By: ABP Desam | Updated at : 27 Jan 2022 02:26 PM (IST)
చంద్రబాబు (ఫైల్ ఫోటో)
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. గుడివాడలో నిర్వహించిన క్యాసినో అంశంపై విచారణ జరపాలని ఆయన లేఖలో కోరారు. క్యాసినో నిర్వహణకు కారణమైన మంత్రి కొడాలి నానిని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు. గుడివాడలో క్యాసినో, జూదం నిర్వహించడం వాస్తవమనని అన్నారు. గుడివాడ వెళ్లిన టీడీపీ నేతల కార్లను కూడా వైఎస్ఆర్ సీపీ నేతలు ధ్వంసం చేశారని అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకపోగా తిరిగి టీడీపీ నేతలపైనే కేసులు పెట్టారని చంద్రబాబు గవర్నర్ కు రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు.
సంక్రాంతి సందర్భంగా గుడివాడలో కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్‌లో క్యాసినో, జూదం నిర్వహించారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు లేవని అన్నారు. వాస్తవాలను కనుగొనేందుకు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ గుడివాడ వెళితే కార్లు ధ్వంసం చేశారని, తిరిగి తమ నేతలపైనే కేసులు పెట్టారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు, టీడీపీ నిజనిర్ధారణ కమిటీ గురువారం గవర్నర్ బిశ్వభూషణ్‌ను విజయవాడలో కలిసింది. ఈ మేరకు గుడివాడలో జూదం నిర్వహించారని గవర్నర్‌కు కమిటీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం క్యాసినోపై కరపత్రాలు, ఆధారాలను గవర్నర్‌కు సమర్పించారు. అదేవిధంగా గుడివాడ పర్యటనలో తమపై జరిగిన దాడులు, పోలీసుల వ్యవహారంపైనా ఫిర్యాదు చేశారు. కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలని కోరారు. గవర్నర్‌ను కలిసిన వారిలో వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బోండా ఉమా మహేశ్వరరావు తదితరులు ఉన్నారు.
Shocking and disgusting!
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) January 26, 2022
A massive Rs. 500 Crores was exchanged in a span of just 3 days of running the Casino in Gudivada. Andhra Pradesh is the New Gambling Hub of India.#ArrestGutkaMatkaNani#GutkaMatkaNani pic.twitter.com/ZgitbSvGiB
బూతుల మంత్రికి పెట్రోలు దొరకట్లేదా?#ArrestGutkaMatkaNani#GutkaMatkaNani pic.twitter.com/4oLKIyvUds
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) January 26, 2022
Breaking News Live Telugu Updates: ఆసియా గేమ్స్‌లో మహిళా క్రికెట్ జట్టుకు స్వర్ణం
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో రేపు నిర్ణయం
Top Headlines Today: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాజయ్య యూటర్న్- రికార్డుల వేటలో గిల్- మార్నింగ్ టాప్ టెన్ న్యూస్
Scholarships: సంతూర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2023-24, చివరితేది ఎప్పుడంటే?
Nara Brahmani: హోటల్ రూంకు తాళం- వాట్సాప్ చాటింగ్ సైతం చెకింగ్ - పోలీసుల చర్యతో బ్రాహ్మణి షాక్
దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న మరో మహమ్మారి, 5 కోట్ల మంది ప్రాణాలు బలి!
Telangana BJP: తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? నేతల రహస్య సమావేశాలు దేని కోసం ?
Asian Games 2023 Medal Tally: డబుల్ డిజిట్ దాటిన భారత్ పతకాల సంఖ్య - మెడల్స్ కొల్లగొడుతున్న రోయర్లు
Nara Bhuvaneswari: అన్నవరంలో భువనేశ్వరి ప్రత్యేక పూజలు- ప్రజల సొమ్ము తీసుకోవాల్సిన అవసరమేంటని ప్రశ్న
/body>