అన్వేషించండి

TTD: తిరుమలలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు - టీటీడీ కీలక నిర్ణయం

Tirumala News: రివర్స్ టెండరింగ్ విధానాన్ని టీటీడీ రద్దు చేసింది. ఈ మేరకు ఈవో శ్యామలరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే ప్రభుత్వం ఈ విధానం రద్దు చేయగా.. టీటీడీలోనూ రద్దు చేశారు.

TTD Cancelled Reverse Tendering Process: టీటీడీలో (TTD) రివర్స్ టెండరింగ్ విధానాన్ని (Reverse Tendering Process) రద్దు చేశారు. ఈ మేరకు ఈవో శ్యామలరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ ప్రాసెస్‌ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీటీడీలోనూ అదే విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. కాగా, ఏదైనా ప్రాజెక్టుకు ఖరారైన కాంట్రాక్టుకు మళ్లీ టెండర్లు పిలవడాన్ని రివర్స్ టెండరింగ్ అంటారు. తొలిసారి పిలిచిన టెండర్లలో ఏవైనా అవకతవకలు జరగడం లేదా ఆ పనిని మరింత చౌకగా చేయడానికి అవకాశం ఉందని తేలితే రివర్స్ టెండరింగ్‌కు పిలిచే అవకాశం ఉంటుంది. అయితే, జాతీయ స్థాయిలో NTPC, కోల్ ఇండియా, సోలార్ పవర్ కార్పొరేషన్ అమలు చేస్తోన్న ఈ విధానాన్ని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి రాష్ట్రంలో తీసుకొచ్చింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసింది.

సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

అటు, తిరుమలలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. అత్యాధునిక వకుళామాత సెంట్రలైజ్డ్‌ వంటశాలను ఆయన శనివారం ప్రారంభించారు. తిరుమల ఆలయంలో పవిత్రత కాపాడేలా అంతా పని చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని చెప్పారు. భక్తుల ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదని.. ఏ విషయంలోనూ రాజీ పడొద్దని సూచించారు. 'సింపుల్‌గా, ఆధ్యాత్మిక ఉట్టిపడే పరిసరాలు ఉండాలి తప్ప ఆర్భాటం, అనవసర వ్యయం వద్దు. భవిష్యత్ అవసరాలకు నీటి లభ్యత ఉండేలా చూడాలి. అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతంపైగా పెంచాలి. అటవీ సంరక్షణతో పాటు అడవుల విస్తరణ కోసం వచ్చే 5 ఏళ్లకు ప్రణాళికు రూపొందించాలి.' అని సూచించారు.

అటు, టీటీడీ సేవలపై భక్తుల నుంచి స్పందన తీసుకునే విధానంపై సీఎం చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు. వచ్చిన ప్రతి భక్తుడు తమ అనుభవాలపై అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలన్నారు. భక్తుల సూచనలు, సలహాల ఆధారంగా సేవలపై టీటీడీ పనిచేయాలని అప్‌డేట్ చేస్తూ ఉండాలని సూచించారు. ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని దేవాలయాల్లో భక్తుల అభిప్రాయాలు తీసుకునే విధానం తీసుకురావాలని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డిని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, టీటీడీ ఈవో శ్యామల రావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సహా ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Also Read: East Godavari: తూర్పుగోదావరి జిల్లా నుంచి హైదరాబాద్‌కు స్పెషల్ సర్వీస్‌లు- ప్రత్యేక బస్‌లు వేసిన ఏపీఎస్ఆర్టీసీ

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Elections: ఏపీలో మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లలో పరోక్ష ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
ఏపీలో మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లలో పరోక్ష ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Sandeep Reddy Vanga On Raptadu Case: రాప్తాడు ఘటనపై సందీప్ రెడ్డి వంగా రియాక్షన్... సినిమాలను టార్గెట్ చేయవద్దు
రాప్తాడు ఘటనపై సందీప్ రెడ్డి వంగా రియాక్షన్... సినిమాలను టార్గెట్ చేయవద్దు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP ZPTC MPTC Elections: నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Medical College Ragging: కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
Embed widget