Vijayawada Monkeypox : విజయవాడలో మంకీ పాక్స్ కలకలం, చిన్నారిలో వ్యాధి లక్షణాలు!
Vijayawada Monkeypox : ఏపీలో మంకీ పాక్స్ కలకలం రేగుతోంది. దుబాయి నుంచి విజయవాడ వచ్చిన ఓ కుటుంబంలో చిన్నారికి మంకీ పాక్స్ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
Vijayawada Monkeypox : ఏపీలో మంకీ పాక్స్ కలకలం రేగింది. ఇటీవల దుబాయి నుంచి విజయవాడ ఓ కుటుంబంలోని చిన్నారి శరీరంపై దద్దుర్లు రావడంతో మంకీ పాక్స్ కేసుగా వైద్యులు అనుమానిస్తున్నారు. చిన్నారికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. విజయవాడలోని పాత ప్రభుత్వాస్పత్రిలో చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. అయితే అప్రమత్తమైన అధికారులు కుటుంబం మొత్తాన్ని ఐసోలేషన్‌లో ఉంచారు. చిన్నారి నమూనాలు సేకరించి పుణె లోని ల్యాబ్‌కు పంపించారు. అయితే ఈ సమాచారాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.
పరీక్షల్లో నెగిటివ్
వైద్య పరీక్షల్లో చిన్నారికి మంకీ పాక్స్ లేదని తెలింది. పుణె ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్టులో మంకీ పాక్స్ నెగిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. చిన్నారిలో ఉన్న లక్షణాల మంకీ పాక్స్ కు చెందినవి కావని నిర్థారించారు.
కేరళలో తొలి కేసు
కేరళలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. విదేశాల నుంచి ఓ వ్యక్తిలో మంకీ పాక్స్ లక్షణాలు కనిపించడంతో నమూనాలను పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. సదరు వ్యక్తిని కేరళలోని ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినట్లుగా కేరళ ఆరోగ్య మంత్రి ప్రకటించారు.
కేంద్రం అలెర్ట్
ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ ముప్పు రోజురోజుకూ పెరుగుతోంది. కేరళలో తొలి కేసు నమోదవడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇటీవల రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రెటరీలు, ప్రిన్సిపల్ సెక్రెటరీలు, ఆరోగ్యశాఖ కార్యదర్శులకు లేఖ రాశారు. మంకీ పాక్స్ విషయంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను అనుసరిస్తూ అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చే వారిని తప్పనిసరిగా పరీక్షించాలని కోరారు. ఆరోగ్య అధికారులందరికీ క్రమం తప్పకుండా ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
జంతువుల నుంచి మనుషులకు
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మంకీపాక్స్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. వైరస్ సోకితే మశూచి రోగుల్లో కనిపించే లక్షణాలే బాధితుల్లోనూ కనిపిస్తున్నాయి. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసుల సంఖ్య 77 శాతం పెరిగినట్లు ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 6 వేల మందికి మంకీపాక్స్ సోకింది. అదే సమయంలో ఆఫ్రికాలో పలు ప్రాంతాల్లో వైరస్ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ కేసులు ఎక్కువగా ఐరోపా, ఆఫ్రికాలోనే నమోదవుతున్నాయి.
Also Read : Monkeypox Guidelines: అటెన్షన్ ట్రావెలర్స్, మంకీపాక్స్ కట్టడికి ఈ జాగ్రత్తలు పాటించండి-కేంద్రం గైడ్‌లైన్స్
Also Read : Monkeypox Cases: మంకీపాక్స్ వైరస్‌పై WHO హెచ్చరిక- 27 దేశాల్లో 780 కేసులు