అన్వేషించండి

Google News: గూగుల్‌తో మంత్రి నారా లోకేష్ చర్చలు- విశాఖలో డాటా సెంటర్ ఏర్పాటుకు రిక్వస్ట్

Andhra Pradesh News: ప్రజలకు మెరుగైన సేవలు, యువతకు ఉపాధి కల్పించేందుకు ఏపీ ప్రభుత్వంతో చేతులు కలపాలని గూగుల్‌ను మంత్రి నారా లోకేష్ రిక్వస్ట్ చేశారు. గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.

Nara Lokesh Talk With Google: అమెరికాలో విస్తృతంగా పర్యటిస్తున్న ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్‌ చాలా కీలకమైన చర్చల్లో పాల్గొంటున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని గూగుల్ క్యాంపస్‌ను సందర్శించారు. గూగుల్ క్లౌడ్ సిఇఓ థామస్ కురియన్, బికాస్ కోలే (వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ నెట్ వర్కింగ్), రావు సూరపునేని (వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ అప్లికేషన్ ప్లాట్ ఫామ్స్), చందు తోట (వైస్ ప్రెసిడెంట్, గూగుల్ మ్యాప్స్)తో లోకేష్ భేటీ అయ్యారు. 

గూగుల్ క్లౌడ్ ప్రతినిధులు మాట్లాడుతూ... ఆన్‌లైన్ రీసెర్చి, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ అడ్వర్టైజింగ్‌లో తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని తెలిపారు. ఏఐ, అటానమస్ టెక్నాలజీలో వెంచర్లతో పురోభివృద్ధి సాధిస్తోందని చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఆల్ఫాబెట్ (గూగుల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారుగా $2.01 ట్రిలియన్‌లుగా ఉందని వివరించారు. 

గూగుల్ ప్రతినిధులతో మంత్రి లోకేష్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ క్లౌడ్ ఇన్ ఫ్రాస్ట్చక్చర్ హబ్‌గా తయారవుతోందని పేర్కొన్నారు. విశాఖపట్నంలో డాటా సెంటర్ల ఏర్పాటుపై దృష్టిసారించామని పిపిపి మోడ్‌లో గూగుల్ క్లౌడ్ డాటా సెంటర్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించమని రిక్వస్ట్ చేశారు. ఈ రంగంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మకమైన ప్రాంతమని తెలిపారు. చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ఏఐ ఆధారిత ఈ-గవర్నెన్స్, స్టార్ట్ సిటీ కార్యక్రమాలను అమలుచేస్తోందని చెప్పారు. ప్రభుత్వ కార్యకలాపాలు డిజిటలైజ్ చేయడం ద్వారా మెరుగైన పౌరసేవలు అందించేందుకు ఏఐ టూల్స్, ఎంటర్ ప్రైజ్ సొల్యూషన్స్ కల్పించమన్నారు. స్టార్ట్ సిటీల్లో జియో స్పేషియల్ సేవల్లో భాగంగా రియల్ టైమ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, డిజాస్టర్ రెస్పాన్స్, అర్బన్ ప్లానింగ్‌తో సహా స్మార్ట్ సిటీ కార్యక్రమాలను గూగుల్  మ్యాప్స్‌తో అనుసంధానించడం కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలసి పని చేయాలని అభ్యర్థించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ ఎడ్యుకేషన్, యువత నైపుణ్యాభివృద్ధికి ఏఐ ఆధారిత శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు లోకేష్. డిజిటల్ మౌలిక సదుపాయాలు నిర్మించడం, ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడం, స్మార్ట్ సిటీ సామర్థ్యాలను మెరుగుపరచడంలో ప్రభుత్వంతో చేతులు కలపాలని రిక్వస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదనలపై గూగుల్ క్లౌడ్ ప్రతినిధులు స్పందిస్తూ... సహచర బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Also Read: శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ, ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Neha Shetty : గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Embed widget