అన్వేషించండి

Kesineni Nani: కేశినేని నాని కీలక నిర్ణయం, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన

Kesineni Nani Exit From Politics: విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచి వైదొలిగారు. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సోదరుడు కేశినేని చిన్ని చేతిలో నాని ఓటమి చెందారు.

Kesineni Nani Announces Retirement From Politics| విజయవాడ: ఏపీ ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకున్నారు. రాజకీయాలకు రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ప్రకటించారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విజయవాడ స్థానం నుంచి పోటీ చేసిన కేశినేని నాని ఓడిపోయారు. టీడీపీ నుంచి బరిలోకి దిగిన సోదరుడు కేశినేని చిన్ని 2 లక్షల 82 వేల 85 ఓట్ల తేడాతో కేశినాని నానిపై ఘన విజయం సాధించారు. 

లోక్‌సభ ఎన్నికల్లో నాని ఓటమి 
టీడీపీ నుంచి రెండు పర్యాయాలు టీడీపీ పార్టీ నుంచి విజయవాడ ఎంపీగా కేశినాని నాని గెలుపొందారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు అప్పటి అధికార పార్టీ వైసీపీలో చేరారు. సిట్టింగ్ ఎంపీకి వైసీపీ విజయవాడ లోక్‌సభ టికెట్ ఇచ్చింది. కానీ రాష్ట్రవ్యాప్తంగా కూటమి హవా కొనసాగడంతో కేశినాని నాని ఎన్నికల్లో ఓటమి చెందారు.

సోషల్ మీడియాలో కేనినేని నాని పోస్ట్  
ఎంతగానో ఆలోచించిన తరువాత రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు కేశినేని నాని తెలిపారు. పదేళ్ల పాటు విజయవాడ ప్రజలకు సేవలు అందించేందుకు అవకాశం కల్పించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా రెండు పర్యాయాలు సేవ చేయడం అపుపూపమైన గౌరవంగా భావిస్తాను. ప్రజల మద్ధతు, వారి దృఢసంకల్పం ఎంతో స్ఫూర్తినిచ్చాయి. రాజకీయాలకు మాత్రమే దూరంగా ఉంటా. కానీ విజయవాడ ప్రజల పట్ల నిబద్ధతతో ఉంటాను. విజయవాడ అభివృద్ధికి నా మద్దతు కొనసాగుతోంది. పొలిటికల్ జర్నీలో సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నో జ్ఞాపకాలు, మరిచిపోలేని అనుభవాలు నాతో ఉన్నాయి. విజయవాడ అభివృద్ధి, శ్రేయస్సు కోసం కొత్తగా ఎన్నికైన నేతలు పాటుపడాలని, వారికి అభినందనలు’ అంటూ కేశినేని నాని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Chit Chat: సిరిసిల్లకు ఉపఎన్నిక వస్తుందా ?-అసెంబ్లీకి రాని కేసీఆర్‌ను పరిగణనలోకి తీసుకోం - రేవంత్ కీలక వ్యాఖ్యలు
సిరిసిల్లకు ఉపఎన్నిక వస్తుందా ? అసెంబ్లీకి రాని కేసీఆర్‌ను పరిగణనలోకి తీసుకోం - రేవంత్ కీలక వ్యాఖ్యలు
Tirupati Deputy Mayor Election: తిరుపతి డిప్యూటీ మేయర్‌గా టీడీపీ ఏకైక అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక, కూటమిలో జోష్
తిరుపతి డిప్యూటీ మేయర్‌గా టీడీపీ ఏకైక అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక, కూటమిలో జోష్
Naga Chaitanya Sobhita Dhulipala Wedding: చైతూ శోభితల పెళ్లి చూస్తారా? ఎన్ని కోట్లకు అమ్మారు? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
చైతూ శోభితల పెళ్లి చూస్తారా? ఎన్ని కోట్లకు అమ్మారు? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Telangana: కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు నోటీసులు, అలర్ట్ అయిన బీఆర్ఎస్ బాస్ కేసీఆర్
కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు నోటీసులు, అలర్ట్ అయిన బీఆర్ఎస్ బాస్ కేసీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TDP Won Hindupur Municipality | టీడీపీ కైవసమైన హిందూపూర్ మున్సిపాలిటీ | ABP DesamJC Prabhakar reddy vs Kethireddy peddareddy | తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం | ABP DesamTirupati Deputy Mayor Election | తిరుపతి పీఠం కోసం కూటమి, వైసీపీ బాహా బాహీ | ABP DesamPrabhas Look From Kannappa | కన్నప్ప సినిమా నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Chit Chat: సిరిసిల్లకు ఉపఎన్నిక వస్తుందా ?-అసెంబ్లీకి రాని కేసీఆర్‌ను పరిగణనలోకి తీసుకోం - రేవంత్ కీలక వ్యాఖ్యలు
సిరిసిల్లకు ఉపఎన్నిక వస్తుందా ? అసెంబ్లీకి రాని కేసీఆర్‌ను పరిగణనలోకి తీసుకోం - రేవంత్ కీలక వ్యాఖ్యలు
Tirupati Deputy Mayor Election: తిరుపతి డిప్యూటీ మేయర్‌గా టీడీపీ ఏకైక అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక, కూటమిలో జోష్
తిరుపతి డిప్యూటీ మేయర్‌గా టీడీపీ ఏకైక అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక, కూటమిలో జోష్
Naga Chaitanya Sobhita Dhulipala Wedding: చైతూ శోభితల పెళ్లి చూస్తారా? ఎన్ని కోట్లకు అమ్మారు? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
చైతూ శోభితల పెళ్లి చూస్తారా? ఎన్ని కోట్లకు అమ్మారు? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Telangana: కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు నోటీసులు, అలర్ట్ అయిన బీఆర్ఎస్ బాస్ కేసీఆర్
కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు నోటీసులు, అలర్ట్ అయిన బీఆర్ఎస్ బాస్ కేసీఆర్
8th Pay Commission Salaries: ప్యూన్‌ నుంచి పెద్ద ఆఫీసర్‌ వరకు - ఏ ఉద్యోగి జీతం ఎంత పెరుగుతుంది?
ప్యూన్‌ నుంచి పెద్ద ఆఫీసర్‌ వరకు - ఏ ఉద్యోగి జీతం ఎంత పెరుగుతుంది?
Game Changer OTT Release Date: 'గేమ్ చేంజర్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్... అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్, కానీ ఒక ట్విస్ట్
'గేమ్ చేంజర్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్... అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్, కానీ ఒక ట్విస్ట్
Roja comments: గెలిచి ఓడిన టీడీపీ.. ఓడినా గెలిచిన వైసీపీ - తిరుపతి డిప్యూటీ మేయర్ పై రోజా కీలక వ్యాఖ్యలు
గెలిచి ఓడిన టీడీపీ.. ఓడినా గెలిచిన వైసీపీ - తిరుపతి డిప్యూటీ మేయర్ పై రోజా కీలక వ్యాఖ్యలు
Tax-Free Income: PPFతో నెలకు రూ.39,000 పైగా రాబడి - ఈ డబ్బు మొత్తానికీ 'జీరో టాక్స్‌'
PPFతో నెలకు రూ.39,000 పైగా రాబడి - ఈ డబ్బు మొత్తానికీ 'జీరో టాక్స్‌'
Embed widget