News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Top 5 Headlines Today: పొత్తులపై పవన్‌తో చర్చిస్తామన్న పురందేశ్వరి! తెలంగాణలో రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతల బీసీ అస్త్రం!

Top 5 Telugu Headlines Today 19 June 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

FOLLOW US: 
Share:

Top 5 Telugu Headlines Today 19 June 2023:  
ఏపీ అక్రమ అప్పులపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్న ఏపీ బీజేపీ - పొత్తులపై పవన్‌తో చర్చిస్తామన్న పురందేశ్వరి
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో త్వరలో భేటీ అవుతానని ఏపీబీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రకటించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఏపీ ప్రభుత్వ ఆర్థిక అవకతవకలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. వస్తున్న ఆదాయంలో నలభై శాతం వడ్డీలకే కడుతున్నారని.. లెక్కల్లో చూపకుండా అప్పులు తెచ్చి  వృధా చేస్తున్నారని మండిపడ్డారు. పొత్తుల అంశంపై కేంద్ర పార్టీదే తుది నిర్ణయం అని స్పష్టం చేశారు.  ఏపీలోని ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు.  ఆర్థికపరమైన వ్యవహరాల్లో కేంద్రం ఏపీని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉందని స్పష్టం చేశారు.  పూర్తి వివరాలు  

రాజా సింగ్ తో బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల భేటీ 
భారతీయ జనతా పార్టీ సస్పెండ్ చేసిన  గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తో  బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. ఆయనపై సస్పెన్షన్ వేటు వేసి చాలా కాలం అయింది. వివాదాస్పద వీడియో యూట్యూబ్ లో రిలీజ్ చేయడంతో బీజేపీ హైకమాండ్ ఆయనను సస్పెండ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు  పంపింది. ఆ తర్వాత కోర్టు ఉత్తర్వులతో విడుదల అయ్యారు. రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తి వేయాలని తర్వాత తెలంగాణ బీజేపీ శాఖ కూడా హైకమాండ్‌కు సిఫారసు చేసింది. కానీ హైకమాండ్ మాత్రం నిర్ణయం తీసుకోలేదు.  పూర్తి వివరాలు  

119 నియోజకవర్గాల్లో ఈఆర్ఓలు, డీఈఓలను నియమించిన ఈసీ 
2023 తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly Elections 2023) ఎన్నికలు మరో నాలుగైదు నెలల్లో జరగనున్నాయి. ఇప్పటికే పార్టీలు రాజకీయ వ్యూహాల్లో మునిగిపోయాయి. ఇప్పుడు అధికారులు కూడా ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. అక్టోబర్‌ మొదటి పక్షంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. దీనికి ఎన్నికల యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. ఈక్రమంలోనే భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు, 33 జిల్లాలకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (ఈఆర్‌ఓ), జిల్లా ఎన్నికల అధికారుల (డీఈఓ)లను నియమించింది. ఈ అధికారులు ఓటర్ల జాబితాల నిర్వహణ, ఖచ్చితమైన ఓటరు నమోదును నిర్ధారించడం.. అలాగే ఎన్నికల డేటా సమగ్రతను కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తారని తెలిపింది.  పూర్తి వివరాలు  

బెజవాడలో సీట్ల పంపిణీ ఫిక్స్ అయిందా!  
బెజవాడలో మూడు అసెంబ్లీ స్థానానాలు ఉన్నాయి. తాజాగా పవన్ చేసిన కామెంట్స్‌తో మూడు సీట్లను మూడు పార్టీలు పంచుకోవాలని ఫిక్స్ అయినట్లుగా భావిస్తున్నారు. ఇందు కోసం అవసరమైతే సెంట్రల్ నియోజకవర్గ సీటుకు బదులుగా తూర్పు నియోజకవర్గ సీట్‌ను తెలుగు దేశం సర్దుబాటు చేసుకునేందుకు రెడీ అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. విజయవాడ నగరంలోని పశ్చిమ నియోజకవర్గం జనసేన కర్చీఫ్‌ వేసిందని టాక్. సెంట్రల్ నియోజకవర్గ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు.  పూర్తి వివరాలు  

రేవంత్ రెడ్డిపై బీసీ అస్త్రం - కించపరుస్తున్నారని ఉద్యమం చేయాలని బీఆర్ఎస్ బీసీ నేతల నిర్ణయం !
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి బీసీ నేతలను కించ పరిచేలా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ బీసీ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేతలంతా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి బీసీలను  కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు చేశారు.  బీసీలను అణిచివేయాలని లక్ష్యంతో  బీసీ నాయకత్వాన్ని ఎదగనీయకుండా  కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని నేతలు అభిప్రాయానికి వచ్చారు. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు.  పూర్తి వివరాలు  

Published at : 19 Jul 2023 02:51 PM (IST) Tags: BJP YSRCP AP Latest news BRS Telangana LAtest News #tdp

ఇవి కూడా చూడండి

Skill Development Case: సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయనున్న టీడీపీ,  జైల్లో చంద్రబాబుతో చర్చలు

Skill Development Case: సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయనున్న టీడీపీ, జైల్లో చంద్రబాబుతో చర్చలు

Nagababu Meeting: టీడీపీతో పొత్తు తర్వాత రంగంలోకి నాగబాబు, ఆ జిల్లాపై కన్నేసిన జనసేన

Nagababu Meeting: టీడీపీతో పొత్తు తర్వాత రంగంలోకి నాగబాబు, ఆ జిల్లాపై కన్నేసిన జనసేన

Sidharth Luthra : సిద్ధార్థ లూధ్రా మరో ఆసక్తికర ట్వీట్ - ఈ సారి ఏం చెప్పారంటే ?

Sidharth Luthra  : సిద్ధార్థ లూధ్రా మరో ఆసక్తికర ట్వీట్ - ఈ సారి ఏం చెప్పారంటే ?

Ganja in AP: రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన 350 కిలోల గంజాయి - సప్లై చేసేది ఎవరో తెలిస్తే షాక్!

Ganja in AP: రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన 350 కిలోల గంజాయి - సప్లై చేసేది ఎవరో తెలిస్తే షాక్!

Roja: బాలకృష్ణవి చిల్లర చేష్టలు! తోకముడిచి పారిపోయారు - చంద్రబాబు క్షమాపణలు కోరాల్సిందే: రోజా డిమాండ్

Roja: బాలకృష్ణవి చిల్లర చేష్టలు! తోకముడిచి పారిపోయారు - చంద్రబాబు క్షమాపణలు కోరాల్సిందే: రోజా డిమాండ్

టాప్ స్టోరీస్

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్ కోసం స్టోర్ల దగ్గర పడిగాపులు మొదలు - డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు?

iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్ కోసం స్టోర్ల దగ్గర పడిగాపులు మొదలు - డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు?

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279