఆయన కేవలం బుల్లెట్ బైక్ లను మాత్రమే రిపేర్ చేస్తూ బుల్లెట్ బండికి ఆయన ఒక డాక్టర్‌గా పేరు గాంచారు. విజయవాడ సమీపంలోని కంకిపాడు నుండి రోజు వారీ కూలి పనులు చేసేందుకు వచ్చిన రామకృష్ణ, గవర్నర్ పేటలో ఉండే మెకానిక్ దుకాణాల్లో పని చేసేవారు వారు. అప్పట్లో హెల్పర్ మాత్రమే కావటంతో ఆయన చేసిన పనికి మూడు పూటలా భోజనం పెట్టేవారు. అలా ప్రారంభం అయిన ఆయ మెకానిక్ జీవితం కాలక్రమంలో కేవలం బుల్లెట్ లను మాత్రమే రిపేర్ చేసే స్దాయికి ఎదిగింది.
అప్పట్లో 4 బుల్లెట్ బైక్స్
విజయవాడ నగరంలో కేవలం 4 బుల్లెట్ వాహనాలు మాత్రమే ఉండే రోజుల్లోనే ఆయన వాటిని రిపేర్ చేసి ఇచ్చేవారు. ఇప్పుడు వేలాది వాహనాలు పెరిగిపోవటంతో ఆయన చేతిలోనే తమ వాహనాలను రిపేర్ చేయించుకోవాలనే స్దాయికి వెళ్లారు. ఇప్పటికి హైదరాబాద్ వంటి రాష్ట్రల నుండి కూడ బుల్లెట్ వాహనాల పై మక్కువ ఉన్న వారు విజయవాడకు వచ్చి మెకానిక్ రామకృష్ణ వద్దనే తమ బుల్లెట్ ను సర్వీసింగ్ చేయిస్తున్నారంటే, ఆయన క్రేజ్ ఎలాంటిదో అర్దం అవుతుంది. ఇంగ్లాండ్ లో పుట్టిన బుల్లెట్ బండికి వైద్యం (A to A Repairs) చేసే బెజవాడ డాక్టర్ గా రామకృష్ణ పేరు సంపాదించారు.
సర్వీస్ సెంటర్లున్నా బండి మాత్రం ఆయన వద్దకే
రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు దేశ వ్యాప్తంగా స్పెషల్ సర్వీసింగ్ స్టేషన్లు ఉన్నప్పటికి రామకృష్ణ (Vijayawada, Bullet Bike Mechanic) గురించి తెలుసుకున్న బుల్లెట్ లవర్స్, షోరూంలో తమ బుల్లెట్ రిపేరింగ్ కు ఇష్టపడరు. ఇందుకు కారణం కూడ ఉంది. షోరూంలో కాని ఇతర మెకానిక్ ల వద్ద కాని బైక్ లను రిపేరింగ్ చేయిస్తే, వాటి ప్రాబ్లం నెల రోజుల్లో మళ్లీ రిపీట్ అవుతుంది, అయితే రామకృష్ణ చేతిలో బండి రిపేర్ అయిన తరువాత మినిమం సంవత్సర కాలం వరకు వనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్దితి ఉండదన్నది కష్టమర్ల అభిప్రాయం. అంతే కాదు తాను నమ్ముకున్న వృత్తి పై ప్రేమతో శ్రద్దగా పని చేయటం వలనే తాను ఈ స్దాయికి వచ్చానని అంటారు రామకృష్ణ. ఆయనకు కాసు... అర కాసు అనే నిక్ నేమ్స్ కూడ ఉన్నాయి. బుల్లెట్ ను ఎంత బాగా రిపేర్ చేస్తారో, అంతే స్దాయిలో బిల్లు కూడా ఉంటుందన్నది మరి కొందరి అభిప్రాయం.
బుల్లెట్ వాహనాలు అంతగా క్రేజ్ లేని రోజుల్లోనే ఆయన ఒక్క బుల్లెట్ బండి రిపేర్ చేస్తే అరకాసు బంగారం, లేదా కాసు బంగారం, విలువ అయ్యేదని అంటారు. దీంతో ఆయన వద్ద బండి రిపేర్ చేసిన తరువాత, కాసా... అర కాసా అని కామెంట్ లు కూడ చేసే వారట. అయితే ఈ విషయాన్ని రామకృష్ణ సున్నితంగా తిరస్కరిస్తున్నారు, బుల్లెట్ వాహనం తన చేతిలో సర్వీస్ అయిన తరవాత, బంగారం తరహాలో మెరిసేదని, దీంతో అంతా బంగారంలా చేసేవ్ అని మెచ్చుకునే వారని చెబుతున్నారు. మెత్తం మీద కేవలం బుల్లెట్ వాహనాలు మాత్రమే రిపేర్ చేసే అరుదైన వ్యక్తిగా రామకృష్ణ బెజవాడలో స్దిరపడ్డారు.