అన్వేషించండి

Somu Veerraju: ఏపీలో చ‌వితి ఆంక్ష‌లపై బీజేపీ కన్నెర్ర! రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లకు పిలుపు

వైసీపీ ప్రభుత్వం పండగ వాతావరణాన్ని కలుషితం చేస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు  సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు.

ఏపీలో వినాయ‌క చ‌వితి పండుగల‌కు ప్ర‌భుత్వం అడ్డంకుల‌ను సృష్టిస్తోంద‌ని ఆరోపిస్తూ బీజేపీ నేత‌లు ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయాల‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు క్యాడ‌ర్ కు ఆదేశాలు ఇచ్చారు. విఘ్నాధిపతి వేడుకులకు విఘ్నాలా  ఇదేమి దుర్మార్ఘపు ప్రభుత్వం.. నిబంధనల పేరుతో  వినాయక చవితి వేడుకులకు పరోక్ష ఆటంకాలకు ప్రభుత్వం పాల్పడుతున్న  అనుమానాలు బలపడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆందోళనలు, నిరసనలు నిర్వహించాలని సోమువీర్రాజు బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోము వీర్రాజు రాష్ట్ర బీజేపీ పదాధికారులు జిల్లా పార్టీ అధ్యక్షులు జిల్లా పార్టీల ఇన్చార్జిల ఫోన్ కాన్ఫరెన్స్ లో రేపు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లోని తహసిల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించాలని నిరసన కార్యక్రమాలు జరపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమాలు, ఆందోళన తర్వాత తహసీల్దారులకు వినతి పత్రం సమర్పించాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు సూచించారు.

వినాయక చవితి ఉత్సవాలకు మంటపాలు, పందిళ్లు ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చింది.

హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో చేసుకునే వినాయక చవితి పండుగను నిబంధనల పేరుతో పల్లెల్లో పట్టణాల్లో నగరాల్లో వీధుల్లో వాడల్లో జరుపుకోవడానికి అనుమతులు తప్పనిసరి చేయడం ద్వారా వైసీపీ ప్రభుత్వం పండగ వాతావరణాన్ని కలుషితం చేస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు  సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు. ఆంక్షలు పెట్టడం ద్వారా వినాయక చవితి ఉత్సవాలను నిర్వాహకులను నిరుత్సాహపరచి, మంటపాల సంఖ్యను రాష్ట్ర వ్యాప్తంగా తగ్గించాలనే కుట్ర జరుపుతోందని సోము వీర్రాజు తీవ్రంగా దుయ్యపట్టారు. ఎన్నడూ లేని విధంగా వివిధ రకాల అనుమతులు పొందాలని కుట్రపూరితంగా రాష్ట్ర డీజీపీ ద్వారా ఆదేశాలు జారీ చేయించి క్షేత్రస్థాయిలో మండపాల నిర్వాహకులను ఉత్సవ సమితి సభ్యులను వివిధ రకాలుగా వేధిస్తూ ఈ ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి మేల్కొని వెంటనే తగు ఆదేశాలు జారీ చేయాలని, వినాయక చవితి పందిళ్లకు పోలీసు శాఖ నుండి మైక్ అనుమతి మినహా మరి ఏ ఇతర అనుమతులను తీసుకోవాలనే నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేశారు. వినాయక చవితి ఉత్సవాలను దరఖాస్తు చేసిన వెంటనే సింగిల్ విండో సిస్టంలో అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేస్తుందని సోము వీర్రాజు ప్రకటించారు. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్రస్థాయిలో ఉద్యమం చేస్తుందని  సోము వీర్రాజు హెచ్చరించారు.

చ‌వితి పందిళ్ళ‌ చుట్టూ రాజ‌కీయం
ఏపీలో చ‌వితి పందిళ్ళ రాజ‌కీయం మెద‌లైంది. ఇప్ప‌టి కే ఈ వ్య‌వ‌హ‌రంపై టీడీపీ నేత‌లు వైసీపీని టార్గెట్ చేసి నేరుగా విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. ప్ర‌తిప‌క్షాల నుండి వ‌చ్చే విమ‌ర్శ‌ల‌ను అధికార ప‌క్షం కూడా కౌంట‌ర్ ఇస్తూనే ఉంది. అయితే బీజేపి ఈ వ్య‌వ‌హ‌రంపై మ‌రింత దూకుడుగా వెళ్లాల‌ని నిర్ణ‌యించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌ల‌ను త‌ల‌పెట్టింది. అటు ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెంచ‌టంతో పాటుగా, రాజ‌కీయంగా ఈ వ్య‌వ‌హారాన్ని వాడుకోవ‌టం ద్వారా ప్ర‌జ‌ల్లోకి పార్టీని తీసుకువెళ్ళేందుకు వీలుంటుంద‌ని నాయ‌కులు భావిస్తున్నారు. అయితే బీజేపీకి హిందుత్వ ముద్ర కూడా ఉండ‌టంతో ప‌నిలో ప‌నిగా అదే కోణంలో ఈ వ్య‌వ‌హ‌రంపై క‌మ‌ల దళాన్ని వైసీపీ నేత‌లు కౌంట‌ర్ ఇస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget