అన్వేషించండి

Chandrababu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ కేసు - ఏసీబీ కోర్టులో కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ

టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య నివేదిక అందజేయాలని ఆయన తరుపున నాగరాజు విజయవాడ ఏసిబి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే.

రాజమహేంద్రవరం జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య నివేదిక అందజేయాలని ఆయన తరుపున నాగరాజు విజయవాడ ఏసిబి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. చంద్రబాబు లాయర్ల పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు సిఐడి అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. 

మరోవైపు ఫైబర్ నెట్ కేసులో కూడా సిఐడి అధికారులు మెమో దాఖలు చేశారు. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు మెయిల్ పిటిషన్ పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. అప్పటివరకు చంద్రబాబును ఏసీబీ కోర్టులో హాజరు పరచవద్దని సుప్రీంకోర్టు సూచించింది. సుప్రీంకోర్టు సూచనలను సిఐడి అధికారులు మెమో రూపంలో ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్  పై వాదనలు ముగియగా.. తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. శుక్రవారం రోజు ఆర్గ్యుమెంట్స్ లిఖితపూర్వకంగా ఉంటే చెప్పవచ్చని అవకాశం కల్పించింది. తీర్పును రిజర్వు చేయడంతో ఎప్పుడు ప్రకటిస్తారనేది టీడీపీ శ్రేణులు, రాజకీయ వర్గంలో చర్చనీయంశంగా మారింది. తీర్పును రిజర్వ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై ఇలాంటి పరిమితులు లేవు. 

తీర్పు ప్రకటించడానికి ముందు రోజు మాత్రమే ఏ టైం కు తీర్పు ప్రకటిస్తారనేది సుప్రీంకోర్టు ధర్మసానం చెబుతోంది. ఇరు వర్గాల వాదనలు లోతుగా విశ్లేషించడానికి కొద్దిరోజులపాటు సమయం తీసుకుంటారు. దీంతో శుక్రవారం తీర్పు వస్తుందేమోనని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ఒకవేళ శుక్రవారం తీర్పు రాకపోతే వచ్చే సోమవారం తర్వాత తీర్పు వచ్చే అవకాశాలు ఉంటాయని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఈ సందర్భంగా మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. వాదనలు మిగిలిఉంటే.. రాతపూర్వకంగా ఇవ్వాలంటూ ధర్మాసనం సూచించింది. కాగా.. చంద్రబాబు తరుపున సీనియర్ న్యాయవాది హరీష్‌ సాల్వే, సీఐడీ తరుపున ముకుల్‌ రోహత్గీ సుధీర్ఘ వాదనలు వినిపించారు. చంద్రబాబుకు 17A వర్తించదని సీఐడీ తరపున వాదనలు వినిపించిన ముకుల్‌ రోహత్గీ అన్నారు. 

జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా త్రివేదితో కూడిన ధర్మాసనం ముందు వాదనలు సాగాయి. దాదాపు గంటన్నర సేపు ఆయన తుదివాదనలు వినిపించారు. వివిధ హైకోర్టులిచ్చిన తీర్పులను ఆయన ప్రస్తావించారు. అవినీతిపరులను కాపాడేందుకు 17A అన్నది రక్షణ కవచం కాదని రోహత్గీ వాదించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు వర్తించకపోయినా IPCలోని అనేక సెక్షన్ల కింద అభియోగాలున్నాయని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో రాజకీయ కక్ష సాధింపు అనేది లేదని, అనేక దర్యాప్తు సంస్థలు దీనిపై విచారణ జరుపుతున్నాయని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. 

17A సెక్షన్‌ తర్వాత అమల్లోకి వచ్చినా అది కచ్చితంగా ఈ కేసులో వర్తిస్తుందని బాబు తరపున సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే వాదనలు వినిపించారు. ఎన్నికల సమయంలో రాజకీయంగా ప్రత్యర్థులపై కక్ష సాధించేందుకు ఇలాంటివి ఉపయోగిస్తున్నారని అన్నారు. రెట్రాస్పెక్టివ్‌ ఎఫెక్ట్‌ గురించి అనేక సెక్షన్లు, తీర్పులను హరీష్‌ సాల్వే ప్రస్తావించారు. 

క్వాష్‌ పిటిషన్‌పై వాదనలు సుదీర్ఘంగా సాగడంతో ఫైబర్‌నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. అంత వరకు అరెస్టు చేయొద్దని గతంలో చేసిన సూచనలు కొనసాగుతాయని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sajjala Bhargava Reddy: సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
Sajjala Bhargava Reddy: సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
Hyderabad News: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు, శబ్ధానికి ఉలిక్కిపడ్డ స్థానికులు
Hyderabad News: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు, శబ్ధానికి ఉలిక్కిపడ్డ స్థానికులు
New Telugu Movies: టాలీవుడ్ లో మరో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు - తమిళ దర్శకులతో తెలుగు హీరోల జోడీ
టాలీవుడ్ లో మరో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు - తమిళ దర్శకులతో తెలుగు హీరోల జోడీ
Jagan vs Lokesh: నిక్కర్ మంత్రి నారా లోకేష్! కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్! టీడీపీ, వైసీపీ ట్వీట్స్ వార్
నిక్కర్ మంత్రి నారా లోకేష్! కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్! టీడీపీ, వైసీపీ ట్వీట్స్ వార్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sajjala Bhargava Reddy: సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
Sajjala Bhargava Reddy: సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
Hyderabad News: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు, శబ్ధానికి ఉలిక్కిపడ్డ స్థానికులు
Hyderabad News: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు, శబ్ధానికి ఉలిక్కిపడ్డ స్థానికులు
New Telugu Movies: టాలీవుడ్ లో మరో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు - తమిళ దర్శకులతో తెలుగు హీరోల జోడీ
టాలీవుడ్ లో మరో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు - తమిళ దర్శకులతో తెలుగు హీరోల జోడీ
Jagan vs Lokesh: నిక్కర్ మంత్రి నారా లోకేష్! కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్! టీడీపీ, వైసీపీ ట్వీట్స్ వార్
నిక్కర్ మంత్రి నారా లోకేష్! కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్! టీడీపీ, వైసీపీ ట్వీట్స్ వార్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Prabhas: ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ డీల్ - ఆ మూడు సినిమాలకు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత?
ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ డీల్ - ఆ మూడు సినిమాలకు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత?
Viral News: సరదాగా మొదలుపెట్టి 2,500 కోర్సులు పూర్తి చేసిన శ్రీకాకుళం వాసి, త్వరలో గిన్నిస్ రికార్డ్స్‌లోకి
సరదాగా మొదలుపెట్టి 2,500 కోర్సులు పూర్తి చేసిన శ్రీకాకుళం వాసి, త్వరలో గిన్నిస్ రికార్డ్స్‌లోకి
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Embed widget