AP Politics: షర్మిలకు, సీనియర్ లీడర్లకు మధ్య పొసగడం లేదా? ఏపీ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది?
Andhra Pradesh Politics | ఏపీ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? షర్మిలకు సీనియర్ లీడర్లకు మధ్య పోసగడం లేదా? కొందరు నేతలు షర్మిలకు సహకరించడం లేదన్న వాదన తెరపైకి వచ్చింది.

YS Sharmila | ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు YS షర్మిల కూ పార్టీలోని కొందరు సీనియర్ లీడర్లకు మధ్య గ్యాప్ అలానే ఉండిపోయింది అన్న ప్రచారం గట్టిగా సాగుతోంది. సీనియర్ లీడర్లు హర్ష కుమార్ లాంటివాళ్ళు షర్మిలకు అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని మొదట్లోనే బాహాటంగా విమర్శించారు. పార్టీలో యాక్టివ్ గా ఉండే సుంకర పద్మశ్రీ లాంటివాళ్ళు మొదట్లో షర్మిలకు మద్దతు పలికినా.. ఏపీ ఎన్నికల సమయంలో ఆమెతో విభేధించి సమయం కుదిరినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మధ్య వైయస్ రాజశేఖర్ రెడ్డి చెల్లెలు, షర్మిలను వ్యతిరేకించే విమలా రెడ్డి స్వయంగా వెళ్లి హర్ష కుమార్ కుటుంబాన్ని కలిసి రావడం రాజకీయంగాను చర్చను రేపింది.
ఏపీ కాంగ్రెస్ కు ముఖచిత్రంగా మారిన షర్మిల
రాష్ట్ర విభజన తర్వాత ఉనికి కోల్పోయిన ఏపీ కాంగ్రెస్ను తిరిగి ఫామ్ లోకి తేవడానికి చాలా ప్రయత్నాలు చేసింది ఏఐసిసి. రఘు వీరా రెడ్డి, శైలజ నాథ్ లాటి వాళ్లు పీసీసీ ప్రెసిడెంట్ లుగా ఏపీ కాంగ్రెస్కు ఊపిర్లు ఊదడానికి ప్రయత్నించినా అది వర్కౌట్ కాలేదు. అలాంటి తరుణంలో షర్మిల కాంగ్రెస్ లో చేరడం ...వెంటనే ఆమెను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా హై కమాండ్ నియమించడం వంటి కార్యక్రమాలు వేగంగా జరగపోయాయి. ఆ తర్వాత కాంగ్రెస్కు తిరిగి కొంతమేర ఉనికి చేకూరింది.
ఆ తరుణంలో పార్టీలోని సీనియర్లు మాజీ మంత్రులు పల్లం రాజు, కను మూరి బాపిరాజు లాంటివారు ఆమెకు అండగా నిలబడ్డారు. కానీ పిసిసి ప్రెసిడెంట్ పదవి తమకే వస్తుందంటూ ఆశలు పెట్టుకున్న కొందరు మాత్రం ఆమెతో విభేదిస్తున్నారు. అలాగే 2024 ఎన్నికల సమయంలో సీట్ల కేటాయింపు వ్యవహారంలో కూడా పార్టీలో కొన్ని విభేదాలు రావడంతో సుంకర పద్మశ్రీ వంటి వారు అసంతృప్తికి లోనయ్యారు. అలాంటివారు అప్పటినుంచి సమయం దొరికినప్పుడల్లా ఇండైరెక్ట్ గా షర్మిల పై సెటైర్స్ వేస్తూ పార్టీ లో రెబల్స్ గా మారారు.
షర్మిలపై ఉన్న ప్రధాన ఆరోపణ ఇదే
రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్న షర్మిలపై ఏపీ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ ఆమె జగన్ తో తనకున్న వ్యక్తిగత ఇష్యూస్ మీద పెడుతున్న దృష్టి పార్టీ వ్యవహారాల మీద పెట్టడం లేదని. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు జరపడం, పార్టీ క్యాడర్ తో మమేకం కావడం, వారిలో ఆత్మశైర్యం పెంచడం వంటి కార్యక్రమాల మీద షర్మిల మరింత ఫోకస్ చేయాలనేది వారి డిమాండ్. అలాగే రాష్ట్రంలో శాశ్వత నివాసం కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికీ ఆమె హైదరాబాద్ నుంచే వ్యవహారాలను నడిపిస్తున్నారనే విమర్శ ఉంది. అయితే షర్మిల వర్గం వాదన మరోలా ఉంది. పార్టీ హైకమాండ్ పూర్తిగా షర్మిలపై భరోసా ఉంచింది అనీ షర్మిల కూడా దానికి తగ్గట్టుగానే పాటుపడుతున్నారనీ వారు చెప్తున్నారు.
రాత్రికి రాత్రి అద్భుతాలు ఆశించడం కూడా సరికాదని 2014 తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఏపీలో కాంగ్రెస్ కి ఉనికి వచ్చిందంటే అది షర్మిల చేరిన తర్వాతే అని షర్మిల వర్గం చెబుతోంది. ఏదేమైనా పార్టీని బలోపేతం చేయాలంటే కచ్చితంగా అందర్నీ కలుపుకు పోవాల్సిన బాధ్యత షర్మిలపై ఉంది అనేది విశ్లేషకుల మాట.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

