అన్వేషించండి

Vijayasai Reddy: లిక్కర్ స్కామ్‌లో సిట్ విచారణకు విజయసాయిరెడ్డి డుమ్మా - కుదిరినప్పుడు వస్తానని సమాచారం

Andhra Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో విజయసారెడ్డి సిట్ విచారణకు హాజరు కాలేదు. ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నాయని సమాచారం పంపారు.

Vijayasa Reddy did not attend the SIT hearing in the liquor scam: ఆంధ్రా లిక్కర్ స్కాంలో విచారణకు సీఐడీ ఇచ్చిన నోటీసులను  విజయసాయిరెడ్డి లైట్ తీసుకున్నారు. ముందస్తుగా నిర్ణయించిన కార్యక్మరాలు ఉన్నాయని తాను రాలేనని ఆయన సిట్ అధికారులకు సమాచారం పంపారు. తనకు కుదిరనప్పుడు వస్తానని.. వచ్చే ముందు సమాచారం ఇస్తానన్నారు. తాను రాలేనన్న సమాచారాన్ని విజయసాయిరెడ్డి శుక్రవారమే సిట్ అధికారులకు ఇచ్చారు. కానీ సిట్ అధికారులు అంగీకరించలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రావాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే విజయసాయిరెడ్డి మాత్రం రాలేదు. దాంతో సిట్ అధికారులు ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. 

విజయసాయిరెడ్డిని SIT మొదట సాక్షిగా 2025 ఏప్రిల్ 18న విచారణకు పిలిచింది. అప్పుడు ఆయన సిట్ ముందు హాజరయ్యారు.   అయితే తర్వాత ఆయనను A-5 గా  చేర్చింది. అప్పటి విచారణలో   మద్యం విధానంపై చర్చించిన సమావేశాలు,  ముడుపులు , నాన్-డ్యూటీ పేడ్ లిక్కర్ (NDPL) విక్రయాలు,   కొత్త డిస్టిలరీ కంపెనీల గురించి ఆయనను ప్రశ్నించారు.  ఈ కుంభకోణంలో 2019-2024 మధ్య రూ. 3,200 కోట్ల నుండి రూ. 4,000 కోట్ల వరకు అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరు YSRCP నాయకులు డిస్టిలరీ కంపెనీలతో కుమ్మక్కై, కొత్త మద్యం బ్రాండ్లను ప్రోత్సహించి, ముడుపుల  రూపంలో భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. 

 కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ కేసులో ఏ వన్ గా ఉన్నారు.  ప్రతి మద్యం తయారీ కంపెనీ నుండి రూ. 50-60 కోట్ల ముడుపులు సేకరించినట్లు ఒప్పుకున్నాడని, ఈ నిధులను విజయసాయిరెడ్డితో సహా పలువురు కీలక వ్యక్తులకు హవాలా మార్గాల ద్వారా పంపిణీ చేసినట్లు SIT  చెబుతోంది.   విజయసాయిరెడ్డి హైదరాబాద్ మరియు తాడేపల్లిలోని తన నివాసాల్లో మద్యం విధానంపై జరిగిన మొదటి రెండు సమావేశాలకు హాజరైనట్లు విజయసాయిరెడ్డి ఒప్పుకున్నారు. అలాగే, రూ. 100 కోట్ల రుణం ఏర్పాటు చేయడంలో సహాయం చేసినట్లు కూడా ఆయన అంగీకరించారు                                                 
 
విజయసాయిరెడ్డి తాను ఈ కుంభకోణంలో ఒక విజిల్‌బ్లోయర్ గా వ్యవహరిస్తున్నానని, తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని అంటున్నారు.  కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఈ కుంభకోణం   ప్రధాన సూత్రధారిగా చెబుతున్నారు.  కసిరెడ్డిని పార్టీలో ప్రోత్సహించినప్పటికీ, అతని నేరస్థ మనస్తత్వం గురించి తనకు తెలియదని, కసిరెడ్డి తనను మోసం చేశాడని ఆయన చెప్పారు.  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా ఈ కేసులో PMLA కింద సమాంతర దర్యాప్తు చేస్తోంది.

విజయసాయిరెడ్డి 2025 జనవరిలో YSRCP నుండి రాజీనామా చేసి, రాజ్యసభ సభ్యత్వం నుండి కూడా వైదొలిగారు. ఆయన తన రాజకీయ రిటైర్మెంట్‌ను ప్రకటించారు. తాజాగా ఆయన కర్మసిద్ధాంతం గురించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో..ఆయన రాజకీయ పునరాగమనంపై చర్చ జరుగుతోంది. 

 

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Amaravati Seed Access Road inauguration:
"గ్రాఫిక్స్ అన్న వాళ్లే తలదించుకునేలా అమరావతి" సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవంలో చంద్రబాబు కామెంట్స్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget