అన్వేషించండి

Vijayawada Teppotsavam : కృష్ణానదిలో దుర్గా మ‌ల్లేశ్వర‌స్వామి న‌దీ విహారానికి బ్రేక్, వరుసగా మూడో ఏడాది!

Vijayawada Teppotsavam : ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా కృష్ణా నదిలో నిర్వహించే తెప్పోత్సవానికి బ్రేక్ పండింది. ఎగువ నుండి భారీగా వరద రావడంతో నదీ విహారాన్ని నిర్వహించడంలేదని అధికారులు తెలిపారు.

Vijayawada Teppotsavam  : ఇంద్రకీలాద్రి దుర్గా మ‌ల్లేశ్వర‌స్వామి న‌దీ విహారానికి ఈ ఏడాది కూడా బ్రేక్ ప‌డింది. శ్రీ‌శైలం, నాగార్జున‌సాగ‌ర్‌ల నుంచి వ‌ర‌ద‌నీటి ప్రవాహం ప్రకాశం బ్యారేజీకి అధికంగా చేరుకోవ‌డంతో తెప్పోత్సవం నిర్వహించ‌లేక‌పోతున్నామ‌ని ఎన్టీఆర్ జిల్లా క‌లెక్టర్ ఢిల్లీరావు, రివ‌ర్ క‌న్జర్వేట‌ర్ కృష్ణారావు వెల్లడించారు. న‌ది ఒడ్డున గంగా స‌మేత దుర్గా మ‌ల్లేశ్వర‌ స్వామి వార్లకు అర్చక బృందం ప్రత్యేక పూజ‌లు నిర్వహిస్తార‌ని కలెక్టర్ పేర్కొన్నారు. దుర్గామ‌ల్లేశ్వర‌స్వామి తెప్పోత్సవ నిర్వహ‌ణ‌పై సందిగ్ధత వీడింది. శ్రీశైలం, సాగర్, పులిచింతల నిండుకుండ‌ల్లా మారాయ‌ని ప్రకాశం బ్యారేజీ వ‌ద్ద లక్ష క్యూసెక్కుల నీటిని 70 గేట్లు ఎత్తి కింద‌కు వ‌దులుతున్నామ‌ని కలెక్టర్ చెప్పారు. తెప్పోత్సవం నిర్వహ‌ణ‌కు అనుకూల పరిస్థితులు లేవన్నారు. వ‌రుస‌గా మూడో ఏడాది కూడా తెప్పోత్సవం నిర్వహించ‌లేక‌పోతున్నామ‌న్నారు. 10 వేల క్యూసెక్కుల నీటి నిల్వ ఉంటేనే నిర్వహ‌ణ‌కు అనుకూలంగా ఉంటుంద‌ని ప్రస్తుతం ల‌క్ష క్యూసెక్కుల ప్రవాహం ఉండ‌డంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు. న‌ది ఒడ్డున ఉత్సవ‌మూర్తుల‌కు ప్రత్యేక పూజ‌లు నిర్వహిస్తార‌ని కలెక్టర్ చెప్పారు.

నదీ విహారానికి బ్రేక్ 

ఇంద్రకీలాద్రిపై దసర శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది నదీ విహారానికి బ్రేక్ పడింది. నది ఒడ్డునే హంస వాహనం ఉంచి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పులిచింతల నుంచి లక్ష క్యూసెక్కుల వరద నీరు రావడంతోనే నదీ విహారం సాధ్యపడదని జల వనరుల శాఖ కలెక్టర్‌కు నివేదిక పంపింది. దీనిపై కలెక్టర్ ఢిల్లీరావు, ఇరిగేషన్ అధికారి కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. 

దసరా రోజు రావణదహన వేడుకలు ఎందుకు చేస్తారు, దశకంఠుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు!

దుర్గాఘాట్ లో హంస వాహనం సేవ

కృష్ణానదిలో వరద ప్రవాహం కొనసాగుతుండడంతో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల నదీ విహారం నిర్వహించడం సాధ్యంకాదని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు.   పులిచింతల నుంచి లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతోందన్నారు. మూడు రోజులుగా కృష్ణానదిలో ప్రవాహం కొనసాగుతున్నందున దుర్గామల్లేశ్వరస్వామి వార్ల నదీ విహారం నిర్వహించలేకపోతున్నామని చెప్పారు. దుర్గాఘాట్‌లో హంస వాహనంపై స్వామి వార్ల ఉత్సవ మూర్తులను ఉంచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. పూజా కార్యక్రమాలు తిలకించేందుకు భక్తుల కోసం ప్రకాశం బ్యారేజీ, పున్నమిఘాట్, ఫ్లై ఓవర్, దుర్గాఘాట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు వేలమంది వస్తారని, కాబట్టి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఢిల్లీరావు వెల్లడించారు. 

Also Read : God Father No Politics : గాడ్‌ఫాదర్ డైలాగులతో భుజాలు తడుముకుంటే నేనేం చేయలేను - ఏపీ నేతలకు ముందుగానే చిరంజీవి క్లారిటీ !

Also Read : Chandrababu In Unstoppable Show:- బాలయ్య అన్‌స్టాపబుల్‌- 2కు ఫస్ట్ గెస్ట్‌గా చంద్రబాబు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget