By: Harish | Updated at : 20 Oct 2022 11:54 AM (IST)
నిందితుడిని మీడియా ముందుకు తీసుకొచ్చిన పోలీసులు
వదినతో సన్నిహితంగా ఉంటున్న మిత్రుడిని వారించినా ఉపయోగం లేకపోవటంతో కోడి కత్తితో హత్య చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలోని కంచికచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనలో వాస్తవాలు తెలుసుకున్న పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. హత్యను ఇంత సింపుల్‌గా చేసేయవచ్చా అని నిర్ఘాంతపోవాల్సి వచ్చింది.
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన నాగరాజు హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. హత్యకు ఆర్థిక లావాదేవీలు కాణంగా మెదట భావించిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. అయితే హతుడు నాగరాజు కుటుంబ సభ్యులు ఇచ్చిన ప్రాథమిక సమాచారంతోపాటుగా, సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా పోలీసులు అసలు విషయాలు వెలుగులోకి తెచ్చారు. ఆధారాలతో సహ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హత్యకు గురైన నాగరాజుకు జోజి అనే స్నేహితుడు ఉన్నాడు. జోజికి వదిన వరస అయ్యే మహిళతో నాగరాజుకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ఇద్దరి మధ్య సహజీవనానికి దారితీసింది. ఈ విషయం బయటకు రావటంతో జోజి, నాగరాజు మధ్య గొడవలు కూడా మొదలయ్యాయి. అయినా జోజి అక్రమ సంబంధం విషయంలో నాగారాజు చెప్పిన మాటలను లెక్కచేయలేదు. హెచ్చరించినా పట్టించుకోలేదు. దీంతో కోపం పెంచుకున్న నాగరాజు పక్కా పథకం ప్రకారం జోజిని హత్య చేశాడు.
నాగరాజుతో వదిన వరుస అయ్యే మహిళ తరచూ ఫోన్ మాట్లాడుతుండటాన్ని జోజి గుర్తించాడు. పరువు పోతుందని పలుమార్లు నాగరాజును హెచ్చరించినా ప్రయోజనం లేకపోవటంతో ఈ దారుణానికి ఒడికట్టాడని ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా సేకరించారమని పోలీసులు తెలిపారు.
నాగరాజును హత్య చేసేందుకు జోజీ పక్కా పథకం ప్రకారం వ్యవహరించాడు. కోళ్ల పందాలకు వెళ్లిన సమయంలో అక్కడ లభించిన కోడి కత్తితో హత్య చేసినట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి వెళ్లిపోయారని ప్రాథమికంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాగరాజుతో స్నేహంగా ఉండే జోజీపై పోలీసులకు అనుమానం రావటంతో విచారణ చేపట్టిన పోలీసులకు అసలు వాస్తవాలను బయటకు తీశారు. జోజి పై గతంలో అక్రమ మద్యం కేసులు ఉన్నాయని పోలీసులు నిర్దారించారు.
BJP On Jagan : దివాలా తీసిన కంపెనీ ఉద్యోగుల్లా ఏపీ ఉద్యోగుల పరిస్థితి - ప్రభుత్వ తీరుపై బీజేపీ విమర్శలు
ఉగాది నుంచి విశాఖలో సీఎం బస! ఈ బడ్జెట్ సమావేశాల్లోనే మళ్లీ మూడు రాజధానుల బిల్లు?
వైఎస్ఆర్సీపీ నేతలతో సీఎం జగన్ కీలక భేటీ- ఏం చెప్పబోతున్నారు?
AP News Developments Today: ఏపీ రాజధానిపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ, సర్వత్రా ఉత్కంఠ
Breaking News Live Telugu Updates: అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Dhanbad Fire Accident: జార్ఖండ్లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి