News
News
X

Abdul Nazeer AP Governor: ఏపీ గవర్నర్‌గా ప్రమాణం చేసిన జస్టిస్‌ అబ్దుల్ నజీర్

Abdul Nazeer AP Governor: బిశ్వభూషణ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులైన జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఇవాళ ప్రమాణం చేశారు. కార్యక్రమానికి సీఎం సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

FOLLOW US: 
Share:

Abdul Nazeer AP Governor: ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జస్టిస్ట్ అబ్దుల్‌ నజీర్ ప్రమాణం చేశారు. జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ తోపాటు మంత్రులు, న్యాయమూర్తులు హాజరయ్యారు. అనంతరం రాజ్‌భవన్‌లో తేనేటి విందు ఇచ్చారు. 

ఏపీకి కొత్త గవర్నర్ గా నియమితులైన జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ (Justice Abdul Nazeer) 1958 జనవరి 5న కర్ణాటకలోని బెలువాయిలో జన్మించారు. మంగళూరులో న్యాయవిద్య అభ్యసించారు. 1983లో కర్ణాటక హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్‌ మొదలు పెట్టారు. తర్వాత 2003లో కర్ణాటక హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమితులు అయ్యారు. 2017 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు జడ్జిగా ఆయనకు ప్రమోషన్ వచ్చింది.

ఇప్పటి వరకు గవర్నర్‌గా పని చేసిన బిశ్వభూషణ స్థానంలో జస్టిస్ అబ్దుల్‌ నజీర్‌ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్ వచ్చిన వేళ గతంలో ఉన్న బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ప్రభుత్వం ఈ మధ్యే ఘనంగా వీడ్కోలు పలికింది. విజయవాడలోని బందరు రోడ్డులోగల ఎ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గవర్నర్ కు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. గవర్నర్‌ వ్యవస్థకు బిశ్వభూషణ్ నిండుతనం తెచ్చారని కొనియాడారు. రాజ్యాంగ వ్యవస్థలో సమన్వయాన్ని ఆచరణలో చూపారని అన్నారు. గవర్నర్‌తో తనకున్న తీపి జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేనని సీఎం అన్నారు.

ఒక తండ్రిలా, రాష్ట్రానికి పెద్దలాగా ప్రజల అభివృద్ధికి అండగా నిలిచారని ప్రశంసించారు. గవర్నర్‌ విద్యావేత్త, న్యాయ నిపుణులు, స్వాతంత్ర్య సమరయోధులని గుర్తు చేశారు. అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, ఒడిశా బార్‌ అసోసియేషన్‌లో కీలకపాత్ర పోషించారని ప్రస్తావించారు. గవర్నర్‌ వందేళ్లూ ఆయురారోగ్యాలతో ప్రజలకు మరింత సేవ చేయాలని సీఎం జగన్ కోరుకున్నారు. బిశ్వభూషణ్ హరిచందన్‌కు ప్రజలు, ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలిపారు.

గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్ మాట్లాడుతూ.. సీఎం జగన్‌ తనపట్ల చూపిన గౌరవం, ఆప్యాయత మర్చిపోలేనని గవర్నర్‌ మాట్లాడారు. ఏపీ ప్రజలు అందరికీ సీఎం జగన్‌ సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని అన్నారు. గవర్నర్‌, సీఎం సంబంధాలు ఎంతో ముఖ్యమైనవని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తన రెండో ఇల్లు లాంటిదని అన్నారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మర్చిపోబోనని అన్నారు.

తాను గవర్నర్ గా ఏపీకి వచ్చిన కొత్తలో ఇన్ని సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారని జగన్ ను ప్రశ్నించానని, దేవుడి దయతో అన్నీ పూర్తవుతాయని సీఎం జగన్‌ చెప్పారని గుర్తు చేసుకున్నారు. రైతు భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని అన్నారు. వ్యవసాయ రంగంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీ ముందుందని కొనియాడారు. ప్రజలు అందించిన ప్రేమ, అభిమానం, సహకారం ఎంతో అద్భుతమైనదని.. కరోనా కాలంలో ఏపీలోని వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు ప్రాణాలకు తెగించి సేవలు అందించారని గుర్తు చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నా రెండో ఇల్లు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఏపీ ప్రజలను మరవను’’ అని గవర్నర్‌ మాట్లాడారు.

Published at : 24 Feb 2023 10:21 AM (IST) Tags: Biswa Bhushan CM Jagan Justice Abdul Nazeer AP Governor Justice Abdul Nazeer Andhra Pradesh Governor

సంబంధిత కథనాలు

మందడం ఘటనపై మండిపడుతున్న బీజేపి - దాడుల్ని ఖండించిన చంద్రబాబు, పవన్

మందడం ఘటనపై మండిపడుతున్న బీజేపి - దాడుల్ని ఖండించిన చంద్రబాబు, పవన్

AP Inter Evaluation: ఏప్రిల్ 1 నుంచి ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం! జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

AP Inter Evaluation: ఏప్రిల్ 1 నుంచి ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం! జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

‘‘ఓట్‌ ఫ్రం హోం’’ కాన్సెప్ట్‌పై లక్ష్మీనారాయణ ప్రశంస- ఆ పని కూడా చేయాలంటూ ఈసీకి సూచన

‘‘ఓట్‌ ఫ్రం హోం’’ కాన్సెప్ట్‌పై లక్ష్మీనారాయణ ప్రశంస- ఆ పని కూడా చేయాలంటూ ఈసీకి సూచన

Guntur Crime News: మరో పెళ్లి సిద్ధపడ్డ ప్రియుడి గొంతు కోసి హత్య చేసిన ప్రియురాలు

Guntur Crime News: మరో పెళ్లి సిద్ధపడ్డ ప్రియుడి గొంతు కోసి హత్య చేసిన ప్రియురాలు

Pawan Kalyan: పొత్తులపై క్లారిటీ ఉంది- దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కేడర్‌కు పవన్ సూచన

Pawan Kalyan: పొత్తులపై క్లారిటీ ఉంది- దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కేడర్‌కు పవన్ సూచన

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్