చైనా, పాకిస్థాన్ నుంచి నడిపిస్తున్న వ్యాపారం- లోన్ యాప్ కేసుల్లో కొత్త కోణం
ఈ కేసుల్లో ఆశ్చర్యకరమయిన విషయాలను దర్యాప్తులో వెలుగులోకీ తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. దేశం కాని దేశం నుంచి ఆన్ లైన్ లోన్ యాప్ లను నిర్వహిస్తున్నారని వెల్లడి కావటం కలకలం రేపుతుంది.
ఆన్ లైన్ లోన్ యాప్ ల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రోజూ ఈ యాప్ వలయంలో చిక్కుకొని ఆత్మహత్య చేసుకుంటున్న న్యూస్ వింటూనే ఉన్నాం. అందుకే దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా ఎంక్వయిరీ చేస్తోంది.
ఈ కేసుల్లో ఆశ్చర్యకరమయిన విషయాలను దర్యాప్తులో వెలుగులోకీ తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. దేశం కాని దేశం నుంచి ఆన్ లైన్ లోన్ యాప్ లను నిర్వహిస్తున్నారని వెల్లడి కావటం కలకలం రేపుతుంది. ఇండియాలో వేదింపులకు చైనా, పాకిస్థాన్ నుంచి లింక్‌లు వెలుగులోకి రావటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
ఆన్లైన్ యాప్‌ల ద్వారా వేధింపులకు గురి చేస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు కృష్ణాజిల్లా పోలీస్‌లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ జాషువా తెలిపారు. లోన్ యాప్‌ల ద్వారా వేధింపులకు పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. లోన్ మంజూరు అయిన తరువాత ఆ లోన్‌పై ఎక్కువ మొత్తం వసూళ్లు చేయడం ఈ ఐదుగురి పని అని ఎస్పీ తెలిపారు. ఈ ఐదుగురిని పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. వీరు ఉపయోగించే సిమ్ సిగ్నల్స్, సర్వర్లు చైనా, పాకిస్థాన్‌లోని రావల్పిండి నుంచి చూపిస్తున్నాయని అన్నారు. కమీషన్లు ఇస్తామంటూ అమాయకుల పేరుపై కరెంట్ అకౌంట్‌లు ఓపెన్ చేసి నగదు లావాదేవీలు కొనసాగిస్తున్నారని వెల్లడించారు.
వీరిలో వీరికి ఎవరెవరో తెలియదు, వీరు ఒకేసారి కొందరు కమీషన్లు పంచడం, కొందరు సిమ్ కార్డులు 50 నుంచి 70 వరకు కొనడం, కరెంట్ అకౌంట్‌లు ఓపెన్ చేయడం చేస్తూ ఉంటారని, ఈ కేసులో 23.33 లక్షలు బ్యాంక్ ఖాతాలో నగదును జప్తు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
ఇతర దేశాల లింక్‌లు ఎలా....
ఇతర దేశాలల నుంచి ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయా.. లేక సాంకేతికతను ఉపయోగించి ఆయా దేశాల నుంచి కార్యకలాపాలు జరుగుతున్నట్లు క్రియేట్ చేశారా అనేది ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. కృష్ణాజిల్లా పోలీసులు వెల్లడించిన వివరాలు ప్రకారం చైనా, పాకిస్టాన్, రావల్పిండి నుంచి కార్యకలాపాలు సాగించారని నిర్దారించారు. అయితే అక్కడ నుంచి ఎవరు ఈ నెట్ వర్క్ నిర్వహించారనేది ఇప్పుడు కలకలం రేపింది. భారత్‌లో ఉన్న వారికి వారి అవసరాలు గుర్తించి వారికి లోన్ యాప్ ద్వారా వల వేసి డబ్బులు ఇప్పించటం,ఆ డబ్బును ఇక్కడ ఉన్న రికవరి ఎజెంట్ల ద్వార వసూలు చేసి,వారి ఖాతాలోకి తిరిగి జమ చేయటం అంటే ఆషామాషీ వ్యవహరం కాదు.
ఈ మెత్తం వ్యవహరం ఎవరు నడిపిస్తున్నారనేది మాత్రం ఇప్పటికి తెలియటం లేదు. రికవరి ఎజెంట్లకు జీతాలు ఇవ్వటం, వారి మెయింటెన్స్ కు ఖర్చులు, ఇలాంటి వాటిని ఆదారంగా చేసుకొని పోలీసులు దర్యాప్తు చేసినప్పటికి అవతల ఉన్న వ్యక్తి బ్యాంక్ అకౌంట్ లో గుర్తు తెలియని వ్యక్తులు ఉండటం, వారు కూడ పూర్తిగా అమాయకులు కావటంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. కొందరు అమాయకుల పేరుతో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి బ్యాంక్ లో కార్యకలాపాలు నిర్వహించటం అంతా పూర్తి సాంకేతికతను ఆధారంగా చేసుకొని జరుగుతుందని పోలీసుల భావిస్తున్నారు. ఈ కేసులో పూర్తి వివరాలను సేకరించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.