Top Headlines: షర్మిలతో ఆస్తి తగాదాలపై జగన్ స్పందన - తెలంగాణలో పేలనున్న పొలిటికల్ బాంబ్, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Top Headlines In AP And Telangana:
1. షర్మిలతో ఆస్తి తగాదాలపై జగన్ స్పందన
వైఎస్ ఫ్యామిలీలో జరుగుతున్న ఆస్తులు అంతస్తుల సీరియల్‌పై వైఎస్ జగన్ స్పందించారు. ప్రతి ఇంట్లో జరుగుతున్న విషయాలనే ఏదో జరిగి పోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ప్రజా సమస్యలపై పోరాడుతుంటే వాటి నుంచి డైవర్ట్ చేయడానికే ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. విజయనగరం జిల్లా గుర్ల గ్రామాన్ని సందర్శించిన జగన్... అతిసారంతో ముృతి చెందిన వ్యక్తుల ఫ్యామిలీలను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ఎప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నా ఏదో విషయంపై ప్రచారం చేసి డైవర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఇంకా చదవండి.
2. ఒంగోలు జిల్లాలో దారుణ ఘటన
ఒంగోలులో సంచలనం సృష్టించే కేసు ఒకటి రిజిస్టర్ అయింది. తల్లితో సహజీవన చేస్తూనే ఆమె కుమార్తెను ట్రాప్ చేసిన ఘటనపై కేసు నమోదు అయింది. ఒంగోలుకు సమీపంలో ఉంటున్న ఓ వివాహిత తన కుమార్తెతో కలిసి ఉంటోంది. భర్తకు దూరంగా ఉంటున్న ఆ ఇద్దరి బాగోగులను టంగుటూరు మండలం పొందూరుకు చెందిన ఇండ్లా రాజు చూసే వాడు. ఈ క్రమంలోనే తల్లికి చాలా దగ్గరయ్యాడు. అది కాస్త సహజీవనంగా మారిపోయింది. తల్లితో సహజీవనం చేస్తున్న రాజు... పదో తరగతి చదువుతున్న ఆమె కుమార్తెను రోజూ స్కూల్‌కు తీసకెళ్లి తీసుకొచ్చే వాడు. ఇలా చేస్తూనే ఆమెను కూడా మోసం చేయడం ప్రారంభించాడు. ఇంకా చదవండి.
3. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ సమాచారం
తూర్పు మధ్య బంగాళాఖాతం మీద ఉన్న తీవ్ర వాయుగుండంగా బలపడి, బుధవారం ఉదయం దానా తుఫానుగా మారింది. ఆపై వాయువ్య దిశగా గంటకు 15 కి. మీ. వేగంతో కదులుతూ అదే ప్రాంతంలో 16.5 డిగ్రీల ఉతర అక్షాంశం, 89.6 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద, దాదాపు పారాదీప్ (ఒడిశా)కి ఆగ్నేయంగా 520 కిలోమీటర్లు, సాగర్ ద్వీపం (పశ్చిమ బెంగాల్) కు ఆగ్నేయంగా 600 కి.మీ., బాంగ్లాదేశ్ లోని భేపుపరాకు దక్షిణ ఆగ్నేయంగా 610 కి.మీ దూరంలోను తుపాను కేంద్రీకృతమై ఉందని భాతర వాతావరణ కేంద్రం తెలిపింది. ఇంకా చదవండి.
4. తెలంగాణలో పేలనున్న పొలిటికల్ బాంబ్
తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ బాంబుల పేలుళ్లు ఎక్కువైపోతున్నాయి. ఏపీలో టీడీపీ, వైసీపీ బాంబులు పేలిస్తే ఇప్పుడు తెలంగాణ వంతు వచ్చింది. ఇక్కడ కూడా ఓ బాంబు పేలపోతోందని మంత్రి ప్రకటించడం సంచలనంగా మారింది. ఒకట్రెండు రోజుల్లో పొలిటికల్ బాంబు పేలుతుందని సమాచారం ప్రసారాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. అసలు ప్రభుత్వం ఏం చేయబోతోంది... శ్రీనివాస్ రెడ్డి చెబుతున్న ఆ బాంబు ఏంటనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. ఇది కచ్చితంగా కేసులు రిలేటెడ్‌గానే ఉంటుందని ఆయన చెప్పకనే చెప్పారు. ఇంకా చదవండి.
5. దీపావళి షాపింగ్‌లో ఈ పొరపాటు చెయ్యొద్దు
పండుగ అంటేనే సందడి. కిరాణా సరుకుల నుంచి కొత్త బట్టల వరకు చాలా కొనాలి. వచ్చే వారంలో ధన్‌తేరస్ (Dhanteras 2024), దీపావళి (Diwali 2024) వేడుకలు ఉన్నాయి. ఈ పండుగల షాపింగ్‌తో మార్కెట్లు సందడిగా మారాయి. పండుగ షాపింగ్‌లో ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్ షాపింగ్‌కు కూడా క్రేజ్ ఉంది. ప్రస్తుత పండగ సీజన్‌లోఅమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart) సహా చాలా ఆన్‌లైన్ ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌లు స్పెషల్ సేల్స్ పెట్టి భారీ స్థాయిలో వస్తువులు అమ్ముతున్నాయి. దీంతో, ఈ పండుగ సీజన్ (Festive Season 2024) షాపింగ్ సమయంలో డిజిటల్ చెల్లింపు మోసాల ప్రమాదం కూడా పెరిగింది. ఇంకా చదవండి.