అన్వేషించండి

Vidala Rajini: ట్రాన్స్‌ఫ‌ర్ల గురించి ఆలోచించొద్దు- ఎక్కడైనా పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి- ప్రభుత్వ వైద్యుకలు మంత్రి హితవు

ఎంబీబీఎస్ సీటు ఎక్కడ వ‌స్తే.. అక్కడికి వెళ్లిన వైద్యులు విధులు విష‌యంలో ఎందుకు ఒకే ప్రాంతాన్ని కోరుకుంటున్నారో అర్థం కావ‌డం లేద‌న్నారు మంత్రి విడదల రజినీ. వైద్యుడు ఎక్కడైనా ప‌నిచేసేలా ఉండాల‌న్నారు.

ప్రభుత్వంలో ఇప్పుడు ప‌నిచేస్తున్న వైద్యులంతా ఎంతో అదృష్టవంతుల‌ని, ఒక గొప్ప ప్రభుత్వంలో వైద్య సిబ్బంది ప‌నిచేస్తున్నార‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని అభిప్రాయపడ్డారు. గుంటూరు క‌లెక్టరేట్‌లోని శంక‌రన్ హాలులో శ‌నివారం ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన వైద్య విభాగంపై స‌మీక్ష స‌మావేశం నిర్వహించారామె. దాదాపు నాలుగు గంట‌ల‌పాటు స‌మావేశం కొన‌సాగింది. 

సమీక్షలో మంత్రి విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ వైద్య రంగంలో గుంటూరు జిల్లాకు ప్రత్యేక‌మైన స్థానం ఉందన్నారు. గుంటూరు మెడిక‌ల్ క‌ళాశాల‌లో చ‌దువుకున్న ఎంతో మంది ప్రపంచ ప్రఖ్యాత వైద్యులుగా సేవ‌లు అందిస్తున్నార‌ని చెప్పారు. వైద్య రంగంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఇదే జిల్లా నుంచి తాను వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యత‌లు చేప‌ట్టడం అదృష్టంగా భావిస్తున్నాన‌ని చెప్పారు. 

వైద్యారోగ్యశాఖ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ ఏటా రూ.13 వేల కోట్లు ఖ‌ర్చుచేస్తున్నార‌ని రజినీ తెలిపారు. నాడు-నేడు కింద ఆస్పత్రుల నిర్మాణం కోస‌మే ఏకంగా త‌మ ప్రభుత్వం రూ. 16వేల కోట్లు ఖ‌ర్చు చేస్తోంద‌ని చెప్పారు. ఈ స్థాయిలో వైద్య ఆరోగ్యశాఖ‌కు నిధులు కేటాయించిన ప్రభుత్వాలు గ‌తంలో ఎప్పుడూ, ఎక్కడా చూడలేదన్నారు. 

సుదీర్ఘ కాలం త‌ర్వాత ప‌దోన్నతులు

దాదాపు 12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప‌దోన్నతుల ఫైళ్లకు బూజు దులిపిన ఘ‌త‌న జ‌గ‌న‌న్నకే ద‌క్కుతుంద‌ని తెలిపారు రజినీ. ఏ ప్రభుత్వ వైద్య సంస్థ కూడా ఇన్‌చార్జిల పాల‌న‌లో ఉండ‌కూడ‌ద‌ని నేరుగా అన్ని అర్హత‌లు ఉన్నవారినే సూప‌రింటెండెంట్‌లుగా, వైద్య క‌ళాశాల‌ల ప్రిన్సిప‌ల్స్‌గా నియ‌మిస్తున్నామ‌ని చెప్పారు. ఎక్కడా నిబంధ‌న‌లు స‌డ‌ల‌కుండా ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంద‌న్నారు. గుంటూరు జీజీహెచ్ సూప‌రింటెండెంట్‌గాని, గుంటూరు ప్రభుత్వ వైద్యశాల ప్రిన్సిప‌ల్‌గాని దాదాపు 12 ఏళ్ల త‌ర్వాత ఇన్‌చార్జీలు కాకుండా అన్ని స్థాయి అర్హత‌లు ఉన్నవారే పూర్తిస్థాయి బాధ్యత‌లు స్వీక‌రించారని గుర్తు చేశారు. అంటే  త‌మ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో అర్థం చేసుకోవ‌చ్చని వివ‌రించారు. ప్రభుత్వంఎన్ని కోట్ల నిధులు ఇస్తున్నా.. క్షేత్రస్థాయిలో సిబ్బంది బాగా ప‌ని చేస్తేనే ఆ ఫ‌లాలు ప్రజ‌ల‌కు స‌మ‌ర్థవంతంగా చేర‌తాయ‌ని చెప్పారు రజినీ. 

సూప‌రింటెండెంట్, ప్రిన్సిప‌ల్ మధ్య స‌మ‌న్వయం

గుంటూరు జీజీహెచ్ సూప‌రింటెండెంట్, ప్రిన్సిప‌ల్ స‌మ‌న్వయంతో ప‌నిచేయాల‌ని చెప్పారు మంత్రి రజినీ. అప్పుడే వైద్యులంతా బాగా ప‌నిచేస్తార‌ని తెలిపారు. గుంటూరు జీజీహెచ్‌లో అతి త్వర‌లో ఎంసీహెచ్ బ్లాక్ భ‌వ‌న నిర్మాణం మొద‌లు కాబోతోంద‌న్నారు. ముఖ్యమంత్రి దృష్టికి ఈ విష‌యం తాను తీసుకెళ్లాన‌ని ఆయ‌న సానుకూలంగా స్పందించార‌ని, జింఖానా ప్రతినిధుల స‌హాయ స‌హ‌కారాల‌తో ఈ భ‌వ‌న నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తామ‌ని చెప్పారు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు స‌క్రమంగా ప‌ని చేయాల్సిందేన‌ని ఆదేశించారు. ఎన్‌ఎచ్‌ఎం నిధులు అందుబాటులో ఉంటున్నా వాటిని వినియోగించుకోవ‌డం లేద‌నే వార్తలు పీహెచ్‌సీల‌పై వ‌స్తున్నాయ‌ని చెప్పారు. గ‌డువులోగా హెచ్‌డీసీ నిధుల‌ను స‌మ‌ర్థవంతంగా వాడుకోవాల‌ని చెప్పారు. ఆస్పత్రుల్లో మంచినీటి అందుబాటులో ఉంచాల‌ని చెప్పారు. ఫ్యాన్లు తిరిగేలా చూడాల‌న్నారు. కాన్పులు పీహెచ్‌సీల్లోనూ జ‌రిగేలా చొర‌వ చూపాల‌ని ఆదేశించారు. ప్రతి పీహెచ్‌సీలో నెల‌కు క‌నీసం ప‌ది కాన్పులు జ‌రిగేలా చూడాల‌ని చెప్పారు.  

ట్రాన్స్‌ఫ‌ర్ల గురించి ఆలోచించొద్దు

ఇక్కడ ఉన్నవారంతా వైద్యులేన‌ని, అంతా ఎంబీబీఎస్ చ‌దువుకున్నవాళ్లేన‌ని మంత్రి తెలిపారు. ఎంబీబీఎస్ సీటు ఎక్కడ వ‌స్తే.. అక్కడికి వెళ్లి చ‌దువుకున్న వారంతా.. విధులు విష‌యంలో ఎందుకు ఒకే ప్రాంతాన్ని కోరుకుంటున్నారో అర్థం కావ‌డం లేద‌న్నారు. వైద్యుడు ఎక్కడైనా ప‌నిచేసేలా ఉండాల‌ని, ఇది స‌హ‌జ నియ‌మ‌ని చెప్పారు. కోవిడ్ స‌మ‌యంలో వైద్యులు ఎంతో బాగా ప‌నిచేశార‌ని, గుంటూరు జీజీహెచ్ ల‌క్షల మంది ప్రాణాల‌ను కాపాడిందని చెప్పారు. అదే స్ఫూర్తితో వైద్యులు ఎప్పటికీ ప‌ని చేయాల‌ని తెలిపారు.

కావాల్సిన‌వ‌న్నీ ఇచ్చాం
వైఎస్ జ‌గ‌న్ ముఖ్యమంత్రి కాక‌ముందు వైద్య ఆరోగ్యశాఖ‌లో ఎన్నో పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని మంత్రి విడ‌ద‌ల రజిని తెలిపారు. ప్రభుత్వం వ‌చ్చాక ప్రతి పీహెచ్‌సీకి ఇద్దరు డాక్టర్లను నియ‌మించామ‌న్నారు. న‌ర్సులు, వార్డ్ బాయ్‌లు, నైట్ వాచ్ మెన్ లు కూడా ఇలా అన్ని పోస్టులు భ‌ర్తీ చేస్తూ వ‌చ్చామ‌ని తెలిపారు. 70 ఏళ్ల వైద్యశాఖ చ‌రిత్రలో ఇంతగా నియామ‌కాల‌ను ఎప్పుడూ, ఎవ‌రూ చేప‌ట్టలేద‌ని గుర్తుచేశారు. ఇంత ఇస్తున్న ఈ ప్రభుత్వం కోసం ఇంకెంత‌గా మ‌నం ప‌నిచేయాలో ఒక‌సారి ఆలోచించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
CM Jagan: కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతారు, నేనడిగితే తప్పా - పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతారు, నేనడిగితే తప్పా - పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
Nidhhi Agerwal: 'రాజా సాబ్' సెట్స్‌లో అడుగుపెట్టిన ఇస్మార్ట్ బ్యూటీ - షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?
'రాజా సాబ్' సెట్స్‌లో అడుగుపెట్టిన ఇస్మార్ట్ బ్యూటీ - షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

ABP C Voter Opinion Poll Telangana | లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటే పార్టీ ఏది? | ABP DesamABP C Voter Opinion Poll Andhra pradesh | లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో సత్తా చాటే పార్టీ ఏది? | ABPNirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
CM Jagan: కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతారు, నేనడిగితే తప్పా - పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతారు, నేనడిగితే తప్పా - పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
Nidhhi Agerwal: 'రాజా సాబ్' సెట్స్‌లో అడుగుపెట్టిన ఇస్మార్ట్ బ్యూటీ - షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?
'రాజా సాబ్' సెట్స్‌లో అడుగుపెట్టిన ఇస్మార్ట్ బ్యూటీ - షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Devara Movie: 'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
KCR Comments: ఈ ప్రభుత్వం ఏడాది కూడా ఉండదు, అందుకే వీరు లిల్లిపుట్‌లు - కేసీఆర్ కామెంట్స్
ఈ ప్రభుత్వం ఏడాది కూడా ఉండదు, అందుకే వీరు లిల్లిపుట్‌లు - కేసీఆర్ కామెంట్స్
YS Avinash Reddy : సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు  - అవినాష్ రెడ్డి కౌంటర్
సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు - అవినాష్ రెడ్డి కౌంటర్
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Embed widget