By: ABP Desam | Updated at : 26 Dec 2022 03:16 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
యనమల కృష్ణుడు, యనమల రామకృష్ణుడు
Tuni TDP : కాకినాడ జిల్లా తుని సీటు విషయంలో యనమల సోదరుల మధ్య విభేదాలు తలెత్తినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. తుని టీడీపీ సీటు తన కూతురుకి ఇస్తున్నారని సంకేతాలు ఇచ్చిన యనమల రామకృష్ణుడుపై ఆయన తమ్ముడు కృష్ణుడు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. తుని టీడీపీ ఇన్చార్జ్ యనమల కృష్ణుడు, తొండంగి టీడీపీ నేత మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణ వైరల్ అవుతోంది.
ఫోన్ కాల్ లో వ్యాఖ్యలు
"యాదవ సామాజికవర్గంలో 30 వేల ఓట్లు ఉన్నాయి, నేను లేకపోతే వాళ్లను ఎవరూ పట్టించుకోరు. యనమల రామకృష్ణుడు కూతురు దివ్య ఇంట్లో ఉంటుంది. ఈసారి సీటు యనమల కృష్ణుడికి ఇవ్వక్కర్లేదు కానీ నా కూతురికి ఇవ్వనని రామకృష్ణుడిని చెప్పమనండి. ఈసారి వైసీపీ రాజా నెగ్గేస్తున్నాడని అందరూ అంటున్నారు. కృష్ణుడు కష్టపడితే కూతురుకు సీటు ఇస్తారా అని అడగండి. ఊరికి 40 మంది కలిసి వెళ్లి యనమల రామకృష్ణుడిని ప్రశ్నించండి. కృష్ణుడు లేకపోతే తునిలో టీడీపీ ఉండదని యనమల రామకృష్ణుడుకి గట్టిగా చెప్పండి." అని యనమల కృష్ణుడు మాట్లాడినట్లు ఆడియో వైరల్ అవుతోంంది.
ఇద్దరి మధ్య ఫోను సంభాషణ
యనమల కృష్ణుడు మాట్లాడినట్లు ఉన్న ఫోన్ కాల్ సంభాషణ వైరల్ అవుతోంది. దీంతో పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. టీడీపీ కార్యకర్తలు కొందరు తప్పుడు ప్రచారంగా కొట్టిపారేస్తున్నారు. ఈ విషయంపై యనమల కృష్ణుడు ఏంచెబుతారో చూడాల్సి ఉంది.
Tirumala Update: ఆదివారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి జరిగే పూజలు ఇవే!
Trouble In YSRCP : వైఎస్ఆర్సీపీలో ఇంత అలజడి ఎందుకు ? పార్టీ నేతల్ని నిర్లక్ష్యం చేయడం వల్లనే సమస్యలా ?
Weather Latest Update: నేడు ఈ 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్! చాలా జిల్లాల్లో వణికించనున్న చలి
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
Breaking News Telugu Live Updates: ఎమ్మెల్యే కోటంరెడ్డికి భద్రత తగ్గించిన ఏపీ సర్కార్
CM KCR Nanded Tour: నేడే నాందేడ్‌లో BRS సభ, సీఎం కేసీఆర్ టూర్ పూర్తి షెడ్యూల్ ఇదీ
Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన