Pemmasani warning to Jagan: ఒక్క మాటతో చంపేయగలం - జగన్‌కు కేంద్రమంత్రి పెమ్మసాని వార్నింగ్
TDP MP Pemmasani: చంద్రబాబుపై బాడీషేమింగ్ వ్యాఖ్యలు చేసిన జగన్‌పై కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శలు గుప్పించారు. మాకు సంస్కారం ఉంది మాట్లాడటం లేదని.. మాట్లాడాలనుకుంటే ఒక్క మాటతో చంపేయగలమన్నారు.

Union Minister Pemmasani criticizes Jagan : వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై చేసిన వ్యక్తిగత విమర్శలకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అత్యంత ఘాటుగా స్పందించారు. గుంటూరులో బ్రహ్మానందరెడ్డి స్టేడియం అభివృద్ధి పనులను ప్రారంభించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజమే కానీ, ఒకరి శారీరక ఆకృతిని బాడీషేమింగ్ చేయడం హీనమని మండిపడ్డారు. చంద్రబాబు వయస్సును, శరీరాకృతిని ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని పెమ్మసాని విమర్శించారు.
ఈ సందర్భంగా పెమ్మసాని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయి. చంద్రబాబును ఉద్దేశించి జగన్ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే సహించేది లేదు.. ఆయన్ని ఒక్క మాటతో చంపేయగలం, కానీ మాకు సంస్కారం ఉంది అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. మా విలువలు, పెరిగిన పద్ధతి మమ్మల్ని అడ్డుకుంటున్నాయన్నారు. వ్యక్తిగత దూషణలకు దిగడం జగన్ నైజమని విమర్శించిన పెమ్మసాని.. దమ్ముంటే రాజకీయంగా తమను ఎదుర్కోవాలని సవాలు విసిరారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజం. కానీ హద్దులు దాటి మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తమ నాయకుడు చంద్రబాబు నేర్పిన క్రమశిక్షణ వల్ల తాము సంయమనం పాటిస్తున్నామని స్పష్టం చేశారు.
గుంటూరు : జగన్‌పై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్..!
— Yash (@YashTDP_) March 26, 2026
జగన్ తీరుపై మండిపడ్డ పెమ్మసాని చంద్రశేఖర్.. సంస్కారం ఉందనే ఆగుతున్నామని, హద్దు దాటొద్దని జగన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్..!
చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదు..
బాడీ షేమింగ్ గురించి… pic.twitter.com/OLe1QL1TlK
జగన్ హయాంలో అభివృద్ధిని విస్మరించి కేవలం ప్రతిపక్ష నాయకులను వ్యక్తిగతంగా దూషించడమే పనిగా పెట్టుకున్నారని పెమ్మసాని విమర్శించారు. చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నాయకుడిని అవమానించడం అంటే రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు. గుంటూరు అభివృద్ధి కోసం తాము అహర్నిశలు శ్రమిస్తుంటే, జగన్ మాత్రం కేవలం బురదజల్లే రాజకీయాలకు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు.
చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలో పయనిస్తోందని, ఇటువంటి సమయంలో అనవసర విమర్శలు మానుకోవాలని జగన్‌కు సూచించారు. తాము అధికారంలో ఉన్నామని విర్రవీగడం లేదని, ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని పెమ్మసాని స్పష్టం చేశారు. బాడీ షేమింగ్ వంటి దిగజారుడు రాజకీయాలు చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















