Top Headlines Today: టీడీపీలో చేరనున్న యార్లగడ్డ వెంకట్రావు ! హౌస్ అరెస్టు చేసిన పోలీసులకు షర్మిల హారతి
Top 5 Telugu Headlines Today 18 August 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

Top 5 Telugu Headlines Today 18 August 2023:
కాంగ్రెస్ సీనియర్లపై కేసీఆర్ ఆకర్ష్ - బీఆర్ఎస్‌లో అలజడి రేపనుందా ?
రాజకీయాల్లో తాము బలపడటం కన్నా ఒక్కో సారి ప్రత్యర్థిని బలహీనపర్చడం గొప్ప వ్యూహం అవుతుంది. కానీ ప్రత్యర్థిపై ఇలాంటి ప్లాన్ అమలు చేసే ముందుకు తమకు ఎఫెక్ట్ అవుతుందేమో పరిశీలించకపోతే... తమ వ్యూహం తమకే బూమరాంగ్ అవుతుంది. పార్టీల్లో చేరికల ద్వారా ఇతర పార్టీల్ని బలహీనం చేయాలని అన్ని పార్టీలు అనుకుంటాయి. కానీ ఆ చేరికలు తమ పార్టీలో కలకలం రేపుతాయని ఆలోచించరు. అలాంటి పరిస్థితి ఎన్నికలకు ముందు తీవ్రం అవుతుంది . ప్రస్తుతం బీఆర్ఎస్ గతంలో జరిగిన చేరికలతో ఇబ్బంది పడుతూంటే.. ప్రస్తుతం మరికొంత మంది సీనియర్లను బీఆర్ఎస్‌లో చేర్చుకుంటారన్న చర్చ జరుగుతోంది. పూర్తి వివరాలు
స్టిక్కర్ సీఎంకి ఎక్స్‌పైర్ డేట్ దగ్గర పడింది- చంద్రబాబు
నాలుగేళ్ల కాలంలో రాష్ట్రానికి ఏం చేశావ్.. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వస్తుంది.. మళ్లీ సంక్షేమ కార్యక్రమాలు పడతాం అన్నారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ స్టిక్కర్ ముఖ్యమంత్రిని నమ్మవద్దని పిలుపునిచ్చారు. ఆరునెలల్లో ఇంటికి పోతారని.. ఎక్సైరీ డేట్ దగ్గర పడిందని.. ఈ పనిచేశానని చెప్పుకునే దమ్ము ఉందా అంటూ జగన్మోహన్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. కొన్ని వందల పనులు చేశాం కాబట్టి తాము చెప్పుకోగలుగుతున్నామని అన్నారు. పూర్తి వివరాలు
Yarlagadda Venkatrao : టీడీపీలోకి యార్లగడ్డ వెంకట్రావు - వైసీపీలో అవమనానించారని ఆవేదన !
పార్టీ కోసం అన్నీ చేసినా ఉంటే ఉండ.. పోతే పో అని సజ్జల రామకృష్ణారెడ్డి అవమానించారని గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించిన ఆయన పార్టీలో తనకు ఎదురవుతున్న పరిస్థితుల్ని ఏకరువు పెట్టారు. ఎక్కువ మంది అనుచరులు టీడీపీలో చేరాలని సూచించడంతో ఆయన .. ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు. తాను గన్నవరం నియోజకవర్గంలో పార్టీ కోసం అన్నీ చేశానన్నారు. పార్టీ కోసం ఎంత కష్టపడినా.. తనకు టిక్కెట్ ఇవ్వలేకపోతున్నానని చెబితే బాగుండేది కానీ.. ఉంటే ఉండు.. పోతే పో అనడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు
షర్మిలను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు- హారతి ఇచ్చి ఆహ్వానించిన వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు
గజ్వేల్ పర్యటనకు సిద్ధమైన వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. లోటస్ పాండ్‌లోని ఆమె ఇంటి వద్దకు భారీగా పోలీసులు తెల్లారేసరికి చేరుకున్నారు. ఎవర్నీ లోనికి పోనివ్వకుండా ఆంక్షలు పెట్టారు. లోపలి వారిని కూడా బయటకు వెళ్లనీయలేదు. ఆంక్షల విషయం తెలుసుకున్న షర్మిల.. బయటకు వచ్చి పోలీసులతో మాట్లాడారు. ఎందుకు హంగామా చేస్తున్నారని వారితో వాగ్వాదానికి దిగారు. అనంతరం వారికి హారతి ఇచ్చి లోపలికి స్వాగతం పలికారు. షర్మిల చర్యతో కంగుతిన్నారు పోలీసులు. పూర్తి వివరాలు
వాలంటీర్లతోనే విజయం - బాపట్ల జిల్లాలో పార్టీ నేతలకు విజయసాయిరెడ్డి దిశానిర్దేశం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వ్యవహరాల పై నేతలు ఫోకస్ పెట్టారు. అదే సమయంలో గెలుపు గుర్రాల ఎంపిక విషయంలో పార్టీ నాయకులు ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. జిల్లాల వారీగా పరిస్దితులను అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి పర్యటనలు కూడా ప్రారంభించారు. బాపట్ల జిల్లాలో పరిస్దితులు, నియోజకవర్గాల ఇంచార్జ్ లు, స్దానికంగా ఉన్న శాసన సభ్యులు వారి పని తీరు పై విజయ సాయి రెడ్డి ప్రత్యేకంగా వాకబు చేశారు. రెండు రోజుల పాటు బాపట్ల జిల్లా పార్టీ వ్యవహారాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఆమంచి తీరు పై నాయకులు విజయ సాయి రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇతర నియోజకవర్గల్లో జోక్యం వద్దని ఇప్పటికే ఆమంచి కి చెప్పామని నాయకులకు విజయ సాయి సర్ది చెప్పారు. పూర్తి వివరాలు





















