అన్వేషించండి

Vijayawada Book Festival: పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్, డిసెంబర్ 28 నుంచి విజయవాడ బుక్ ఫెస్టివల్

Vijayawada Book Festival: విజయవాడ పుస్తక మహోత్సవం కొంచెం ముందుగానే ప్రారంభం కానుంది. ఈ ఏడాది డిసెంబరు 28 నుంచి జనవరి 7 వరకు నిర్వహించనున్నట్లు వీబీఎఫ్‌సీ అధ్యక్షుడు మనోహర్‌నాయుడు వెల్లడించారు.

Book Festival In Vijayawada: విజయవాడ పుస్తక మహోత్సవం (Vijayawada Book Festival) కొంచెం ముందుగానే ప్రారంభం కానుంది. ఏటా జనవరి ఒకటో తేదీ నుంచి మొదలయ్యే విజయవాడ పుస్తక మహోత్సవాన్ని ఈ ఏడాది డిసెంబరు 28 నుంచి జనవరి 7 వరకు నిర్వహించనున్నట్లు విజయవాడ పుస్తక మహోత్సవ కమిటీ అధ్యక్షుడు (Vijayawada Book Festival Committee President) టి.మనోహర్‌నాయుడు (Manohar Naidu) వెల్లడించారు. మంగళవారం విజయవాడలో సీసీఎల్‌ఏ అదనపు కమిషనర్‌, ఏపీ మైనారిటీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ డైరెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ (AMd Imtiaz)లతో కలిసి ఉత్సవాల బ్రోచర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మనోహర్‌నాయుడు మాట్లాడుతూ..  ఏటా జనవరి 1 నుంచి 11 వరకు జరిగే పుస్తక మహోత్సవాన్ని ఈ ఏడాది డిసెంబరు 28 నుంచే ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో ఈ ఉత్సవం జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖ ప్రచురణకర్తలు, పుస్తక పంపిణీదారులు పాల్గొంటారని చెప్పారు. పుస్తకావిష్కరణలు, సాహిత్య కార్యక్రమాలు, పుస్తకప్రియుల పాదయాత్ర ఉంటాయన్నారు. మేధావులు, కవులు, కళాకారులు, రాజకీయ నాయకులు పాల్గొంటారని వివరించారు. 

జాతీయ పుస్తక వారోత్సవాలు ప్రారంభం
విజయవాడలో పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది. నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు జాతీయ పుస్తక వారోత్సవాలు జరుగుతున్నాయి.  ఈ వారోత్సవాలను ఆంధ్రప్రదేశ్ సమగ్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ముఖ్య కార్యనిర్వహణధికారి ఏఎండీ ఇంతియాజ్ ప్రారంభించారు. అనంతరం వివిధ విభాగాలలో అమర్చిన పుస్తకాలను సందర్శించారు. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికి నచ్చే, మెచ్చే గ్రంథాలు, వందలాది కొత్త పుస్తకాలు పుస్తక ప్రియుల కోసం అందుబాటులోకి వచ్చాయి. 

ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ.. నెహ్రూ పుట్టినరోజున దేశమంతటా బాలల దినోత్సవం జరుగుతందని, విజయవాడలో పుస్తక వారోత్సవాలు జరగడం అభినందనీయమన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటి నిర్వాహకులు పుస్తక ప్రదర్శనను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పుస్తక పఠనం మంచి అలవాటని, పుస్తకాలు చదవటం ద్యారా విజ్ఞానం పెంచుకోవచ్చన్నారు. అన్ని రకాల పుస్తకాలు తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయని, పాఠకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

భారత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు పుస్తక ప్రదర్శనను ప్రారంభించామని సొసైటీ అధ్యక్షులు మనోహర్ నాయుడు తెలియజేశారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటి రీసెర్చి లైబ్రరీ ఆవరణలో ఈ జాతీయ పుస్తక వారోత్సవాలు జరుగుతున్నాయని, సాహితీ వేత్తలు, పుస్తక ప్రియులు, కళాకారులు, రచయితలు, మేథావులు, విద్యార్థులు పుస్తక వారోత్సవాల్లో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల జాతర - ఐదేళ్లలో రూ.65వేల కోట్లతో బయోగ్యాస్ ప్లాంట్ల పెట్టనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ !
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల జాతర - ఐదేళ్లలో రూ.65వేల కోట్లతో బయోగ్యాస్ ప్లాంట్ల పెట్టనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ !
KTRs Delhi Tour: బీఆర్ఎస్ కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేసిందా? కేటీఆర్ ఢిల్లీ యాత్ర అందుకేనా!
బీఆర్ఎస్ కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేసిందా? కేటీఆర్ ఢిల్లీ యాత్ర అందుకేనా!
NBK 109 Title Teaser: బాలయ్య - బాబీ సినిమా టైటిల్, టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్... నందమూరి ఫ్యాన్స్‌కు ఒకేసారి డబుల్ సర్‌ప్రైజ్
బాలయ్య - బాబీ సినిమా టైటిల్, టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్... నందమూరి ఫ్యాన్స్‌కు ఒకేసారి డబుల్ సర్‌ప్రైజ్
Jio Vs Airtel: ఒక్క రూపాయి తేడాతో 28 జీబీ డేటా, 22 ఓటీటీ యాప్స్ - ఈ జియో, ఎయిర్‌టెల్  ప్లాన్లలో ఏది బెస్ట్?
ఒక్క రూపాయి తేడాతో 28 జీబీ డేటా, 22 ఓటీటీ యాప్స్ - ఈ జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లలో ఏది బెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Elon Musk Vs Ambani | Starlink closer to India | ట్రంప్ ఎన్నికతో ఇండియాకు స్పీడ్‌గా స్టార్ లింక్!Shankar Maniratnam Game Changer Thug Life | మణిరత్నం శంకర్‌కి ఇది చాలా టఫ్ ఫేజ్ | ABP DesamBorugadda Anil Met Family members CCTV | బోరుగడ్డ అనిల్ రాచమర్యాదలు..మరో వీడియో వెలుగులోకి | ABP DesamHezbollah Strikes On Israel | నార్త్ ఇజ్రాయేల్‌పై హెజ్బుల్లా దాడులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల జాతర - ఐదేళ్లలో రూ.65వేల కోట్లతో బయోగ్యాస్ ప్లాంట్ల పెట్టనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ !
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల జాతర - ఐదేళ్లలో రూ.65వేల కోట్లతో బయోగ్యాస్ ప్లాంట్ల పెట్టనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ !
KTRs Delhi Tour: బీఆర్ఎస్ కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేసిందా? కేటీఆర్ ఢిల్లీ యాత్ర అందుకేనా!
బీఆర్ఎస్ కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేసిందా? కేటీఆర్ ఢిల్లీ యాత్ర అందుకేనా!
NBK 109 Title Teaser: బాలయ్య - బాబీ సినిమా టైటిల్, టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్... నందమూరి ఫ్యాన్స్‌కు ఒకేసారి డబుల్ సర్‌ప్రైజ్
బాలయ్య - బాబీ సినిమా టైటిల్, టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్... నందమూరి ఫ్యాన్స్‌కు ఒకేసారి డబుల్ సర్‌ప్రైజ్
Jio Vs Airtel: ఒక్క రూపాయి తేడాతో 28 జీబీ డేటా, 22 ఓటీటీ యాప్స్ - ఈ జియో, ఎయిర్‌టెల్  ప్లాన్లలో ఏది బెస్ట్?
ఒక్క రూపాయి తేడాతో 28 జీబీ డేటా, 22 ఓటీటీ యాప్స్ - ఈ జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లలో ఏది బెస్ట్?
Kannappa Release: డిసెంబర్‌లో రావట్లేదు... 2025లోనే కన్నప్ప - తిరుమలలో కీలక ప్రకటన చేసిన విష్ణు మంచు
డిసెంబర్‌లో రావట్లేదు... 2025లోనే కన్నప్ప - తిరుమలలో కీలక ప్రకటన చేసిన విష్ణు మంచు
Janwada Farm House Case: జన్వాడ ఫాం హౌస్ కేసులో కీలక పరిణామం, విజయ్ మద్దూరికి లుకౌట్ నోటీసులు జారీ
జన్వాడ ఫాం హౌస్ కేసులో కీలక పరిణామం, విజయ్ మద్దూరికి లుకౌట్ నోటీసులు జారీ
Chandrababu Class To MLAs: బూతులు మాట్లాడారో! మీ కెరీర్ ఖతం : ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్
బూతులు మాట్లాడారో! మీ కెరీర్ ఖతం : ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్
Telangana News: త్వరలో రేవంత్, పొంగులేటి పదవులు పోతాయి- ఢిల్లీలో కేటీఆర్ సంచలన కామెంట్స్
త్వరలో రేవంత్, పొంగులేటి పదవులు పోతాయి- ఢిల్లీలో కేటీఆర్ సంచలన కామెంట్స్
Embed widget