Top Headlines: టీటీడీ కొత్త ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు - తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మక అడుగులు, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Today Top News In AP And Telangana:
1. టీటీడీ కొత్త ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు
తిరుమలలో పని చేసే వాళ్లంతా హిందువులై ఉండాలని అభిప్రాయపడ్డారు. టీటీడీకి కొత్త ఛైర్మన్‌గా ఎంపికైన బీఆర్‌నాయుడు. దీనిపై త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. టీటీడీ ఛైర్మన్‌గా ఎంపికైన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబుకు, ఎన్డీఏ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. గత ఐదేళ్లపాటు ప్రభుత్వం చేసే అక్రమాలు అరాచకాలు చూడలేకే తిరుమల దర్శనానికి వెళ్లలేదని అన్నారు బీఆర్‌నాయుడు. చిత్తూరు జిల్లాలో పుట్టి పెరిగిన తాను ఏడాదికి ఐదారుసార్లు కొండకు వెళ్లే వాళ్లమని గుర్తు చేశారు. ఇంకా చదవండి.
2. గూగుల్ ప్రతినిధులతో మంత్రి లోకేశ్ చర్చలు
అమెరికాలో విస్తృతంగా పర్యటిస్తున్న ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ చాలా కీలకమైన చర్చల్లో పాల్గొంటున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని గూగుల్ క్యాంపస్‌ను సందర్శించారు. గూగుల్ క్లౌడ్ సిఇఓ థామస్ కురియన్, బికాస్ కోలే (వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ నెట్ వర్కింగ్), రావు సూరపునేని (వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ అప్లికేషన్ ప్లాట్ ఫామ్స్), చందు తోట (వైస్ ప్రెసిడెంట్, గూగుల్ మ్యాప్స్)తో లోకేష్ భేటీ అయ్యారు. గూగుల్ క్లౌడ్ ప్రతినిధులు మాట్లాడుతూ... ఆన్‌లైన్ రీసెర్చి, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ అడ్వర్టైజింగ్‌లో తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని తెలిపారు. ఇంకా చదవండి.
3. ఆస్తుల వివాదానికి ముగింపు ఏమిటి?
ఘర్ ఘర్ కి కహానీ అని తన ఇంట్లో జరుగుతున్న ఆస్తుల వివాదంపై జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. కానీ అందరి ఇళ్లల్లో ఉండే కహానీలపై ఎవరికీ ఆసక్తి ఉండదు. కానీ వైఎస్ కుటుంబంలో కహానీలు అంటే ప్రజలు అందరూ ఆసక్తి చూపిస్తారు. పొలిటికల్ గా పవర్ ఫుల్ల ఫ్యామీల్లో ఒకటి.. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన జగన్ వ్యవహారశైలి ఇందులో చర్చనీయాంశమవుతాయి కాబట్టి రాజకీయంగా కూడా కీలకమే. ఇప్పుడీ వివాదాన్ని వీలైనంత త్వరగా ముగించుకోకపోతే జగన్మోహన్ రెడ్డినే ఎక్కువగా రాజకీయంగా నష్టపోతారు. అందుకే ఇప్పుడు ఓ పరిష్కారం వెదుక్కోవవాల్సిన అవసరం ఏర్పడింది. ఇంకా చదవండి.
4. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మక అడుగులు
" మరో ఏడాదిలో కేసీఆర్ పేరు ఎక్కడా వినపడకుండా చేస్తా. కేటీఆర్‌తోనే కేసీఆర్‌ను బయటకు రాకుండా చేస్తా. తర్వాత కేటీఆర్, హరీష్ పోటీలో కేటీఆర్ కనిపించకుండా పోతాడు. హరీష్ ను ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు "... ఈ కామెంట్స్ అన్నీ సీఎం రేవంత్ రెడ్డివి. ఆయన ఎక్కడ అన్నారు అంటే ఆధారాలు ఉండవు. ఎందుకంటే ఆఫ్ ది రికార్డుగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇష్టాగోష్టి మాటలు. మీడియా ప్రతినిధులతో మాట్లాడితే ఆటోమేటిక్ గామీడియాలో వస్తాయి. వచ్చాయి కూడా. ఈ మాటలు విన్న తర్వాత బీఆర్ఎస్ నేతలకు బీపీ రాకుండా ఉంటుందా ?. ఇంకా చదవండి.
5. టీషర్ట్ వేసుకున్నాడని డిప్యూటీ సీఎంపై పిటిషన్
తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ స్టాలిన్ ధరించిన టీ షర్టు వివాదానికి కారణమైంది. ఆ రాష్ట్ర హైకోర్టులోనే ఏకంగా పిటిషన్ దాఖలైంది. దీన్ని మద్రాస్ హైకోర్టు విచారించింది. మంత్రులకు డ్రెస్ కోడ్ ఏమైనా ఉందా అంటూ ప్రశ్నించింది. ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ టీ షర్ట్ ధరించడం చర్చనీయాంశంగా మారింది. డీఎంకే ఉదయించే సూర్యుడి లోగో ఉన్న టీ షర్ట్ ధరించి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం సంప్రదాయానికి విరుద్ధమని అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి జయకుమార్ అన్నారు. ఇంకా చదవండి.