Srikakulam News: అరసవిల్లిలో రథసప్తమి వేడుకలు - భక్తులకు అలర్ట్, శ్రీకాకుళం నగరంలో ట్రాఫిక్ మళ్లింపు ఇలా!
Rathasapthami: అరసవల్లి సూర్య నారాయణ స్వామి వారి రథసప్తమిని రాష్ట్ర పండుగగా నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు నగరంలో ట్రాఫిక్ మళ్లింపు ఉండనుంది.

Traffic Diversions In Srikakulam Due To Rathasapthami: ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో పోలీసులు శ్రీకాకుళం నగరంలో పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అరసవల్లిలోని స్వామి వారిని దర్శించుకొనేందుకు సింహ ద్వారం నుంచి వచ్చే భక్తులు డే అండ్ నైట్ నుంచి 7 రోడ్ల కూడలి, ఓబీఎస్ జంక్షన్ మీదుగా 80 అడుగుల రోడ్డులో ఉన్న ఎల్ఎన్ ఫంక్షన్ హాల్ వద్ద పార్కింగ్ చేసుకోవాలన్నారు. కొత్తరోడ్డు, బలగ జంక్షన్ మీదుగా వచ్చే భక్తులు ఆర్టీసీ కాంప్లెక్స్, అంబేడ్కర్ జంక్షన్, డే అండ్ నైట్ నుంచి ఏడు రోడ్ల కూడలి, ఓబీఎస్ జంక్షన్ మీదుగా 80 అడుగుల రోడ్డులో ఉన్న ఎల్‌అండ్ ఫంక్షన్ హాల్ వద్ద పార్కింగ్ చేసుకోవాలన్నారు. పెద్దపాడు వైపు నుంచి వచ్చే భక్తులు రామలక్ష్మణ మీదుగా సూర్యమహల్ జంక్షన్, చిన్న బరాటం వీధి, ఓబీఎస్ జంక్షన్ మీదుగా 80 అడుగుల రోడ్డులో ఉన్న ఎల్ఎన్ ఫంక్షన్ హాల్ వద్ద పార్కింగ్ చేసుకోవాలన్నారు.
నవ భారత్ జంక్షన్ మీదుగా వచ్చే వారు గుజరాతిపేట జంక్షన్, 7 రోడ్ల కూడలి, ఓబీఎస్ జంక్షన్ మీదుగా 80 అడుగుల రోడ్డులో ఉన్న ఎల్ఎన్ ఫంక్షన్ హాల్ వద్ద పార్కింగ్ చేసుకోవాలన్నారు. గార, శ్రీకూర్మం మీదుగా వచ్చే భక్తులు వాడాడ జంక్షన్ వద్ద పార్కింగ్ చేసుకోవాలన్నారు. టెక్కలి, నరసన్నపేట నుంచి వచ్చే భక్తులు అంపోలు కింద వంతెన వద్ద సర్వీస్ రోడ్డులో ప్రవేశించి అంపోలు జైలు రోడ్డు మీదుగా ఆడవరం గ్రామం, అంపోలు గ్రామం మీదుగా వాడాడ జంక్షన్ వద్దకు చేరుకొని పార్కిం గ్ చేసుకోవాలన్నారు. దర్శనం అనంతరం తిరిగే వెళ్లే భక్తులు వాడాడ జంక్షన్, సానివాడ గ్రామం, చెట్టువానిపేట జంక్షన్ మీదుగా జాతీయ రహదారికి చేరుకోవాలన్నారు.
కారులు, ఆటోలు పార్కింగ్ చేసే స్థలాలు..
నగరంలోని 80 అడుగుల రోడ్డులో ఉన్న కేంద్ర మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద పక్కన ఖాళీ ప్రదేశంలో ఆటో, టాటా ఏస్, కారు, ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేయాలని పోలీసులు సూచించారు. వీవీఐపీలు తమ వాహనాలను అరసవల్లి సింహద్వారం వద్ద సూర్యతేజ ఫంక్షన్ హాల్ ఖాళీ ప్రదేశం వద్ద పార్కింగ్ చేయాలన్నారు. ఖాజీపేట నుంచి వచ్చే వారు అరసవల్లి మున్సిపల్ హైస్కూల్ ఖాళీ ప్రదేశం వద్ద కారు, ఆటో, ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేయాలన్నారు. పాలాభిషేకం సమయంలో రూ.500 టికెట్‌పై ఇద్దరు వ్యక్తులకు, రూ.300 టికెట్‌పై ఒక వ్యక్తికి అనుమతిస్తామన్నారు. నిర్దేశించిన స్లాట్ టైంలో మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. నిర్దేశించిన పార్కింగ్ స్థలాల్లో మాత్రమే వాహనాలను పార్కింగ్ చేసి పోలీసులకు సహకరించాలన్నారు.
రథసప్తమి రాష్ట్ర పండగ సందర్భంగా అరసవల్లి పరిసర ప్రాంతాలు, శ్రీకాకుళం నగరమంతా కెమెరా, డ్రోన్స్ పర్యవేక్షణతో నిఘాలో ఉంటుందని చెప్పారు. కార్లపై వచ్చే భక్తులు వారి పాదరక్షలు కార్లలోనే భద్రపరచుకోవాలన్నారు. దర్శనానికి వచ్చే భక్తులు పాదరక్షలు శ్రీశయన వీధి, గుడికి దగ్గరలో గల పార్కింగ్ స్థలం వద్ద భద్రపరుచుకోవాలన్నారు. పండుగ సమయంలో జన సమూహం అధికంగా ఉండటం వల్ల చైన్ స్నాచింగ్స్, జేబు దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున భక్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు. భక్తులు దర్శనానికి వచ్చే సమయంలో విలువైన ఆభరణాలు, విలువైన వస్తువులు ధరించి రాకూడదని కోరారు. క్యూలైన్‌లో ఉండే భక్తులకు వివిధ స్వచ్ఛంద సేవ సంస్థల ద్వారా నీరు, మజ్జిగ, ప్రసాదం, చిన్నపిల్లలకు పాలు వంటి ఆహార పదార్థాలు పంపిణీ చేస్తారన్నారు.
దర్శనం ముగించుకున్న భక్తులు స్వామి వారి ప్రసాదాన్ని కొనుక్కునే భక్తుల కోసం మూడు చోట్ల కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. బ్రాహ్మణ వీధి, సెగడివీధి, అసిరి తల్లి గుడి వద్ద ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వెలమ వీధిలో ఉన్న మున్సిపల్ హైస్కూలు వద్ద భక్తులు తలనీలాలు సమర్పించుకోవచ్చునన్నారు. స్నానాలకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాట్లు చేశామని, స్త్రీలకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం అక్కడ నుంచే రూ.100, ఉచిత క్యూలైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డోనర్లు, రూ.500 దర్శనం నిమిత్తం ముందుగా స్లాట్స్ బుక్ చేసుకున్న భక్తులు వారు స్లాట్ సమయంలో దర్శనం చేసుకోలేకపోతే వారు ఉచిత దర్శనానికి వెళ్లాల్సి ఉంటుందన్నారు. టెక్కలి, నరసన్నపేట వైపు నుంచి వచ్చే భక్తులు వారి వాహనాలను అంపోలు రోడ్ మార్గంలో జిల్లా జైలు మీదుగా గార రోడ్డులో ఆలయం దగ్గరలో నిర్దేశించిన ప్రాంతాల్లో పార్కింగ్ చేసుకొని దర్శనం చేసుకోవాలన్నారు. టెక్కలి, నరసన్నపేట వైపు నుంచి వచ్చే భక్తులు దర్శనం అనంతరం ఒప్పంగి జంక్షన్ సానివాడ మీదుగా, శెట్టివానిపేట వద్ద జాతీయ రహదారి 16కు చేరుకొని తిరిగి సురక్షితంగా వెళ్లాలన్నారు. కారు పాస్‌లు ఉన్న భక్తులకు మాత్రమే మిల్ జంక్షన్, తోట జంక్షన్ నుంచి ఆలయం ఆర్చ్ వరకు అనుమతిస్తామన్నారు. ఫిబ్రవరి 2న ఉదయం 7 గంటల నుంచి 8 గంటల సమయంలో 80 అడుగుల రోడ్లో నిర్వహించనున్న సామూహిక సూర్య నమస్కారాలు కార్యక్రమానికి పార్కింగ్ స్థలం కేటాయించామన్నారు. 2న మధ్యాహ్నం మూడు గంటలకు మొదలయ్యే స్వామి వారి శోభాయాత్ర కార్యక్రమం (కార్నివాల్ ) శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ దగ్గర్లో గల అంబేద్కర్ స్టాట్యూ నుంచి డేఅండ్నైట్, 7 రోడ్ జంక్షన్, మిల్ జంక్షన్ మీదుగా అరసవల్లి ఆలయం వరకు నిర్వహించనున్నారని, ప్రజలు ట్రాఫిక్ డైవర్షన్‌కు సహకరించాలని కోరారు.
2, 3 తేదీల్లో నిర్వహించనున్న క్రీడా పోటీలు ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో నిర్వహించనున్నారని, అక్కడే పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. 2, 3 తేదీల్లో నిర్వహించనున్న సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ స్టాల్స్, క్రాఫ్ట్ బజార్, వివిధ ఆలయాలకు చెందిన నమూనా రథాలను ఏర్పాటు చేశారని, ఈ కార్యక్రమాలకు హాజరయ్యే ప్రజలు వారి వాహనాలను కోడి రామ్మూర్తి స్టేడియంలో పార్కింగ్ చేసుకోవాలన్నారు. శ్రీకాకుళం నగరంలో డచ్ బిల్డింగ్ తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం వారిచే ప్రత్యేక ఆకర్షణగా హెలీ టూరిజం ఏర్పాటు చేశారని, దీనిని ఆస్వాదించే ప్రజలు టికెట్స్ ని ముందుగా ఆన్లైన్లో కొనుక్కోవాలన్నారు. టికెట్ లేని వారికి అనుమతించమన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

