AP Governor Abdul Nazeer: ఏపీ నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ కు సీఎం జగన్ ఘనస్వాగతం
గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లిన సీఎం జగన్ కొత్త గవర్నర్ దంపతులకు పుప్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. సీఎం జగన్ వెంట మరికొందరు నేతలు, అధికారులు ఉన్నారు.
AP CM YS Jagan grand welcomes to new Governor Justice Abdul Nazeer: ఏపీ నూతన గవర్నర్ గా నియమితులైన జస్టిస్ అబ్దుల్ నజీర్ బుధవారం రాత్రి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లిన సీఎం జగన్ కొత్త గవర్నర్ దంపతులకు పుప్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. సీఎం జగన్ వెంట మరికొందరు నేతలు, అధికారులు ఉన్నారు. ఫిబ్రవరి 24న ఏపీ నూతన గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. నూతన గవర్నర్ ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏపీ నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 24న ఆయన రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. జస్టిస్ అబ్దుల్ నజీర్ రేపు ఏపీకి రానున్నారు. బుధవారం సాయంత్రం సతీసమేతంగా ఆయన దిల్లీ నుంచి బయలుదేరి అమరావతికి రానున్నారు. ఈ నెల 24న రాష్ట్ర మూడో గవర్నర్‌గా జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు చేపట్టనున్నారు. కర్ణాటకకు చెందిన అబ్దుల్ నజీర్ సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేసి రిటైర్ అయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయకుండానే సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన మూడో న్యాయమూర్తిగా జస్టిస్ నజీర్ గుర్తింపు పొందారు. ఈ ఏడాది జనవరిలోనే ఆయన పదవీ విరమణ చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నజీర్ ట్రిపుల్ తలాక్, అయోధ్య-బాబ్రీ మసీదు వివాదం, నోట్ల రద్దు, గోప్యత హక్కు వంటి కేసుల్లో కీలక తీర్పులు ఇచ్చిన ధర్మాసనంలో ఉన్నారు. 2017లో వివాదాస్పద ట్రిపుల్ తలాక్ కేసును విచారించిన ధర్మాసనంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఏకైక మైనారిటీ న్యాయమూర్తిగా ఉన్నారు.
నూతన గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ కు గన్నవరం ఎయిర్ పోర్టులో స్వాగతంపలికిన సీఎం శ్రీ వైయస్.జగన్. స్వాగతం పలికిన వారిలో మంత్రి జోగిరమేష్, మండలి ఛైర్మన్ మోషేన్ రాజు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, గవర్నర్ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్, సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి pic.twitter.com/DA5sxgp78H
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) February 22, 2023
బిశ్వభూషణ్ ఛత్తీస్ గఢ్ కు బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ (Justice Abdul Nazeer) నియమితులు అయ్యారు. గతంలో ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా పని చేశారు. ఆయోధ్య తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల ధర్మాసనంలో ఆయన కూడా ఒకరు. ఏపీతో పాటు మొత్తం 12 మంది కొత్త గవర్నర్ల నియామకం జరిగింది. వీరికి రాష్ట్రపతి ఇటీవల ఆమోదం తెలిపారు. ఏపీ గవర్నర్‌గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్‌ను (Biswa Bhushan Harichandan) ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమించారు. మహారాష్ట్ర గవర్నర్‌గా (Maharastra Governor) రమేశ్ బైస్ నియమితులు అయ్యారు. ఇప్పటివరకు ఈయన ఝార్ఖండ్ గవర్నర్ గా ఉన్నారు. మహారాష్ట్రకు ప్రస్తుత గవర్నర్ గా ఉన్న భగత్ సింగ్ కోశ్యారీ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.